
బోటు షికారు చేస్తున్న పర్యాటకులు
సాక్షి, పాల్వంచ(ఖమ్మం) : కిన్నెరసానిలో పర్యాటకులు సందడి చేశారు. పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో సెలవు రోజు కావడంతో ఆదివారం వివిధ ప్రాంతాల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో కిన్నెరసానికి ఒక్కరోజు రూ40,360 ఆదాయం లభించింది. పర్యాటకులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కిన్నెరసాని పరిసరాల్లో ఆనందోత్సహాల నడుమ గడిపారు. డీర్ పార్కులోని దుప్పులను, నెమళ్లను, బాతులను, డ్యాం పైనుంచి జలశయాన్ని వీక్షించారు. అనంతరం బోటు షికారు చేశారు. 808 మంది కిన్నెరసానిలోకి ప్రవేశించిడం ద్వారా వైల్డ్‌లైఫ్ చెక్‌పోస్టుకు రూ.22,240 ఆదాయం, 220 మంది పర్యాటకులు బోటు షికారు చేయడం ద్వారా రూ.18,120 ఆదాయం టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంస్థకు లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ప్రాజెక్టు పైనుంచి జలాశయాన్ని తిలకిస్తున్న పర్యాటకులు
Comments
Please login to add a commentAdd a comment