
క్రిస్మస్ పర్వదినాన మెగాస్టార్ చిరంజీవి ఇంట సంతోషాలు వెల్లివిరిశాయి. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మంగళవారం ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన కూతురి పాద ముద్ర ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కళ్యాణ్ దేవ్.. ‘ 2018 క్రిస్మస్ మాకు జీవితాంతం గుర్తుండి పోతుంది. ఆడపిల్ల పుట్టింది. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు’ అంటూ క్యాప్షన్ జతచేశారు.
కాగా విజేత సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం రెండో సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై రిజ్వాన్ నిర్మించనున్న ఈ సినిమా ద్వారా పులి వాసు దర్శకునిగా పరిచయం కానున్నారు. ఇక ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ స్వరాలు సమకూర్చనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment