safari tour
-
అసోం సీఎం హిమంత, సద్గురుపై కేసు
దిస్పూర్: అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌పై కేసు నమోదైంది. ఆదివారం కాజీరంగ జాతీయ పార్కులో సూర్యాస్తమయం తర్వాత వీరు జీపులో సఫారీ యాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇది వన్యప్రాణుల పరిరక్షణ చట్టం నిబంధనలకు విరుద్దమని పార్కు సమీపంలోని గ్రామస్థులు బోకాఖాట్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు నమోదైంది వాస్తవమేనని పోలీసులు తెలిపారు. అయితే ఆ పార్కు అటవీ శాఖ కిందకు వస్తుందని, అందుకే ఆ అధికారులను స్టేటస్ రిపోర్టు కోరినట్లు చెప్పారు. దీనిపై అటవీ అధికారులు స్పందిస్తూ.. కేసు పెట్టే హక్కు ప్రజలకు ఉందని చెప్పారు. అయితే సీఎం అధికారిక కార్యక్రమంలో భాగంగానే సఫారీ యాత్రకు వెళ్లారని, ఇది నిబంధనలను అతిక్రమించినట్లు కాదని తాము భావిస్తున్నట్లు చెప్పారు. కొన్నిసార్లు సీఎం కార్యక్రమాలు ఆలస్యం అవుతాయని గుర్తుచేశారు. ఈ ఘటనపై సీఎం హిమంత స్పందించారు. జాతీయ పార్కులోకి సూర్యాస్తమయం తర్వాత వెళ్లవద్దని చట్టంలో ఎక్కడా నిబంధన లేదని చెప్పారు. అధికారుల అనుమతితోనే తాను సఫారీ యాత్రలో పాల్గొన్నట్లు స్పష్టం చేశారు. అనుమతి ఉంటే ఉదయం 2గంటలకు కూడా పార్కులోకి వెళ్లొచ్చని పేర్కొన్నారు. సీఎం, సద్గురుతో పాటు వారితో వెళ్లిన మంత్రి, ఇతరులపైనా కేసు పెట్టారు గ్రామస్థులు. చట్టాన్ని ఉల్లంఘించినందుకు వీరందరినీ వెంటనే అరెస్టు చేయాలన్నారు. లేకపోతే అందరూ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చదవండి: నా చేతుల్లో ఏం లేదు.. అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు! -
క్రూర జంతువులతో జాగ్రత్త!
-
క్షణం ఆలస్యం అయ్యుంటే పరిస్థితి ఏంటి?
సింహాలు ఉన్న చోట సఫారీకి వెళితే ఎంత జాగ్రత్త వహించాలనేది ఈ వీడియోలో చూసి తెలుసుకోండి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన అది మన ప్రాణాల మీదకు వస్తుందనేది నిజం. తాజాగా సింహాలు ఉన్న చోటుకు సఫారీకని వచ్చిన టూరిస్టులు ప్రకృతిని ఆస్వాదించేందుకని కారును ఆపారు. కారు ఆపిన పక్కనే ఒక సింహాల గుంపు ఉంది. ఇదే సమయంలో కారు డోరుకు లాక్ సరిగా లేకపోవడం కారులోని వాళ్లు గమనించలేదు. సాధారణంగానే వాహనాలను చూస్తే మీదకు వచ్చే సింహాలు కారులోని మనుషులను చూస్తే ఊరుకుంటాయా.. ఇంతలో ఆ గుంపులో నుంచి ఒక సింహం కారు దగ్గరికి వచ్చి కారు డోర్ తీయడానికి ప్రయత్నించింది. అయితే ఇంతలో వెనుక డోర్ దగ్గరకు వచ్చిన సింహం తన పంటితో డోర్ లాగే ప్రయత్నంలో అది తెరుచుకుంది. దీంతో లోపల ఉన్న వారు బయపడి టక్కున కారు డోర్‌ను మూయడంతో సింహం అక్కడి నుంచి పక్కకు జరిగింది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా పెద్ద నష్టమే జరిగుండేది. (అబ్బురుపరిచే వర్చువల్ నీటి అలలు) దాదాపు 40 సెకెన్ల నిడివి ఉన్న వీడియోనూ ఐఎఫ్ఎస్ అధికారి సుషాంత నంద ట్విటర్లో షేర్ చేశారు. ' కారులో ఉన్న వారితో సింహం కూడా సఫారి రైడ్‌కు వెళ్లాలనుకుందేమో.. అందుకే లిఫ్ట్ అడగానికి ప్రయత్నించింది. దయచేసి సఫారి రైడ్‌కు వెళ్లినప్పుడు క్రూర జంతువులతో జాగ్రత్తగా ఉండండి' అంటూ క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన వారంతా 'సింహం చాలా తెలివైనదని.. బతుకు జీవుడా...' అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
దంపతులకు జిరాఫీ షాక్..!!
సాక్షి, వెబ్ డెస్క్ : విహారయాత్రకు వెళ్లిన ఓ జంటకు జిరాఫీ షాక్ ఇచ్చింది. సఫారీ టూర్‌కు వెళ్లిన ఓ జంట కారుకు చేరువలో ఉన్న జిరాఫీని చూస్తోంది. జిరాఫీ కూడా వారి వైపు చూడటంతో దంపతులు తొలుత ఉత్సాహపడ్డారు. కారు అద్దం సగం తెరచి ఉండటంతో అక్కడికి వచ్చిన జిరాఫీ తల లోపలికి దూర్చింది. దీంతో భయాందోళనలకు గురైన దంపతులు పెద్ద పెట్టున కేకలు వేశారు. జిరాఫీ ఒక్కసారిగా తల బయటకు తీయడంతో కారు అద్దం పగిలిపోయింది. ఇంగ్లండ్‌లోని వార్సెస్టర్షైర్లో గల పశ్చిమ మిడ్‌ల్యాండ్స్ సఫారీ పార్కులో ఈ ఘటన చోటు చేసుకుంది. జంతువులకు ఆహారం అందించేందుకు కారు అద్దాలను సగం తెరచివుంచడానికి సఫారీ అనుమతి ఇస్తుంది. దంపతుల చేతిలో తినుబండారాలు ఉండటంతోనే జిరాఫీ తల లోపలికి పెట్టిందని సఫారీ అధికారులు తెలిపారు. ఘటనలో జిరాఫీకి ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. -
జింకళభరితం
పాల్వంచరూరల్: చుక్కల జింకలతో ఆహ్లాదాన్ని పంచే కిన్నెరసాని డీర్ పార్కు..ఇప్పుడు మరింత కళకళలాడబోతోంది. ప్రస్తుతం చుక్కల జింకలు(దుప్పులు) మాత్రమే ఉండగా..వివిధ ప్రాంతాలనుంచి మూడు రకాల జింకలతోపాటు హైదరాబాద్ జూ పార్కునుంచి కృష్ణజింకలు, కణుజులు, మూసిక జింకలు, కొండగొర్రెలను తీసుకురానున్నారు. కడుపుకింద తెల్లగా, వీపు మీద నల్లగా కొమ్ములు ఉండే కృష్ణ జింకలు, ఎలుక మూతిని పోలిఉండే మూసిక జింకలతోపాటు కణుజులు, కొండగొర్రెలు రానున్నాయి. వీటిని పర్యాటకులు సఫారీ ద్వారా వీక్షించే ఏర్పాట్లు చేయబోతున్నారు. ఇక్కడి సహజ సిద్ధమైన అటవీ ప్రాంతంలో సంచరించే వన్యప్రాణులను వీక్షించడం కోసం సఫారీ ఏర్పాటుకు వైల్డ్‌లైఫ్ శాఖ దృష్టి సారించింది. ఇనుపకంచె (ఫెన్సింగ్)బయటి నుంచి కాకుండా అటవీ ప్రాంతంలోకి ఓపెన్‌జీప్ లాంటి వాహనాల్లో వెళ్లి..కనులారా వీక్షించేందుకు సఫారీ సౌకర్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి. రూ.5.8 కోట్ల అంచనాల వ్యయం అవసరమని సీసీఎఫ్‌కు ఇటీవల ప్రతిపాధనలు కూడా పంపారు. ఆమోద ముద్ర పడితే రెండు, మూడు నెలలోనే సఫారీ ద్వారా వీక్షించే అవకాశం ఉంది. -
దక్షిణాఫ్రికా పర్యటనతో మేలు: విరాట్ కోహ్లి
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా పర్యటన భారత యువ జట్టుకు చాలా మేలు చేస్తుందని స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి అన్నాడు. జట్టుకు కావాల్సిన ప్రమాణాలను ఈ టూర్ నిర్దేశిస్తుందని తెలిపాడు. క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) సీఈఓగా లోర్గాట్‌ను నియమించినప్పట్నించీ ఆగ్రహంతో ఉన్న బీసీసీఐ... ఈ పర్యటనను సందిగ్దంలో పడేసిన సంగతి తెలిసిందే. ‘సఫారీ టూర్‌పై మేం దృష్టిపెట్టాం. కొన్ని మ్యాచ్‌ల్లోనైనా విజయం సాధిస్తాం. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. మంచి ఆరంభంతో ఈ సీజన్‌ను మొదలుపెట్టాలని భావిస్తున్నాం. ఆసీస్ బలమైన జట్టు. క్లార్క్ లేకపోయినా తేలికగా తీసుకోబోం. ఏడు మ్యాచ్‌ల సిరీస్‌లో మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాం’ అని కోహ్లి పేర్కొన్నాడు. యువరాజ్ సింగ్ పునరాగమనంపై ఎలాంటి సందేహాలు లేవని అన్నాడు. ‘యువీ గొప్ప ఆటగాడు. అతను జట్టులోకి రావడం చాలా సంతోషం కలిగించింది. ఫిట్నెస్ కోసం ఫ్రాన్స్ వెళ్లడం నాకు చాలా బాగా నచ్చింది. ప్రస్తుతం అతను ఎవరితోనూ టచ్‌లో లేడు. కాబట్టి మైదానంలోనే అతన్ని చూడాలి’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 200వ టెస్టు మ్యాచ్‌లో తాను భాగం కానుండటం చాలా ఆసక్తిగా ఉందన్నాడు.