Kannada Actress Rachita Ram Shuts on Reporter Who Questioned Her About Bold Scenes - Sakshi
Sakshi News home page

Rachita Ram: పెళ్లి తర్వాత మీరు ఏం చేస్తారని రిపోర్టర్‌ను ప్రశ్నించిన రచిత రామ్‌

Published Thu, Nov 11 2021 6:22 PM | Last Updated on Thu, Nov 11 2021 8:10 PM

Rachita Ram Shuts On Reporter Who Questioned Her About Bold Scenes - Sakshi

Kannada Actress Rachitha Ram Strong Counter To Reporter Who Questioned Her Bold Scenes: కన్నడ స్టార్‌ హీరోయిన్‌, ‘డింపుల్‌ క్వీన్‌’ రచిత రిపోర్టర్‌పై ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కింది. తన మూవీ ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించిన రచిత ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు తిరిగి దిమ్మతిరిగే ప్రశ్న వేయడం అందరిని షాక్‌ గురి చేసింది. రచిత తాజా చిత్రం ‘లవ్‌ యూ రచ్చు’. ఈ మూవీ త్వరలో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా టీమ్‌ మీడియాతో ముచ్చటించింది. 

చదవండి: పునీత్‌ మృతికి రజనీ సంతాపం, కన్నింగ్‌ ఫెలో అంటూ విమర్శలు

‘లవ్‌ యూ రచ్చు’లో రచిత చేసిన కొన్ని బోల్డ్‌ సీన్స్‌పై రిపోర్టర్‌ ప్రశ్నించగా అతడికి తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చింది రచిత. ఈ సినిమాలో హీరోహీరోయిన్‌ మధ్య కొన్ని శృతి మించిన శృంగార సన్నివేశాలు ఉన్నాయట. వీటిపై విలేకరులు అడగ్గా.. ‘కథ డిమాండ్‌ చేసినట్టుగా నేను నటించాను’ అని సమాధానం ఇచ్చింది. అయితే ఇంతకు ముందు బోల్డ్‌ సీన్స్‌ చేయనని చెప్పి ఇప్పుడు ఈ సినిమాలో ఎందుకు నటించారని ప్రశ్నించిన రిపోర్టర్‌కు రచిత ఊహించని రీతిలో జవాబిచ్చింది.

చదవండి: దుల్కర్‌ చిత్రానికి రూ. 40 కోట్ల ఓటీటీ డీల్‌, ఒప్పందం రద్దు చేయించిన మమ్ముట్టి!

అదేంటంటే ‘మిమ్మల్ని ఒకటి అడుగుతాను. పెళ్లి తర్వాత మీరు ఏం చేస్తారు? సాధారణంగా అందరూ చేసేది ఏంటి? రొమాన్సే కదా.. అదే మా సినిమాలో చూపించారు’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. అలాగే ‘గతంలో హీరో ఉపేంద్రతో ‘ఐ లవ్‌ యూ’ సినిమాలో కూడా ఇలాంటి సీన్స్‌లో నటించాను. అవి మా కుటుంబ సభ్యులను బాధించాయి. ఆ తర్వాత అలాంటి సన్నివేశాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నాను. కానీ మళ్లీ అలాంటి సీన్స్‌లో నటించానంటే దానికి ఓ అర్ధం ఉంది. అదేంటో ఈ సినిమా చూసిన తర్వాత మీకే తెలుస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా రచిత మెగాస్టార్‌ అల్లుడు కల్యాణ్‌ దేవ్‌ హీరో వస్తున్న ‘సూపర్‌ మచ్చి’ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతోంది. 

చదవండి: Prabhas Adipurush Movie: 103 రోజుల్లోనే షూటింగ్‌ పూర్తి, ఆశ్చర్యంలో ఫ్యాన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement