
మహేశ్‌బాబు రీల్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో. ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన సూపర్ స్టార్. అందంలోనే కాదు గుణంలోనూ నెంబర్ 1 అని నిరూపించుకున్న మహేశ్ తాజాగా మరోసారి తన గొప్పదనం చాటుకున్నాడు. చావుబతుకుల్లో ఉన్న అభిమాని కుటుంబాన్ని ఆదుకున్నాడు.
మహేశ్‌కు వీరాభిమాని
కృష్ణా జిల్లాలోని మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామ పంచాయితీ ప్రశాంత్ నగర్‌కు చెందిన కాకర్లమూడి రాజేశ్... మహేశ్‌కు వీరాభిమాని. ఇతడి భార్య పేరు సుజాత.. వీరికి ముగ్గురు కుమారులు సంతానం. రాజేశ్‌కు మహేశ్ అంటే ఎంతో పిచ్చి. మొదట్లో కృష్ణకు వీరాభిమాని అయిన రాజేశ్ తర్వాత మహేశ్‌కు అభిమాని అయ్యాడు. అతడి మీద ఇష్టంతో పిల్లలకు అర్జున్, అతిథి, ఆగడు అని సినిమా పేర్లు పెట్టాడు.
అభిమాని కుటుంబాన్ని ఆదుకున్న మహేశ్
నిరుపేద కుటుంబానికి చెందిన రాజేశ్‌కు కిడ్నీ పాడైపోయి మంచానపడ్డాడు. తాను చనిపోయేలోపు మహేశ్‌ను ఒక్కసారి చూడాలని, కనీసం మాట్లాడినా చాలని కోరుకుంటున్నాడు. అతడి పెద్ద కుమారుడు అర్జున్ చెప్పుల షాపులో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇది తెలుసుకున్న మహేశ్‌బాబు తన టీమ్‌ను ఆ ఊరికి పంపించాడు. అతిథి, ఆగడు పిల్లల్ని మంచి స్కూల్‌లో చేర్పించాడు. ప్రతి ఏడాది వారి విద్యకవసరమయ్యే ఖర్చునంతా భరిస్తానని హామీ ఇచ్చాడు. ఇది చూసిన అభిమానులు నువ్వు దేవుడివయ్యా సామీ అంటూ మహేశ్‌ను ఆకాశానికెత్తుతున్నారు.
చదవండి: ఈ నెలాఖరు నుంచి బిగ్‌బాస్ ప్రారంభం.. ఫస్ట్ కంటెస్టెంట్ ఈవిడే!
Comments
Please login to add a commentAdd a comment