దర్శన్‌ నా గురువు.. ఆయన ఇలా చేశారంటే..: హీరోయిన్‌ | Rachita Ram Reaction on Darshan Controversy | Sakshi
Sakshi News home page

దర్శన్‌ నా గురువు.. నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిందే ఆయన!: హీరోయిన్‌

Published Wed, Jun 19 2024 7:19 PM | Last Updated on Wed, Jun 19 2024 8:41 PM

Rachita Ram Reaction on Darshan Controversy

కొద్దిరోజులుగా హీరో దర్శన్‌ పేరు మారుమోగిపోతోంది. తనేదో మంచి పని చేసినందుకు కాదు.. తన గ్యాంగ్‌తో కలిసి అభిమాని రేణుకాస్వామిని అతి క్రూరంగా చంపినందుకు! జూన్‌ 11న రేణుకాస్వామి హత్య జరగ్గా.. ఈ కేసులో దర్శన్‌, అతడి ప్రియురాలు పవిత్ర గౌడతో పాటు పలువురినీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారం గురించి కన్నడ హీరోయిన్‌ రచితా రామ్‌ తాజాగా స్పందించింది. ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. 

దర్శన్‌.. గురువు
దర్శన్‌.. నన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆయన నాకు గురువులాంటివారు. నేనేదైనా తప్పు చేస్తే సరిదిద్దుతూ సలహాలు ఇచ్చే వ్యక్తి ఇలాంటి కేసులో భాగమయ్యారంటే నమ్మలేకపోతున్నాను. పోలీసులు నిజాన్ని వెలికితీస్తారని ఆశిస్తున్నాను. మీడియా కూడా పక్షపాతం లేకుండా వ్యవహరిస్తుందని భావిస్తున్నాను. 

న్యాయం గెలుస్తుంది
రేణుకాస్వామి ఆత్మకు శాంతి చేకూరాలి. అతడి కుటుంబం ధైర్యాన్ని కూడదీసుకోవాలి. ఈ కేసులో న్యాయమే గెలుస్తుందని నమ్ముతున్నాను అని రాసుకొచ్చింది. కాగా రచితా రామ్‌ తొలి సినిమా బుల్‌బుల్‌. ఈ మూవీలో దర్శన్‌ హీరోగా, రచిత హీరోయిన్‌గా నటించింది. వీరిద్దరూ అంబరీష, జగ్గు దాదా, అమర్‌, క్రాంతి చిత్రాల్లో కలిసి యాక్ట్‌ చేశారు. కన్నడలో పలు సినిమాలు చేసిన ఈమె తెలుగులో 'సూపర్‌ మచ్చి' మూవీతో పలకరించింది.

 

చదవండి: షారూఖ్‌ ఖాన్‌కు యాటిట్యూడ్‌? బిగ్‌బీని తక్కువ చేసి..

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement