జింకల పార్కుపై దాడి | unknown people attack on deers park in khammam distirict | Sakshi
Sakshi News home page

జింకల పార్కుపై దాడి

Published Mon, Apr 20 2015 12:36 PM | Last Updated on Wed, Apr 3 2019 3:55 PM

జింకల పార్కుపై దాడి - Sakshi

జింకల పార్కుపై దాడి

ఖమ్మం : కొంత మంది గుర్తు తెలియని దుండగులు జింకల పార్కులో చొరబడి అక్కడ ఉన్న సోలార్ పవర్ ఫ్లాంట్‌పై దాడి చేశారు. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం గంగారం పంచాయతీలోని చింతోని జింకల పార్కులో జరిగింది. వివరాలు.. దాదాపుగా 100 మంది గుర్తుతెలియని దుండగులు సోమవారం తెల్లవారజామున పార్కులో చోరబడినట్టు అటవీ అధికారులు తెలిపారు. అక్కడ ఉన్న సోలార్‌పవర్‌ ఫ్లాంట్‌పై దాడి చేశారు. ఈ దాడిలో పైపులు, ఫ్యానల్స్ పగలగొట్టారు.

సుమారు రూ.12 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గత కొద్ది రోజులుగా జిల్లాలో పోడు రైతులకు అటవీ అధికారులకు మధ్య జరుగుతున్న వివాదాలే ఈ చర్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
(టేకులపల్లి)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement