ఈ నెలాఖరు నుంచి బిగ్‌బాస్‌ ప్రారంభం.. ఫస్ట్‌ కంటెస్టెంట్‌ ఈవిడే! | Bigg Boss OTT 3: First Confirmed Contestant Is Vada Pav Girl | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ ఓటీటీ: తొలి కంటెస్టెంట్‌గా ఫేమస్‌ వడా పావ్‌ గర్ల్‌.. అఫీషియల్‌గా చెప్పేశారుగా!

Published Wed, Jun 19 2024 1:25 PM | Last Updated on Wed, Jun 19 2024 1:42 PM

Bigg Boss OTT 3: First Confirmed Contestant is Vada Pav Girl

బిగ్‌బాస్‌ రియాలిటీ షోను ఇష్టపడే జనాలు చాలామందే ఉన్నారు. వీరికోసం ఏ యేటికాయేడు కొత్త సీజన్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు హిందీలో బిగ్‌బాస్‌ షో.. 17 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. షో మొదలవగానే సంతోషపడే బిగ్‌బాస్‌ ప్రియులు ఫినాలే వచ్చేసరికి అప్పుడే అయిపోయిందా అని ఫీలవుతున్నారు. ఇలాంటివారికోసం నిర్వాహకులు ఓటీటీ సీజన్‌ను ప్రవేశపెట్టారు. టీవీలో కాకుండా కేవలం ఓటీటీలో మాత్రమే ఈ షో చూడవచ్చన్నమాట! 

ఫస్ట్‌ కంటెస్టెంట్‌
ఈ బిగ్‌బాస్‌ ఓటీటీ కూడా ఇప్పటివరకు రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా మూడో సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఈసారి సల్మాన్‌ ఖాన్‌కు బదులుగా స్టార్‌ నటుడు అనిల్‌ కపూర్‌ను హోస్ట్‌గా తీసుకున్నారు. తాజాగా బిగ్‌బాస్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జియో సినిమా.. ఫస్ట్‌ కంటెస్టెంట్‌ ఈవిడే అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో షేర్‌ చేసింది. ఆ ఫోటోలో ఓ చిన్న స్నాక్స్‌ బండి దగ్గర జనం గుమిగూడి ఉన్నారు. వారికి ఓ అమ్మాయి కావల్సివని సిద్ధం చేసి ఇస్తోంది. 

మరికొద్ది రోజుల్లో బిగ్‌బాస్‌ ఓటీటీ 3
ఈ పిక్స్‌ చూసిన నెటిజన్లు తను ఫేమస్‌ వడాపావ్‌ గర్ల్‌ చంద్రిక అని కామెంట్లు చేస్తున్నారు. చంద్రిక.. ఢిల్లీలోని వీధుల్లో వడాపావ్‌ అమ్ముతూ ఫేమస్‌ అయింది. బిగ్‌బాస్‌ షో కోసం ఈ మధ్యే ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చేసింది. మరి సోషల్‌ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మాయి షోలో క్లిక్‌ అవుతుందో, లేదో చూడాలి. హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ మూడో సీజన్‌ జూన్‌ 21 నుంచి ప్రారంభం కానుంది. జియో సినిమాలో ఈ వెబ్‌తెర బిగ్‌బాస్‌ను చూసేయండి..

 

 

చదవండి: రజనీకాంత్‌ సినిమాలో అనవసరంగా నటించా: హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement