న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా పర్యటన భారత యువ జట్టుకు చాలా మేలు చేస్తుందని స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి అన్నాడు. జట్టుకు కావాల్సిన ప్రమాణాలను ఈ టూర్ నిర్దేశిస్తుందని తెలిపాడు. క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) సీఈఓగా లోర్గాట్‌ను నియమించినప్పట్నించీ ఆగ్రహంతో ఉన్న బీసీసీఐ... ఈ పర్యటనను సందిగ్దంలో పడేసిన సంగతి తెలిసిందే. ‘సఫారీ టూర్‌పై మేం దృష్టిపెట్టాం. కొన్ని మ్యాచ్‌ల్లోనైనా విజయం సాధిస్తాం. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. మంచి ఆరంభంతో ఈ సీజన్‌ను మొదలుపెట్టాలని భావిస్తున్నాం. ఆసీస్ బలమైన జట్టు. క్లార్క్ లేకపోయినా తేలికగా తీసుకోబోం.
ఏడు మ్యాచ్‌ల సిరీస్‌లో మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాం’ అని కోహ్లి పేర్కొన్నాడు. యువరాజ్ సింగ్ పునరాగమనంపై ఎలాంటి సందేహాలు లేవని అన్నాడు. ‘యువీ గొప్ప ఆటగాడు. అతను జట్టులోకి రావడం చాలా సంతోషం కలిగించింది. ఫిట్‌నెస్ కోసం ఫ్రాన్స్ వెళ్లడం నాకు చాలా బాగా నచ్చింది. ప్రస్తుతం అతను ఎవరితోనూ టచ్‌లో లేడు. కాబట్టి మైదానంలోనే అతన్ని చూడాలి’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 200వ టెస్టు మ్యాచ్‌లో తాను భాగం కానుండటం చాలా ఆసక్తిగా ఉందన్నాడు.
దక్షిణాఫ్రికా పర్యటనతో మేలు: విరాట్ కోహ్లి
Published Wed, Oct 2 2013 1:16 AM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM
Advertisement