star batsman virat kohli
-
'ఆ జగడం జట్టు ప్రయోజనాలను దెబ్బతీసింది'
సునీల్ గవాస్కర్ వ్యాఖ్య న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో పేసర్ మిషెల్ జాన్సన్‌తో స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి జగడంపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ దూకుడు కారణంగా జట్టు ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని అన్నారు. ‘మీడియా సమావేశంలో క్రికెట్ గురించే మాట్లాడాలి. మైదానంలో జరిగిన ఇతర విషయాల గురించి అక్కడే వదిలేయాలి. కోహ్లి మాట్లాడిన విధానం తెలివైనదనిపించుకోదు. సచిన్ టెండూల్కర్, లక్ష్మణ్, ద్రవిడ్ ఇంతకంటే కఠిన పరిస్థితులే ఎదుర్కొన్నారు. కానీ వారి ప్రవర్తన ఇలా ఉండేది కాదు. అవతలి వ్యక్తి రెచ్చగొడితే స్పందించడం కరెక్టే అయినా మనం కూడా అదే పనిగా ఇతరులపై నోరుపారేసుకోవడం సముచితం కాదు. దీనివల్ల అతడి వికెట్ కూడా పడింది. ఇది జట్టు ప్రయోజనాలను దెబ్బతీసింది’ అని గవాస్కర్ విమర్శించారు. -
ఇకపై భార్యలకూ అనుమతి లేదు!
వచ్చే సిరీస్ నుంచి అమలు చేయనున్న బీసీసీఐ ముంబై: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి ఘోర వైఫల్యం భారత జట్టును దెబ్బ తీసింది. అతని ప్రదర్శనతో నేరుగా సంబంధం ఉన్నా, లేకపోయినా... గర్ల్‌ఫ్రెండ్ అనుష్క శర్మ వెంట ఉండటమే కారణమంటూ తీవ్ర చర్చ జరిగింది. అనుష్కను బీసీసీఐ అధికారికంగా అనుమతించడంపై విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని బోర్డు భావిస్తోంది. గర్ల్ ఫ్రెండ్స్ సంగతి సరే... కనీసం ఆటగాళ్ల భార్యలను కూడా విదేశీ పర్యటనలకు అనుమతించరాదని తాజాగా ప్రతిపాదించింది. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు కోహ్లి గర్ల్‌ఫ్రెండ్ కాకుండా... పుజారా, విజయ్, అశ్విన్, బిన్నీ, గంభీర్ తమ భార్యలతో కలిసి వెళ్లారు. ‘ఇంగ్లండ్ పర్యటన అందరి కళ్లు తెరిపించింది. మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇంగ్లండ్‌లో క్రికెటర్లు ఆటపై దృష్టి పెట్టేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ వారి భార్యల కారణంగా ఏకాగ్రత చెదిరింది. ఆటగాడు జిమ్కో, ప్రాక్టీస్‌కో వెళదామని భావించగానే...సిటీ చూసేందుకో, షాపింగ్ కోసమే వారి భాగస్వాములు తీసుకెళ్లారు. అందుకే దీనికి కళ్లెం వేయాలని భావిస్తున్నాం’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. గతంలో క్రికెటర్ తన భార్యను తీసుకెళ్లాలంటే బీసీసీఐ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మరో వైపు సిరీస్ ఆసాంతం కాకుండా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల తరహాలో కొన్ని రోజుల పరిమిత సమయం పాటు భార్యలను అనుమతించే ప్రతిపాదన గురించి కూడా బోర్డు ఆలోచిస్తోంది. -
దక్షిణాఫ్రికా పర్యటనతో మేలు: విరాట్ కోహ్లి
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా పర్యటన భారత యువ జట్టుకు చాలా మేలు చేస్తుందని స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి అన్నాడు. జట్టుకు కావాల్సిన ప్రమాణాలను ఈ టూర్ నిర్దేశిస్తుందని తెలిపాడు. క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) సీఈఓగా లోర్గాట్‌ను నియమించినప్పట్నించీ ఆగ్రహంతో ఉన్న బీసీసీఐ... ఈ పర్యటనను సందిగ్దంలో పడేసిన సంగతి తెలిసిందే. ‘సఫారీ టూర్‌పై మేం దృష్టిపెట్టాం. కొన్ని మ్యాచ్‌ల్లోనైనా విజయం సాధిస్తాం. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. మంచి ఆరంభంతో ఈ సీజన్‌ను మొదలుపెట్టాలని భావిస్తున్నాం. ఆసీస్ బలమైన జట్టు. క్లార్క్ లేకపోయినా తేలికగా తీసుకోబోం. ఏడు మ్యాచ్‌ల సిరీస్‌లో మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాం’ అని కోహ్లి పేర్కొన్నాడు. యువరాజ్ సింగ్ పునరాగమనంపై ఎలాంటి సందేహాలు లేవని అన్నాడు. ‘యువీ గొప్ప ఆటగాడు. అతను జట్టులోకి రావడం చాలా సంతోషం కలిగించింది. ఫిట్నెస్ కోసం ఫ్రాన్స్ వెళ్లడం నాకు చాలా బాగా నచ్చింది. ప్రస్తుతం అతను ఎవరితోనూ టచ్‌లో లేడు. కాబట్టి మైదానంలోనే అతన్ని చూడాలి’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 200వ టెస్టు మ్యాచ్‌లో తాను భాగం కానుండటం చాలా ఆసక్తిగా ఉందన్నాడు. -
జవాన్లే హీరోలు: కోహ్లి
న్యూఢిల్లీ: స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి... సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ప్రచారకర్తగా కొత్త బాధ్యతలు తీసుకున్నాడు. ఈ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో అధికారులు అతనికి క్యాప్‌ను బహూకరించారు. స్వల్ప స్థాయిలో క్రికెటర్లు దేశానికి సేవ చేస్తున్నా... నిజమైన హీరోలు మాత్రం బీఎస్ఎఫ్ జవాన్లేనని ప్రశంసలు కురిపించాడు. వాళ్ల వల్లే దేశంలో తాము సురక్షితంగా ఉండగలుగుతున్నామని కితాబిచ్చాడు. ‘దేశ సరిహద్దుల్లో ఉన్న అన్ని బీఎస్ఎఫ్ యూనిట్లను సందర్శించే అవకాశం నాకు దక్కింది. ఇక జవాన్లను నేరుగా కలుస్తా. సుదీర్ఘ కాలం కుటుంబాలకు దూరంగా ఉంటూ, దేశానికి సేవ ఎలా చేయగలుగుతున్నారో తెలుసుకుంటా’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. దూకుడు స్వభావాన్ని తగ్గించుకోవడంలో తాను విజయవంతమయ్యానని చెప్పిన ఈ ఢిల్లీ బ్యాట్స్‌మన్ ప్రస్తుతం చాలా పరిణతితో వ్యవహరిస్తున్నానని తెలిపాడు.