'ఆ జగడం జట్టు ప్రయోజనాలను దెబ్బతీసింది' | Virat Kohli's aggression can be counter-productive: Sunil Gavaskar | Sakshi
Sakshi News home page

'ఆ జగడం జట్టు ప్రయోజనాలను దెబ్బతీసింది'

Published Tue, Dec 30 2014 11:17 AM | Last Updated on Wed, Oct 3 2018 7:16 PM

'ఆ జగడం జట్టు ప్రయోజనాలను దెబ్బతీసింది' - Sakshi

'ఆ జగడం జట్టు ప్రయోజనాలను దెబ్బతీసింది'

సునీల్ గవాస్కర్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో పేసర్ మిషెల్ జాన్సన్‌తో స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి జగడంపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ దూకుడు కారణంగా జట్టు ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని అన్నారు. ‘మీడియా సమావేశంలో క్రికెట్ గురించే మాట్లాడాలి. మైదానంలో జరిగిన ఇతర విషయాల గురించి అక్కడే వదిలేయాలి. కోహ్లి మాట్లాడిన విధానం తెలివైనదనిపించుకోదు.

సచిన్ టెండూల్కర్, లక్ష్మణ్, ద్రవిడ్ ఇంతకంటే కఠిన పరిస్థితులే ఎదుర్కొన్నారు. కానీ వారి ప్రవర్తన ఇలా ఉండేది కాదు. అవతలి వ్యక్తి రెచ్చగొడితే స్పందించడం కరెక్టే అయినా మనం కూడా అదే పనిగా ఇతరులపై నోరుపారేసుకోవడం సముచితం కాదు. దీనివల్ల అతడి వికెట్ కూడా పడింది. ఇది జట్టు ప్రయోజనాలను దెబ్బతీసింది’ అని గవాస్కర్ విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement