Rachita Ram
-
దర్శన్‌తో జోడీ.. ఆయనే నా గురువు అంటున్న బ్యూటీ (ఫొటోలు)
-
దర్శన్ నా గురువు.. ఆయన ఇలా చేశారంటే..: హీరోయిన్
కొద్దిరోజులుగా హీరో దర్శన్ పేరు మారుమోగిపోతోంది. తనేదో మంచి పని చేసినందుకు కాదు.. తన గ్యాంగ్‌తో కలిసి అభిమాని రేణుకాస్వామిని అతి క్రూరంగా చంపినందుకు! జూన్ 11న రేణుకాస్వామి హత్య జరగ్గా.. ఈ కేసులో దర్శన్, అతడి ప్రియురాలు పవిత్ర గౌడతో పాటు పలువురినీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారం గురించి కన్నడ హీరోయిన్ రచితా రామ్ తాజాగా స్పందించింది. ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. దర్శన్.. గురువుదర్శన్.. నన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆయన నాకు గురువులాంటివారు. నేనేదైనా తప్పు చేస్తే సరిదిద్దుతూ సలహాలు ఇచ్చే వ్యక్తి ఇలాంటి కేసులో భాగమయ్యారంటే నమ్మలేకపోతున్నాను. పోలీసులు నిజాన్ని వెలికితీస్తారని ఆశిస్తున్నాను. మీడియా కూడా పక్షపాతం లేకుండా వ్యవహరిస్తుందని భావిస్తున్నాను. న్యాయం గెలుస్తుందిరేణుకాస్వామి ఆత్మకు శాంతి చేకూరాలి. అతడి కుటుంబం ధైర్యాన్ని కూడదీసుకోవాలి. ఈ కేసులో న్యాయమే గెలుస్తుందని నమ్ముతున్నాను అని రాసుకొచ్చింది. కాగా రచితా రామ్ తొలి సినిమా బుల్బుల్. ఈ మూవీలో దర్శన్ హీరోగా, రచిత హీరోయిన్గా నటించింది. వీరిద్దరూ అంబరీష, జగ్గు దాదా, అమర్, క్రాంతి చిత్రాల్లో కలిసి యాక్ట్ చేశారు. కన్నడలో పలు సినిమాలు చేసిన ఈమె తెలుగులో 'సూపర్ మచ్చి' మూవీతో పలకరించింది. View this post on Instagram A post shared by Rachitaa Ram (@rachita_instaofficial)చదవండి: షారూఖ్ ఖాన్‌కు యాటిట్యూడ్? బిగ్‌బీని తక్కువ చేసి.. -
ఆకట్టుకుంటున్న అర్జున్ సర్జా మేనల్లుడు ధ్రువ సర్జా ‘పుష్పరాజ్’ ట్రైలర్
కన్నడ హీరో ధ్రువ సర్జా, రచిత రామ్, హరిప్రియ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘పుష్పరాజ్ ది సోల్జర్’. ఆర్.యస్ ప్రొడక్షన్స్ ఆర్. శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో గ్రీన్ మెట్రో మూవీస్, వి సినిమాస్ పతాకాలపై తెలుగులోకి అనువదిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 27న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన చిత్రం బృందం నేడు ఈ మూవీ ఆడియో, ట్రైలర్‌ను లాంచ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నిర్మాత రామ సత్యనారాయణ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్లో చేతులు మీదుగా చిత్ర ట్రైలర్ విడుదల చేయించింది. చదవండి: క్రేజీ ఆఫర్.. మహేశ్-త్రివిక్రమ్‌లో చిత్రంలో వేణు? ఇక ట్రైలర్ లాంచ్ చేసిన అనంతరం ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ‘‘పుష్పరాజ్’ టైటిల్ చూస్తుంటే చార్లెస్ శోభరాజ్, అల్లు అర్జున్ సినిమాలు గుర్తుకు వస్తాయి. కమర్సియల్ గా చూసుకుంటే ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి.ఇదే హీరో తెలుగులో చేసిన పొగరు సినిమా కూడా బాగా ఆడింది.హీరో ధ్రువ సర్జా ను చూస్తుంటే అర్జున్ గారు వయసులో ఉన్నప్పుడు మా పల్లెలో గోపాలుడు టైమ్ లో ఎలా ఉండేవాడో ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఆలాగే ఉన్నాడు’ అని అన్నారు. ఇక టైలర్ చాలా చూశానని, చాలా బాగుందన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ చిత్ర యూనిట్‌కు ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు. -
పుష్పరాజ్‌గా వస్తోన్న అర్జున్ సర్జా మేనల్లుడు ధ్రువ
