కిన్నెరసానిలో పెరిగిన నీటిమట్టం
ఎగువ నుంచి వస్తున్న వరదలకు కిన్నెరసాని రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరుగుతోంది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న జలాశయంలో బుధవారం సాయంత్రానికి 404.50 అడుగులకు నీటిమట్టం చేరిందని డ్యామ్‌సైడ్ కేటీపీఎస్ ఏడీఈ రామకృష్ణ తెలిపారు. మంగళవారం నాటికి 404.30 అడుగులున్న నీటిమట్టం క్రమేణా పెరుగుతోందన్నారు. వెయ్యి క్యూసెక్కుల లోపు వరద ప్రాజెక్టులోకి వస్తున్నందున బుధవారం రాత్రి 10 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 5 గంటల వరకు ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తుతామన్నారు. 17వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తామన్నారు. ప్రాజెక్టులో 403 అడుగుల నీరు నిల్వ ఉంచుతామని తెలిపారు.
– పాల్వంచ రూరల్