Deers park
-
జింకళభరితం
పాల్వంచరూరల్: చుక్కల జింకలతో ఆహ్లాదాన్ని పంచే కిన్నెరసాని డీర్ పార్కు..ఇప్పుడు మరింత కళకళలాడబోతోంది. ప్రస్తుతం చుక్కల జింకలు(దుప్పులు) మాత్రమే ఉండగా..వివిధ ప్రాంతాలనుంచి మూడు రకాల జింకలతోపాటు హైదరాబాద్ జూ పార్కునుంచి కృష్ణజింకలు, కణుజులు, మూసిక జింకలు, కొండగొర్రెలను తీసుకురానున్నారు. కడుపుకింద తెల్లగా, వీపు మీద నల్లగా కొమ్ములు ఉండే కృష్ణ జింకలు, ఎలుక మూతిని పోలిఉండే మూసిక జింకలతోపాటు కణుజులు, కొండగొర్రెలు రానున్నాయి. వీటిని పర్యాటకులు సఫారీ ద్వారా వీక్షించే ఏర్పాట్లు చేయబోతున్నారు. ఇక్కడి సహజ సిద్ధమైన అటవీ ప్రాంతంలో సంచరించే వన్యప్రాణులను వీక్షించడం కోసం సఫారీ ఏర్పాటుకు వైల్డ్లైఫ్ శాఖ దృష్టి సారించింది. ఇనుపకంచె (ఫెన్సింగ్)బయటి నుంచి కాకుండా అటవీ ప్రాంతంలోకి ఓపెన్జీప్ లాంటి వాహనాల్లో వెళ్లి..కనులారా వీక్షించేందుకు సఫారీ సౌకర్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి. రూ.5.8 కోట్ల అంచనాల వ్యయం అవసరమని సీసీఎఫ్కు ఇటీవల ప్రతిపాధనలు కూడా పంపారు. ఆమోద ముద్ర పడితే రెండు, మూడు నెలలోనే సఫారీ ద్వారా వీక్షించే అవకాశం ఉంది. -
జింకల పార్కుపై దాడి
ఖమ్మం : కొంత మంది గుర్తు తెలియని దుండగులు జింకల పార్కులో చొరబడి అక్కడ ఉన్న సోలార్ పవర్ ఫ్లాంట్పై దాడి చేశారు. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం గంగారం పంచాయతీలోని చింతోని జింకల పార్కులో జరిగింది. వివరాలు.. దాదాపుగా 100 మంది గుర్తుతెలియని దుండగులు సోమవారం తెల్లవారజామున పార్కులో చోరబడినట్టు అటవీ అధికారులు తెలిపారు. అక్కడ ఉన్న సోలార్పవర్ ఫ్లాంట్పై దాడి చేశారు. ఈ దాడిలో పైపులు, ఫ్యానల్స్ పగలగొట్టారు. సుమారు రూ.12 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గత కొద్ది రోజులుగా జిల్లాలో పోడు రైతులకు అటవీ అధికారులకు మధ్య జరుగుతున్న వివాదాలే ఈ చర్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. (టేకులపల్లి)