![Deven Bhojani Recalls His False Impressions Busted on Shah Rukh Khan](/styles/webp/s3/article_images/2024/06/19/shah-rukh-khan.jpg.webp?itok=0sI_9Cpt)
ఫలానా హీరోకు టెక్కు ఎక్కువ.. ఆ దర్శకుడికి ముక్కు మీద కోపం.. ఈ మ్యూజిక్ డైరెక్టర్‌కైతే పొగరు.. ఇలా ఇండస్ట్రీలోని తారల గురించి నెగెటివ్‌గా చాలామంది మాట్లాడుకుంటారు. అందులో ఎంత నిజం? ఎంత అబద్ధమనేది ఎవరికీ తెలియదు. అలా షారూఖ్ ఖాన్‌కు యాటిట్యూడ్ అని తానూ విన్నానంటున్నాడు బాలీవుడ్ నటుడు దేవన్ భోజని.
యాటిట్యూడ్..
తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'జో జీతా వోహి సికిందర్ సినిమా తర్వాత ఓ మూవీలో షారూఖ్ ఫ్రెండ్‌గా నాకు ఛాన్స్ వచ్చింది. అప్పటికే తనకు యాటిట్యూడ్ ఉందని విన్నాను. దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్ గురించి కూడా చెడుగా మాట్లాడతాడని ఎక్కడో చూశాను. ఫస్ట్ డే సెట్‌కు వెళ్లగానే నన్ను నేను అందరికీ పరిచయం చేసుకున్నాను. అయితే షారూఖ్ దగ్గరకు వెళ్లాలనేసరికి మాత్రం అవసరమా? అనిపించింది.
నేనెవరనేది తెలుసు
నా పేరు దేవన్ అని పరిచయం చేసినప్పుడు అయితే ఏంటి? అని వెటకారంగా మాట్లాడతాడేమోనని ఏదేదో ఊహించుకున్నాను. ఇంతలో వెనక్కు తిరిగేసరికి తనే నిలబడ్డాడు. హాయ్, నేను షారూఖ్.. జో జీతా వోహి సికిందర్ సినిమాలో మీరు చాలా బాగా యాక్ట్ చేశారు అని మెచ్చుకున్నాడు. నేనెవరనేది తనకు తెలుసా? అని ఆశ్చర్యపోయాను.
ప్రశంసలు
నా సినిమా చాలా నచ్చిందన్నాడు. తన గురించి విన్నదంతా పచ్చి అబద్ధమేనని అప్పుడర్థమైంది. తను చాలా బాగా కలిసిపోతాడు' అని చెప్పుకొచ్చాడు. కాగా దేవన్, షారూఖ్ 1994లో యే లంహే జుడాయికె సినిమాలో కలిసి నటించారు. కానీ ఈ చిత్రం చాలా ఆలస్యంగా 2004లో విడుదలైంది.
Comments
Please login to add a commentAdd a comment