రియల్ ఎస్టేట్ రంగంలో అంచెలంచెలుగా ఎదిగారు బొడ్డు అశోక్. సినిమారంగంలో కూడా తన సత్తా చాటుకోవడానికి నిర్మాతగా మారాడాయన. ధ్రువ సర్జా, రచిత రామ్ హరిప్రియ జంటగా కన్నడలో రూపొందిన 'పుష్పరాజ్: ది సోల్జర్' చిత్రాన్ని ఆర్.యస్ ప్రొడక్షన్స్ ఆర్.శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో గ్రీన్ మెట్రో మూవీస్, వి సినిమాస్ పతాకాలపై తెలుగులోకి అనువదిస్తున్నారు. ఆగస్టు 19న సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత బొడ్డు అశోక్ మాట్లాడుతూ.. 'భార్జరీ సినిమా ద్వారా కన్నడ రంగంలో అడుగుపెట్టాడు అర్జున్ సర్జా మేనల్లుడు ధ్రువ సర్జా. ఈయన హీరోగా కన్నడలో రూపొందిన 'పుష్పరాజ్ ది సోల్జర్' చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నాము. ధ్రువ సర్జా సరసన అందాల తార రచితా రామ్ హరిప్రియ హీరోయిన్ గా నటించింది. తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన కమర్షియల్ అంశాలన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి. అల్లు అర్జున్ గారు నటించిన "పుష్ప" సినిమాతో పుష్పరాజ్ పేరు ఎంతో ఫేమస్ అయ్యింది. ఎప్పుడైతే ఈ టైటిల్ పెట్టామో మా సినిమాకు కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా నాకు నిర్మాతగా మంచి పేరు తెస్తుందన్న నమ్మకంతో ఉన్నాను. ప్రతి రంగంలో సక్సెస్ అయ్యే నేను సినిమా రంగంలో కూడా నిర్మాతగా సక్సెస్ అవుతానన్న నమ్మకంతో ఉన్నాను. తెలుగులో అర్జున్ చిత్రాలు ఎలాగైతే ఆదరించారో.. ఈ చిత్రాన్ని కూడా అదే విధంగా ఆదరిస్తారని నమ్మకం ఉంది' అన్నారు. చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ఒక లెజెండ్, ఆ ఛాన్స్ వస్తే బాగుండు అతడు డ్రగ్స్ తీసుకోవడం కళ్లారా చూశా.. హీరో మాజీ ప్రేయసి -
‘సూపర్ మచ్చి’మూవీ రివ్యూ
టైటిల్ : సూపర్ మచ్చి నటీ,నటులు: కల్యాణ్ దేవ్, రచిత రామ్, వీకే నరేష్, పోసాని కృష్ణ మురళి, రాజేంద్ర ప్రసాద్, ప్రగతి, మహేష్ ఆచంట తదితరులు నిర్మాత : రిజ్వాన్ దర్శకత్వం : పులి వాసు సంగీతం: తమన్ సినిమాటోగ్రఫీ: శ్యామ్ కే నాయుడు ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేష్ విడుదల తేది: జనవరి 7, 2022 మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా ‘విజేత’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు కల్యాణ్‌దేవ్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. ఆ ఉత్సాహంతోనే ‘సూపర్ మచ్చి’ అనే సినిమాలో నటించాడు. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యంగ్ హీరో.. లుక్స్, ఫిజిక్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. అందుకే ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ కూడా సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సూపర్ మచ్చి’సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసే మీనాక్షి (రచిత రామ్).. బార్లో పాటలు పాడుతూ.. ఆవారాగా తిరిగే (రాజు)ని అమితంగా ప్రేమిస్తుంది. అతను ఇష్టం లేదని చెప్పినా అతని వెంటే పడుతుంది. దీంతో ఆమెను వదిలించుకోవడానికి ఒక నైట్ తనతో గడిపితే నీ ప్రేమని అంగీకరిస్తానని కండీషన్ పెడతాడు. దానికి కూడా ఆమె ఒప్పుకుంటుంది. నెలకు లక్షన్నర సంపాదించినే మీనాక్షి.. చదువు సంధ్య లేని రాజుని ఎందుకు ప్రేమించింది? ప్రాణం కన్న మిన్నగా ప్రేమించిన మీనాక్షిని రాజు ఎందుకు దూరంగా పెట్టాడు? మీనాక్షిని చూడకుండా ప్రేమించిదెవరు? మీనాక్షి తండ్రి(రాజేంద్రప్రసాద్) చివరి కోరిక కోసం ఏంటి? చివరకు మినాక్షి , రాజులు ఎలా ఒక్కటయ్యారు? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే..? బాధ్యతలేని యువకుడిగా, చూడని ప్రియురాలి కోసం తపన పడే ప్రేమికుడు రాజు పాత్రలో కల్యాణ్ దేవ్ మంచి నటనను కనబరిచాడు. డ్యాన్స్‌తో పాటు ఫైట్స్ సీన్స్‌లో కూడా అద్భుతంగా నటించారు. తెరపై చాలా జోష్‌గా కనిపిస్తాడు. ఇక మీనాక్షిగా రచిత రామ్ యాక్టింగ్ చాలా బాగుంది. సినిమా భారాన్ని మొత్తం భుజాన వేసుకొని నడిపించింది. సెకండాఫ్‌లో వచ్చే ఎమోషన్స్ సినిమాలో కూడా అద్భుతంగా నటించింది. హీరో తల్లిదండ్రులుగా నరేశ్, ప్రగతి మరోసారి తెరపై తమ అనుభవాన్ని చూపించారు. మీనాక్షి తండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్ ఒదిగిపోయారు. పొసాని కృష్ణమురళి, మహేష్ ఆచంట, భద్రంతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? ప్రేమ, ఎమోషన్స్, తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ లాంటి అంశాలు ఉన్న చిత్రమే సూపర్ మచ్చి. ఇలాంటి కథలు టాలీవుడ్లో చాలా వచ్చాయి. కానీ చూడకుండా ప్రేమించుకోవడం ఇంట్రెస్టింగ్ పాయింట్లో కథను ముందుకు నడిపాడు దర్శకుడు పులి వాసు. ఆయన ఎంచుకొన్న పాయింట్ బాగున్నప్పటీకీ.. తెరపై చూపించడంలో కాస్త తడపడ్డాడు. ఫస్టాఫ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా నడిపించాడు. బాధ్యతలేని రాజుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీనాక్షి ఎందుకు ప్రేమిస్తుందనే విషయాన్ని ఇంటర్వెల్ వరకు ఆపి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగేలా చేశాడు. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే సెకండాఫ్‌లో మాత్రం కథ కాస్త రోటీన్‌గా సాగుతుంది. తండ్రి, కూతుళ్ల మధ్య వచ్చే ఎమోషన్స్ సీన్స్ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. కానీ ఎలాంటి అశ్లీలత, బూతులు లేకుండా సినిమాను తెరకెక్కించిన తీరు బాగుంది. ఇక సాంకెతిక విషయానికొస్తే.. తమన్ సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినప్పటికీ.. నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటర్ మార్తాండ్ వెంకటేష్ సెకండాఫ్‌లోని కొన్ని సీన్స్‌ని ఇంకాస్త క్రిస్పీగా కట్ చేస్తే మరింత బాగుండేది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మాణ విలువలు బాగున్నాయి. మంచి కథను, దానికి తగిన నటీనటుల ఎంపిక విధానం చూస్తే.. సినిమాపై రిజ్వాన్‌కు ఉన్న అభిరుచి ఏంటో అర్థమవుతుంది. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమా మొత్తాన్ని చాలా రిచ్‌గా తెరకెక్కించారు. -
బోల్డ్ సీన్స్‌పై ప్రశ్నించిన రిపోర్టర్, పెళ్లి తర్వాత మీరేం చేస్తారన్న హీరోయిన్
Kannada Actress Rachitha Ram Strong Counter To Reporter Who Questioned Her Bold Scenes: కన్నడ స్టార్ హీరోయిన్, ‘డింపుల్ క్వీన్’ రచిత రిపోర్టర్‌పై ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కింది. తన మూవీ ప్రమోషన్లో భాగంగా మీడియాతో ముచ్చటించిన రచిత ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు తిరిగి దిమ్మతిరిగే ప్రశ్న వేయడం అందరిని షాక్ గురి చేసింది. రచిత తాజా చిత్రం ‘లవ్ యూ రచ్చు’. ఈ మూవీ త్వరలో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా టీమ్ మీడియాతో ముచ్చటించింది. చదవండి: పునీత్ మృతికి రజనీ సంతాపం, కన్నింగ్ ఫెలో అంటూ విమర్శలు ‘లవ్ యూ రచ్చు’లో రచిత చేసిన కొన్ని బోల్డ్ సీన్స్‌పై రిపోర్టర్ ప్రశ్నించగా అతడికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది రచిత. ఈ సినిమాలో హీరోహీరోయిన్ మధ్య కొన్ని శృతి మించిన శృంగార సన్నివేశాలు ఉన్నాయట. వీటిపై విలేకరులు అడగ్గా.. ‘కథ డిమాండ్ చేసినట్టుగా నేను నటించాను’ అని సమాధానం ఇచ్చింది. అయితే ఇంతకు ముందు బోల్డ్ సీన్స్ చేయనని చెప్పి ఇప్పుడు ఈ సినిమాలో ఎందుకు నటించారని ప్రశ్నించిన రిపోర్టర్‌కు రచిత ఊహించని రీతిలో జవాబిచ్చింది. చదవండి: దుల్కర్ చిత్రానికి రూ. 40 కోట్ల ఓటీటీ డీల్, ఒప్పందం రద్దు చేయించిన మమ్ముట్టి! అదేంటంటే ‘మిమ్మల్ని ఒకటి అడుగుతాను. పెళ్లి తర్వాత మీరు ఏం చేస్తారు? సాధారణంగా అందరూ చేసేది ఏంటి? రొమాన్సే కదా.. అదే మా సినిమాలో చూపించారు’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. అలాగే ‘గతంలో హీరో ఉపేంద్రతో ‘ఐ లవ్ యూ’ సినిమాలో కూడా ఇలాంటి సీన్స్‌లో నటించాను. అవి మా కుటుంబ సభ్యులను బాధించాయి. ఆ తర్వాత అలాంటి సన్నివేశాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నాను. కానీ మళ్లీ అలాంటి సీన్స్‌లో నటించానంటే దానికి ఓ అర్ధం ఉంది. అదేంటో ఈ సినిమా చూసిన తర్వాత మీకే తెలుస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా రచిత మెగాస్టార్ అల్లుడు కల్యాణ్ దేవ్ హీరో వస్తున్న ‘సూపర్ మచ్చి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. చదవండి: Prabhas Adipurush Movie: 103 రోజుల్లోనే షూటింగ్ పూర్తి, ఆశ్చర్యంలో ఫ్యాన్స్ -
శాండల్ వుడ్ నుంచి వచ్చిన హీరోయిన్లు వీళ్లే!
తెలుగులో ఎప్పుడూ ముంబయ్ భామలదే హవా. ఆ తర్వాత మలయాళ బ్యూటీలది. బెంగళూరు భామలు ఇక్కడ తక్కువే. అప్పట్లో సౌందర్య ఓ వెలుగు వెలిగారు. తర్వాత అనుష్క కూడా పెద్ద రేంజ్‌కి వెళ్లారు. ఇలా అప్పుడప్పుడూ ఒకరిద్దరు వస్తుంటారు. అయితే ఇప్పుడు మాత్రం కన్నడ భామలు అరడజను పైనే తెలుగుకి వచ్చారు శాండల్‌వుడ్ నుంచి వచ్చిన చందన పరిమళాలు రష్మికా మందన్నా, నభా నటేశ్, కృతీ శెట్టి, శ్రీలీల, శ్రద్ధా శ్రీనాథ్, రచితా రామ్, కావ్యా శెట్టి చేస్తున్న సినిమాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు తెలుగు పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో రష్మికా మందన్నా ఒకరు. ‘ఛలో’ సినిమాతో తెలుగు తెరపై మెరిసిన ఈ కన్నడ బ్యూటీ ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి హిట్స్‌తో అందర్నీ ఆకట్టుకున్నారు. మహేశ్‌బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి దక్కిన చాన్స్ రష్మిక కెరీర్‌ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకుని వెళ్లింది. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమాలో హీరోయిన్గా చేస్తున్నారు. అలాగే శర్వానంద్ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రంలో కూడా రష్మికాయే హీరోయిన్. తెలుగులో ఆమె సంపాదించుకున్న క్రేజ్ బాలీవుడ్ వరకు చేరింది. హిందీలో ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్స్ (అమితాబ్ బచ్చన్‌తో ‘గుడ్ బై’, సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘మిషన్ మజ్ను’, మరో సినిమా ప్రకటన త్వరలో రానుంది) రష్మిక చేతిలో ఉన్నాయి. ఇక ఒక్క సినిమాతోనే సెన్సేషనల్ హీరోయిన్ అనిపించుకోవడం ఏ కొందరికో కుదురుతుంది. కృతీ శెట్టి ఈ కోవలోకే వస్తారు. ‘ఉప్పెన’ ద్వారా పరిచయమైన ఈ క్యూట్ బ్యూటీకి తెలుగులో మంచి ఆఫర్లు ఉన్నాయి. నిజానికి ‘ఉప్పెన’ సినిమా విడుదలకు ముందే నానీతో ‘శ్యామ్ సింగరాయ్’, సుధీర్‌బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రాల్లో హీరోయిన్గా చాన్స్ దక్కించుకున్న కృతి ఇటీవల రామ్ కొత్త సినిమాలో హీరోయిన్గా ఎంపిక అయ్యారు. మరో తెలుగు సినిమాకు కూడా కృతి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా తక్కువ సమయంలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయారు కృతీ శెట్టి. మరోవైపు కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న శ్రీ లీల సైతం రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను సొంతం చేసుకున్నారు. రవితేజ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఒక హీరోయిన్గా నటిస్తున్నారు శ్రీ లీల. అలాVó హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న ‘పెళ్లిసందడి’ చిత్రంలో శ్రీ లీలయే కథానాయిక. సేమ్ కృతీ శెట్టి మాదిరిగానే తెలుగులో తనది ఒక్క సినిమా విడుదల కాకుండానే శ్రీ లీల రెండు సినిమాలకు సైన్ చేయడం విశేషం. ఇక హైదరాబాద్‌లో పుట్టి నప్పటికీ బెంగళూరులోనే పెరిగారు కథానాయిక నభా నటేష్. ఆమె మాతృభాష కన్నడ. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి హిట్ నభా ఖాతాలో ఉంది. ప్రస్తుతం నితిన్ ‘మ్యాస్ట్రో’ (హిందీ చిత్రం ‘అంధాధున్’ తెలుగు రీమేక్)లో నభా నటేష్ హీరోయిన్. జాతీయ అవార్డు సాధించిన నాని ‘జెర్సీ’ చిత్రంతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మరో కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్. ప్రస్తుతం ‘యాత్ర’ ఫేమ్ మహి వి రాఘవ్ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నారు. ‘సిద్దా లోకం ఎలా ఉంది నాయనా’ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగులో కొత్త అయినప్పటికీ రచితా రామ్ శాండల్‌వుడ్‌లో పాపులర్ హీరోయిన్. ‘సూపర్ మచ్చి’తో ఆమె తెలుగుకి పరిచయం అవుతున్నారు. ఇందులో చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరో. కన్నడంలో మంచి ఫామ్‌లో ఉన్న మరో బ్యూటీ కావ్యా శెట్టి కన్నడ హిట్ ‘లవ్ మాక్ౖటైల్’ తెలుగు రీమేక్ ‘గుర్తుందా.. శీతాకాలం’లో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఇందులో సత్యదేవ్, తమన్నా హీరోహీరోయిన్. చూశారుగా.. ఇప్పుడు తెలుగులో చందన పరిమళం ఎక్కువగా వీస్తోంది. శాండల్‌వుడ్ నుంచి ఇంకెంతమంది కథానాయికలు వస్తారో చూడాలి. -
సూపర్ స్టెప్
కల్యాణ్‌దేవ్, రచితారామ్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘సూపర్‌మచ్చి’. పులి వాసు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రిజ్వాన్, ఖుషీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని ఓ పాటను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. కల్యాణ్ దేవ్‌తో పాటు నట కిరీటి రాజేంద్రప్రసాద్ ఈ పాటలో నటిస్తున్నారు. ఇద్దరూ సూపర్ స్టెప్పులేస్తున్నారని చిత్రబృందం పేర్కొంది. తమన్ స్వరపరచిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, అనీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ పాటతో పాటు మరో పాట చిత్రీకరిస్తే సినిమా పూర్తయినట్లే. నిర్మాతలు మాట్లాడుతూ–‘‘లవ్‌స్టోరీ మిక్స్ చేసిన మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మా ‘సూపర్‌మచ్చి’. కల్యాణ్‌దేవ్ నటన, రచితారామ్ సినిమాకు ప్లస్సవుతుంది. తమన్ సంగీతం మా సినిమాకు హైలెట్ అవుతుంది’’ అన్నారు. -
సెట్లోకి సూపర్ మచ్చి
‘విజేత’ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న కల్యాణ్ దేవ్ (చిరంజీవి చిన్నల్లుడు) హీరోగా నటిస్తున్న ద్వితీయ చిత్రం ‘సూపర్ మచ్చి’. పులి వాసు దర్శకుడు. రచితా రామ్ కథానాయికగా నటిస్తున్నారు. రిజ్వాన్, ఖుషి నిర్మిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రిజ్వాన్, ఖుషి మాట్లాడుతూ– ‘‘లవ్ స్టోరీ మిక్స్ చేసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. అటు మాస్ ఇటు కుటుంబ ప్రేక్షకులకి కల్యాణ్ దేవ్ పాత్ర నచ్చుతుంది. తమన్ మ్యూజిక్ హైలైట్‌గా నిలుస్తుంది. ‘సూపర్ మచ్చి’ టైటిల్ సాంగ్ బాగా వచ్చింది. షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమతించడంతో మా షూటింగ్ మొదలుపెట్టాం. కల్యాణ్‌దేవ్, రచితా రామ్‌తో పాటు అజయ్‌పై కొన్ని ప్రధాన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. ఈ షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె. నాయుడు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మనోజ్ కుమార్ మావిళ్ల. -
జూన్ 14న ‘ఐ లవ్ యు’
ఓం, ఏ, సూపర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్‌తో సంచలనం సృష్టించిన ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఐ లవ్ యు. కన్నడలో వరుసగా భారీ హిట్స్ అందించిన స్టార్ డైరెక్టర్ చంద్రు దర్శకత్వంలో ఐ లవ్ యు అనే సినిమాతో ఎంటర్టైన్ చేసేందుకు ఉపేంద్ర సిద్ధమౌతున్నాడు. తెలుగులో అత్యధిక థియేటర్లలో జూన్ 14న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 8న విశాఖ సముద్రతీరంలో ‘ఐ లవ్ యు’ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఉపేంద్ర ఫిట్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తున్న ఈ మూవీలో రచిత రామ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఉపేంద్ర సినిమాల నుంచి ప్రేక్షకులు ఎలాంటి అంశాలను కోరుకుంటారో ఆ అంశాలతో పాటు లవ్, ఫ్యామిలీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సినిమాను తెరకెక్కించినట్టుగా తెలిపారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదల చేసిన ఐ లవ్ యు ఫస్ట్ ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్, సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయింది. -
మాలాంటి వారికి ఆయనే స్ఫూర్తి
‘‘ఉపేంద్ర లెగసీ వల్లే ఇతర రాష్ట్రాల్లోకి వెళ్లి మాకంటూ ఒక పేరును సంపాదించుకుంటున్నాం. నాతో సహా చాలామందికి ఉపేంద్ర హార్డ్‌వర్క్, అంకితభావం స్ఫూర్తినిస్తాయి ’’ అని నటుడు, దర్శకుడు సుదీప్ అన్నారు. ఉపేంద్ర హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఐ లవ్ యు’. ‘నన్నే.. ప్రేమించు’ అనేది ఉపశీర్షిక. కన్నడ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో రచితా రామ్ కథానాయికగా నటించారు. ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చిత్రంతో దర్శకుడిగా తెలుగు పరిశ్రమకు పరిచయమైన ఆర్. చంద్రు స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జూన్ 14న ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. బెంగళూరులో ఈ సినిమా ప్రీ–రిలీజ్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ‘ఈగ’ ఫేమ్ సుదీప్ మాట్లాడుతూ– ‘‘ఉపేంద్ర ఇంట్రడక్షన్ సాంగ్ ట్రెండీగా ఉంది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఇది చూశాక ఉపేంద్రతో మళ్లీ పోటీపడాలనిపిస్తోంది. ఉపేంద్రలాంటి దర్శకులు ఇండస్ట్రీకి అవసరం. చంద్రు, ప్రేమ్ వంటి దర్శకులకు ఆయనే స్ఫూర్తి. ఆయన మరోసారి దర్శకత్వ బాధ్యతలు తీసుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘నాకు, సుదీప్‌కు 25ఏళ్లుగా పరిచయం ఉంది. ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లో సుదీప్‌లో ఎంత ఫైర్ ఉందో ఇప్పుడూ అంతే ఉంది. దర్శకుడు చంద్రు అద్భుతమైన కథ రాసుకుని పెద్దకలలతో వచ్చాడు’’ అన్నారు ఉపేంద్ర. ‘‘ఉపేంద్రగారు అభిమానుల చక్రవర్తి. ఇండస్ట్రీ కీర్తిప్రతిష్ఠలను ఇతర చిత్రసీమలకు తీసుకెళ్లిన అభినయ చక్రవర్తి సుదీప్‌గారు.. త్వరలో విశాఖ తీరంలో తెలుగు వెర్షన్ పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు చంద్రు. -
ఫిబ్రవరిలో నటసార్వభౌమ
కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హీరోగా రూపొందిన చిత్రం ‘నట సార్వభౌమ’. అనుపమా పరమేశ్వరన్, రచితారామ్ కథానాయికలుగా నటించారు. రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మించారు. పవన్ వడయార్ దర్శకత్వం వహించారు. ఇటీవల షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జనవరిలో విడుదల కానుందన్న వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించిందని శాండిల్‌వుడ్ సమాచారం. ఇందులో అనుపమ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే పునీత్ హీరోగా రూపొందనున్న నెక్ట్స్ చిత్రం ‘యువరత్న’. ఇందులో స్టూడెంట్ పాత్ర పోషిస్తున్నారట పునీత్. -
మాట ఒకటై.. మనసులు ఒకటై...
హీరో జర్నలిస్ట్. హీరోయిన్ లాయర్. ఓ సమస్యను పరిష్కరించడానికి ఇద్దరూ ఒక మాట మీద నిలబడతారు. ఈ దిశలో ఇద్దరి మనసులూ కలుస్తాయి. మరి ఈ ఇద్దరూ కలిసి క్రిమినల్‌కు ఎలా శిక్షపడేలా చేశారో తెలుసుకోవాలంటే ‘నటసార్వభౌమ’ సినిమా చూడాల్సిందే. పునీత్‌రాజ్‌కుమార్ హీరోగా పవన్ వడయార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నటసార్వభౌమ’. ఇందులో అనుపమా పరమేశ్వరన్, రచితా రామ్ కథానాయికలుగా నటిస్తున్నారు. అనుపమ లాయర్‌గా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోల్‌కత్తాలో జరుగుతోంది. ఈ షెడ్యూల్స్‌లో పునీత్, అనుపమాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అలాగే రెండు సాంగ్స్‌ను కూడా ప్లాన్ చేశారు చిత్రబృందం. ఈ సినిమాను ముందుగా ఈ ఏడాది దసరాకు రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల కుదర్లేదు. ఇప్పుడీ సినిమా డిసెంబర్లో విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి. -
కన్నడ 'బాపుబొమ్మ' హరిప్రియ
కన్నడ అగ్రనటుడు సుదీప్ సరసన హరిప్రియ ఛాన్స్ కొట్టేసింది. తెలుగులో ఘన విజయం సాధించిన 'అత్తారింటికి దారేది' ఆధారంగా సుదీప్ హీరోగా కన్నడంలో తెరకెక్కుతున్న చిత్రంలో హరిప్రియకు అవకాశం దక్కింది. 'బాపుబొమ్మ' ప్రణీత పోషించిన ప్రాత్రను కన్నడంలో ఆమె చేయబోతోంది. ఇక తెలుగులో సమంత చేసిన పాత్రను కన్నడంలో రచితా రామ్ దక్కించుకుంది. ఈ పాత్రను మొదట హన్సిన చేస్తుందని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఈ సినిమా చేయడం లేదని హన్సిక స్పష్టం చేసింది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాకు 'విక్టరీ' ఫేమ్ నందకిశోర్ దర్శకత్వం వహించనున్నారు. ప్రభాస్ 'మిర్చీ' సినిమాను కన్నడంలోకి రీమేక్ చేసి విజయం సాధించిన సుదీప్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాను రీమేక్ చేస్తున్నారు.