హీరోయిన్‌ దొరికింది | Kalyan Dev is now ready to make up the pair | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌ దొరికింది

Published Tue, Jan 8 2019 12:33 AM | Last Updated on Tue, Jan 8 2019 12:33 AM

Kalyan Dev is now ready to make up the pair - Sakshi

కల్యాణ్‌ దేవ్‌

మొదటి చిత్రం ఫలితంతో సంబంధం లేకుండా రెండో సినిమా పనుల స్పీడ్‌ పెంచారు చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌ దేవ్‌. పులి వాసు దర్శకత్వంలో ఆయనో సినిమాలో హీరోగా చేస్తున్న సంగతి తెలిసిందే. రిజ్వాన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా పలు పేర్లు వినిపించినప్పటికీ బాలీవుడ్‌ భామ రియా చక్రవర్తిని హీరోయిన్‌గా ఫైనలైజ్‌ చేశారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. లేటెస్ట్‌ బాలీవుడ్‌ చిత్రం ‘జలేబి’లో తన పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు సంపాదించారు రియా. ఆ సినిమానే ఈ చాన్స్‌కు కారణం అని టాక్‌. గతంలో ‘తూనీగ తూనీగ’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకు పరిచయం అయ్యారు రియా. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement