
యశవంతపుర: కన్నడ టీవీ నటి చేతనారాజ్ మృతికి కారణమైన ప్రైవేట్ ఆస్పత్రికి ఆరోగ్యశాఖ అధికారులు నోటీసులిచ్చారు. కొవ్వును కరిగించడానికి జరిగిన సర్జరీ విఫలమై నటి మూడు రోజుల కిందట మరణించడం తెలిసిందే. దీంతో ఆరోగ్యశాఖ అధికారులు ఆస్పత్రి ముఖ్య వైద్యుడు డాక్టర్ గౌడశెట్టికి నోటీసులిచ్చి ఆస్పత్రిని మూసివేశారు. నటి మృతిపై వివరణ ఇవ్వాలని సూచించారు. కూతురి మృతిపై అనేక అనుమానాలున్నయని మృతురాలి తండ్రి వరదరాజ్ సుబ్రమణ్యనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి డాక్టర్ గౌడశెట్టితో పాటు నలుగురిపై కేసు నమోదు చేశారు.
చదవండి: Actress Chethana Raj Death: కాస్మోటిక్ సర్జరీ వికటించి టీవీ నటి మృతి
Comments
Please login to add a commentAdd a comment