జింకళభరితం | Safari tour in kinnerasani | Sakshi
Sakshi News home page

జింకళభరితం

Published Wed, Apr 4 2018 9:18 AM | Last Updated on Wed, Apr 4 2018 9:20 AM

Safari tour in kinnerasani - Sakshi

కృష్ణజింక

పాల్వంచరూరల్‌:  చుక్కల జింకలతో ఆహ్లాదాన్ని పంచే కిన్నెరసాని డీర్‌ పార్కు..ఇప్పుడు మరింత కళకళలాడబోతోంది. ప్రస్తుతం చుక్కల జింకలు(దుప్పులు) మాత్రమే ఉండగా..వివిధ ప్రాంతాలనుంచి మూడు రకాల జింకలతోపాటు హైదరాబాద్‌ జూ పార్కునుంచి కృష్ణజింకలు, కణుజులు, మూసిక జింకలు, కొండగొర్రెలను తీసుకురానున్నారు.

కడుపుకింద తెల్లగా, వీపు మీద నల్లగా కొమ్ములు ఉండే కృష్ణ జింకలు, ఎలుక మూతిని పోలిఉండే మూసిక జింకలతోపాటు కణుజులు, కొండగొర్రెలు రానున్నాయి. వీటిని పర్యాటకులు సఫారీ ద్వారా వీక్షించే ఏర్పాట్లు చేయబోతున్నారు. ఇక్కడి సహజ సిద్ధమైన అటవీ ప్రాంతంలో సంచరించే వన్యప్రాణులను వీక్షించడం కోసం సఫారీ ఏర్పాటుకు వైల్డ్‌లైఫ్‌ శాఖ దృష్టి సారించింది.

ఇనుపకంచె (ఫెన్సింగ్‌)బయటి నుంచి కాకుండా అటవీ ప్రాంతంలోకి ఓపెన్‌జీప్‌ లాంటి వాహనాల్లో వెళ్లి..కనులారా వీక్షించేందుకు సఫారీ సౌకర్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి. రూ.5.8 కోట్ల అంచనాల వ్యయం అవసరమని సీసీఎఫ్‌కు ఇటీవల ప్రతిపాధనలు కూడా పంపారు. ఆమోద ముద్ర పడితే రెండు, మూడు నెలలోనే సఫారీ ద్వారా వీక్షించే అవకాశం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement