‘‘ప్రతి సినిమాకు చాలెంజెస్ ఉంటాయి. ‘బాహుబలి’ సినిమాకు ఆ రేంజ్ చాలెంజ్‌లు ఉంటాయి. చిన్న సినిమాలకు ఆ సినిమా స్థాయిలోనే కష్టాలుంటాయి. అది దర్శకుడి విజన్ కావొచ్చు, నిర్మాతవైపు నుంచి కావచ్చు. ‘విజేత’ సినిమా చేస్తున్నప్పుడు నా కెరీర్ బిగినింగ్‌లో చేసిన ‘ఐతే’ సినిమా రోజులు గుర్తుకు వచ్చాయి. ‘బాహుబలి’ తర్వాత ఈ సినిమా నాకు మరో గ్రేట్ ఎక్స్ పీరియన్స్’’ అన్నారు ఛాయాగ్రాహకుడు కె. సెంథిల్‌కుమార్. చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘విజేత’. రాకేశ్ శశి దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రఛాయాగ్రాహకుడు కె.సెంథిల్ కుమార్ చెప్పిన విశేషాలు.
► సంక్రాంతికి రాజమౌళిగారిని కలిసినప్పుడు సాయి కొర్రపాటిగారు ‘ఓ మంచి కథ ఉంది వినండి’ అన్నారు. రాకేశ్ శశి చెప్పిన కథ నాకు బాగా నచ్చింది.అందులో చాలా ఎమోషన్స్‌తో పాటు కనెక్ట్ అయ్యే సన్నివేశాలున్నాయి. తండ్రీ కొడుకుల మధ్య జరిగే ఓ మిడిల్ క్లాస్ స్టోరీ ఇది.
► అన్ని సినిమాలు పేరు కోసమే చేయలేం. క్రికెట్ అంటే ఇష్టంతో ‘గోల్కొండ హై స్కూల్’ సినిమా చేశాను. ఆ సినిమా చేస్తున్నప్పుడు పేరొస్తుందని చేయలేదు. అలాగే ఈ సినిమా నచ్చడంతో చేశా.
► కల్యాణ్ దేవ్‌లో నటుడిగా చాలా పరిణితి చూశాను. ఫస్ట్ డే షూట్‌లో కంఫర్ట్‌గా ఫీల్ అయినట్టు కనిపించలేదు. సినిమా పూర్తయ్యేసరికి కాన్ఫిడెన్స్ లెవల్ బాగా పెరిగింది. కల్యాణ్ హార్డ్ వర్కింగ్ పర్శన్. ఏదైనా త్వరగా నేర్చుకుంటాడు. ప్యూచర్‌లో పెద్ద నటుడు అవుతాడు. నటనలో తను తీసుకునే జాగ్రత్తలు అలాంటివి.
► రాకేశ్‌కి తనేం చేస్తున్నాడనే విషయం మీద క్లారిటీ ఉంది. దాని వల్లే సినిమాను ఈజీగా హ్యాండిల్ చేయగలిగాడు. డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో దాన్ని తెర మీదకు తీసుకురావడానికే నేను ప్రయత్నిస్తాను.
► ‘బాహుబలి’ తర్వాత తెలుగులోనే కాదు బాలీవుడ్ నుంచీ చాలా అవకాశాలొచ్చాయి. కానీ నేను ఎదురుచూస్తున్న కథ రాకపోవడంతో హిందీ వైపు వెళ్లలేదు. వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో మనమే సినిమాలు చేస్తున్నాం. అలా అని హిందీ సినిమాలు చేయనని కాదు, నచ్చితే చేస్తా.
► తెలుగులో ప్రస్తుతం గోల్డెన్ íపీరియడ్ నడుస్తోంది. ‘బాహుబలి, ఘాజీ, అర్జున్ రెడ్డి, గరుడవేగ, మహానటి’ లాంటి వైవిధ్యమైన సినిమాలు వస్తున్నాయి. ప్రేక్షకులు కొత్త సినిమాలను ఆదరించడంతో దర్శకులు కొత్త కథలు చెప్పడానికి చూస్తున్నారు. ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అనే రోజు తప్పకుండా వస్తుంది.
► ప్రతి టెక్నీషియన్‌కు డైరెక్టర్ కావాలనుంటుంది. ఏ టెక్నీషియన్ అయినా డైరెక్టర్ కథని స్క్రీన్ మీద చెప్పడానికి సహకారం మాత్రమే అందిస్తారు. అందుకే డైరెక్టర్ కావాలని అందరూ అనుకుంటారు. నేను డైరెక్టర్ అవుతాను. కానీ ఎప్పుడవుతానో కచ్చితంగా చెప్పలేను.
కల్యాణ్ దేవ్, మాళవిక
Comments
Please login to add a commentAdd a comment