జూన్ 14న ‘ఐ లవ్ యు’ | Upendra Bold Movie I Love You Releasing on 14th June | Sakshi
Sakshi News home page

జూన్ 14న ‘ఐ లవ్ యు’

Published Fri, Jun 7 2019 1:32 PM | Last Updated on Fri, Jun 7 2019 1:32 PM

Upendra Bold Movie I Love You Releasing on 14th June - Sakshi

ఓం, ఏ, సూపర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్‌తో సంచలనం సృష్టించిన ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఐ లవ్‌ యు. కన్నడలో వరుసగా భారీ హిట్స్ అందించిన స్టార్ డైరెక్టర్ చంద్రు దర్శకత్వంలో ఐ లవ్ యు అనే సినిమాతో ఎంటర్‌టైన్ చేసేందుకు ఉపేంద్ర సిద్ధమౌతున్నాడు. తెలుగులో అత్యధిక థియేటర్లలో జూన్ 14న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 8న విశాఖ సముద్రతీరంలో  ‘ఐ లవ్ యు’ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. 

ఉపేంద్ర  ఫిట్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తున్న ఈ మూవీలో రచిత రామ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఉపేంద్ర సినిమాల నుంచి ప్రేక్షకులు ఎలాంటి అంశాలను కోరుకుంటారో ఆ అంశాలతో పాటు లవ్, ఫ్యామిలీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ తో సినిమాను తెరకెక్కించినట్టుగా తెలిపారు చిత్రయూనిట్‌. ఇప్పటికే విడుదల చేసిన ఐ లవ్ యు ఫస్ట్ ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్, సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement