Deer Park
-
జాతీయ పార్కుల్లో ఎస్టీపీలు తప్పనిసరి.. ఎందుకంటే!
సాక్షి, హైదరాబాద్: జీవ వైవిధ్యానికి, పర్యావరణ పరిరక్షణ, స్థానికులకు ఆహ్లాదాన్ని అందించే జాతీయ పార్కులు కలుషిత కాటుకు గురవుతున్న వైనంపై పీసీబీ సీరియస్‌గా దృష్టి సారించింది. నగరంలోని కేబీఆర్‌పార్కు, జూపార్క్ సహా మహవీర్ హరిణ వనస్థలి తదితర జాతీయ ఉద్యానవనాల్లో మురుగు నీరు చేరకుండా నిరోధించడంతోపాటు.. ప్రతి చుక్క నీటిని శుద్ధి చేసేందుకు ఎస్టీపీలు నిర్మించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ, టీఎస్ఐఐసీలు నెలరోజుల్లోగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించింది. హరిణ వనస్థలిలో కలుషిత కాటు ఇలా... నగర శివార్లలో విజయవాడ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న మహవీర్ హరిణ వనస్థలి జాతీయ పార్క్‌లోని సహజ సిద్ధమైన నీటికుంటలోకి ఆటోనగర్ పారిశ్రామిక వాడలోని ఆటోగ్యారేజ్లు, భారీ వాహనాల సర్వీసింగ్ సెంటర్లు, ఫెస్టిలైజర్ గోడౌన్ల నుంచి వచ్చి చేరుతున్న వ్యర్థజలాలతో కాలుష్య కాసారంగా మారింది. దీంతో ఈ పార్క్‌లోని వన్యప్రాణులకు ముంపు పొంచి ఉండడంతో పీసీబీ అప్రమత్తమైంది. నీటినమూనాలు సేకరించి పరీక్షించగా.. కలుషిత ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో విధిగా ఎస్టీపీ నిర్మించాలని..శుద్ధి చేసిన నీటిని కేవలం గార్డెనింగ్ అవసరాలకే వినియోగించాలని సంబంధిత విభాగాలకు స్పష్టం చేసింది. మిగతా వ్యర్థజలాలను పైప్లైన్లను ఏర్పాటు చేసి మూసీలోకి మళ్లించాలని సూచించింది. చుట్టూ సీసీటీవీల నిఘా తప్పనిసరి.. నగరంలో జాతీయ పార్క్‌లకు ఆనుకొని ఉన్న గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నుంచి వ్యర్థజలాలు ఉద్యానవనాల్లోకి చేరకుండా చూసేందుకు ఆయా వాడల్లో సీసీ టీవీలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని పీసీబీ టీఎస్ఐఐసీ, బల్దియాను ఆదేశించింది. వ్యర్థజ లాలను బహిరంగ ప్రదేశాలు, నాలాలు, చెరువులు, జాతీయ పార్కుల్లోకి వదిలిపెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఎస్టీపీల ఏర్పాటుతో ఉపయోగాలివే.. ► జాతీయ పార్క్‌ల్లోకి చేరే మురుగు, వ్యర్థజలాలను శుద్ధి చేసిన తరవాతనే లోనికి ప్రవేశించే ఏర్పాటుచేయవచ్చు. ► శుద్ధిచేసిన నీటిని మొక్కల పెంపకం, గార్డెనింగ్ అవసరాలకు వినియోగించవచ్చు. ► ఆయా పార్క్‌లలోని చెరువులు, కుంటలు కాలుష్యకాసారం కాకుండా చూడవచ్చు. ► ఆయా ఉద్యానవనాల్లోకి కేవలం వర్షపునీరు మాత్రమే చేరే ఏర్పాట్లు చేయాలి. ► ప్లాస్టిక్, ఇతర ఘన వ్యర్థాలు పార్కుల్లోకి చేరకుండా నిరోధించాలి. ► జీవ వైవిధ్యాన్ని పరిరక్షణపై అన్ని వర్గాల్లో అవగాహన కల్పించాలి. -
అమ్మా భయమేస్తోంది.. నువ్వేక్కడున్నావ్
అమ్మా అమ్మా నీ పసిదాన్నమ్మా.. నీవే లేక వసివాడనమ్మా మాటే లేకుండా నువ్వే మాయం కన్నీరవుతోంది ఎదలో గాయం అయ్యో వెళ్లిపోయావే నన్నొదిలేసి ఎటుపోయావే... అంటూ తల్లడిల్లిపోతోంది శామీర్‌పేట డీర్–పార్క్‌లోని పసి దుప్పి. శామీర్‌పేట్: ముద్దులొలికే ఈ చిన్నారి జంకకు సీత కష్టాలు వచ్చాయి. తల్లి తన వద్దకు ఎప్పుడు వస్తుందోనని వేయి కళ్లతో.. కోటి ఆశలతో వేచి చూస్తోంది. చిన్నచిన్నగా గెంతుతూ ఎంతో అందంగా ఉన్న ఆ దుప్పి తల్లి కనిపించక విలవిలలాడిపోతోంది. శామీర్‌పేట డీర్ పార్కులో నెలన్నర క్రితం పార్కు ఫెన్సింగ్‌లో తల ఇరుక్కుని ఉన్న సుమారు రెండు రోజుల వయస్సు ఉన్న జింకపిల్లను సిబ్బంది గమనించారు. దానికి చికిత్స చేసి అప్పటి నుంచి ఆవు పాలు తాగిపిస్తూ పెంచుతున్నారు. మరి అప్పటి నుంచి తల్లి జింకను ఎందుకు పట్టుకోలేకపోయారు.? ఎక్కడ ఉంది అనే దానిపై విచారణ చేపట్టారా? తల్లీబిడ్డను ఇప్పటి వరకు ఎందుకు కలుపలేకపోయారు? అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై అటవీశాఖ అధికారులు ఏమి సమాధానం చెబుతారో వేచి చూద్దాం. తరలించిన జింకలలో ఉందా.? ఫిబ్రవరి చివరి వారంలో శామీర్‌పేట డీర్‌పార్కు నుంచి కాగజ్‌నగర్‌కు 27 జింకలను తరలించామని అధికారులు తెలిపారు. అదే సమయంలో ఈ దుప్పి జన్మించింది. ఈ దుప్పి తల్లి కాగజ్‌నగర్‌కు తరలించిన జింకలలో ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఫారెస్ట్ సెక్షన్ అధికారిని వివరణ కోరగా పొంతనలేని సమాధానాలు చెప్పడం కొసమెరుపు. దీనిపైన సమగ్ర దర్యాప్తు జరిపి దుప్పిని తల్లి వద్దకు చేర్చాలని జంతుప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: టైమ్‌సెన్స్ లేక నెలకు కోటి రూపాయల భారం! -
కిన్నెరసానిలో పర్యాటకుల సందడి
సాక్షి, పాల్వంచ(ఖమ్మం) : కిన్నెరసానిలో పర్యాటకులు సందడి చేశారు. పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో సెలవు రోజు కావడంతో ఆదివారం వివిధ ప్రాంతాల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో కిన్నెరసానికి ఒక్కరోజు రూ40,360 ఆదాయం లభించింది. పర్యాటకులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కిన్నెరసాని పరిసరాల్లో ఆనందోత్సహాల నడుమ గడిపారు. డీర్ పార్కులోని దుప్పులను, నెమళ్లను, బాతులను, డ్యాం పైనుంచి జలశయాన్ని వీక్షించారు. అనంతరం బోటు షికారు చేశారు. 808 మంది కిన్నెరసానిలోకి ప్రవేశించిడం ద్వారా వైల్డ్‌లైఫ్ చెక్‌పోస్టుకు రూ.22,240 ఆదాయం, 220 మంది పర్యాటకులు బోటు షికారు చేయడం ద్వారా రూ.18,120 ఆదాయం టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థకు లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
తిరుమల జింకల పార్క్ వద్ద అగ్ని ప్రమాదం
-
ఢిల్లీలో జూ పార్క్‌లకు బర్డ్ ప్లూ భయం
-
త్వరలో కేజీ టు పీజీ ఉచిత విద్య విధానాలు ఖరారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో కేజీ టూ పీజీ ఉచిత విద్యపై ఈనెల 27వ తేదీన సదస్సును నిర్వహిస్తున్నుట్టు తెలిపారు. సదస్సు ద్వారా అన్ని వర్గాల అభిప్రాయాలు సేకరించి ఉచిత విద్యపై విధివిధానాలు ఖరారు చేస్తామని ఆయన తెలిపారు. పాఠ్యాంశాల రూపకల్పనపై కూడా అందరి అభిప్రాయం తీసుకుంటామన్నారు. 1999 నుంచి పెండింగ్ లో ఉన్న డీఎస్సీ అభ్యర్థుల వినతులపై సానుకూలంగా స్పందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కోసం కేటాయించిన స్థలంపై సమీక్షించిన ఆయన 532 ఎకరాల్లో చాలా స్థలం ఖాళీగా ఉందని తెలిపారు. దానిపై అధ్యయనం చేసి, అవసరమైతే ప్రభుత్వమే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వనస్థలిపురంలో ఉన్న హరిత వనస్థలి జింకల పార్కును రక్షించాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. పార్కు స్థలం దురాక్రమణ కాకుండా ప్రహరీ నిర్మాణం చేపట్టాలన్నారు. పార్కు పరిరక్షణకు స్థానికులతో కమిటీ ఏర్పాటుచేయాలని సూచించారు. ఎంపీ లాడ్స్ నుంచి దీనికి నిధులు కేటాయించేలా చూస్తామన్నారు. కేబీఆర్ పార్కు తరహాలో బొటానికల్ గార్డెన్ ను అభివృద్ధి చేయాలని ఆయన తెలిపారు. -
‘హమాలీ' సొమ్ము హాంఫట్
మద్యం డిపోలో హమాలీ పోస్టుల కుంభకోణం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఒక్కో హమాలీ పోస్టుకు రూ.16లక్షల చొప్పున 26 మందికి ఉద్యోగాలిచ్చేందుకు ఏకంగా రూ.4.16 కోట్లు వసూలు చేయడం చర్చనీయాంశమైంది. హమాలీ పోస్టుకు ఇంత డబ్బులివ్వడమేంట ని జనం విస్తుపోతుండగా... అంత డబ్బు ముట్టజెప్పేందుకు వెనుకాడలేదంటే ఆ పోస్టులో పెద్ద కిక్కే ఉందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. హమాలీల నియామకాల్లో వసూళ్ల పర్వానికి తెరదీసిందెవరు.. వసూలైన మొత్తంలో ఎవరెవరికి వాటాలు దక్కాయనే అంశంపై ఆరా తీస్తే విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. వసూళ్లకు ఓ సూపర్వైజర్ సూత్రధారి కాగా.. అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు ఇందులో వాటాదారులు కావడం విశేషం. వాటాల్లో అభిప్రాయభేదాలు రావడంతో ఈ విషయం బయటకు పొక్కింది. కంగుతిన్న సూత్రధారులు ఈ విషయం బయటకు రావడానికి కారకుడైన నాయకుడిని ‘సంతృప్తి’ పర్చేందుకు రంగంలోకి దిగారు. -కరీంనగర్‌క్రైం కరీంనగర్ క్రైం : ‘హమాలీ' పోస్టుందా...పెళ్లికి రెడీ! జిల్లాలో 304 వైన్స్‌లు, 45 బార్లున్నాయి. వీటికి మద్యం సరఫరా చేయడానికి జిల్లా కేంద్రంలోని డీర్ పార్క్ వద్ద మద్యం డిపోను ఏర్పాటు చేశారు. ఇక్కడినుంచి ప్రతిరోజు రూ.కోట్ల విలువైన మద్యం ఎగుమతి, దిగుమతి అవుతుంది. వీటిని దింపడానికి మొత్తం 80 హమాలీలు పనిచేస్తున్నారు. వీరంతా దినసరి కూలీలే. అయితేనేం... ఒక్కో హమాలీ రోజుకు సగటున రూ.2,500 సంపాదిస్తారు. పండగ సీజన్లో అయితే సంపాదన రెట్టింపుగా ఉంటుంది. దీనికితోడు హమాలీలో ఎవరైనా ప్రమాదవశాత్తు మరణించినా ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు మిగి లిన హమాలీలంతా తలా ఇంత వేసుకుని రూ.లక్షలు సాయం చేశారు. ఎవ రైనా హమాలీ పని మానేస్తే అతని స్థానంలో కొత్తగా చేరేవారు రూ.16ల క్షలు ఇవ్వాల్సిందే. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన అంశమేమిటంటే... సంపాదనకు ఢోకా లేకపోవడంతో సదరు హమాలీకి పిల్లనిచ్చేం దుకు సింగరేణిలో పనిచేసే ఉద్యోగులు ఎగబడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగికి పిల్లనిచ్చేందుకు ఏవిధంగా ఆసక్తి చూపుతారో... దాదాపు అదే స్థాయిలో హామాలీకి డిమాండ్ ఉంటోంది. సూపర్వైజరా... మజాకా...! లిక్కర్ డిపోలో హమాలీ పోస్టుకు ఇంత క్రేజీ ఉండటంతో చాలా మంది యువకులు క్యూలో నిలబడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన ఓ సంస్థకు చెందిన సూపర్వైజర్ దీనిని క్యాష్ చేసుకునేలా పథకం వేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న 80 మంది హమాలీలపై పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున మరో 26 మందిని నియమిం చుకుందామని లిక్కర్‌డిపో అధికారులకు ప్రతిపాదించాడు. దీనికి పై అధికారులు కూడా సై అనడంతో హమాలీ పోస్టు కోసం ఒక్కో వ్యక్తి నుంచి రూ.16 ల క్షలు వసూలు చేశాడు. ఈ లెక్కన 26 మంది వద్ద రూ.4.15 కోట్లు తీసుకున్నారు. సదరు సూపర్వైజర్కు ఇలా డబ్బులు వసూలు చేయడం ఇదేమీ కొత్త కాదని తెలిసింది. గతంలో ఈ సూపర్వైజర్ పనిచేసిన పలు డిపోల్లోనూ ఇలాంటి దందానే నడిపించాడని సమాచారం. ఏ డిపోలోనైతే పనిచేస్తున్నాడో ఆ డిపోలో కొత్తగా హమాలీలను నియమించుకునే వరకు మాత్రమే సదరు సూపర్వైజర్ అక్కడ కొనసాగతారని తెలుస్తోంది. హమాలీ పోస్టులకు డబ్బులు వసూలు చేసి ఎవరి వాటాలను వారికి పంచిన కొద్దిరోజుల తరువాత మరో డిపోకు బదిలీ చేసుకుని వెళుతుంటాడని తెలిసింది. ఎందుకంటే అక్కడ మళ్లీ కొత్తగా హమాలీ పోస్టుల నియామకం దందాకు తెరలేపుతారని సమాచారం. ఇప్పటివరకు సదరు సూపర్వైజర్ దాదాపు వంద మందిని వివిధ లిక్కర్ డిపోల్లో నియమించి రూ.కోట్లు దండుకుంటున్నట్లు తెలిసింది. పాత హమాలీలకు డబ్బు ఎర కొత్త హమాలీలొస్తే తమ సంపాదన తగ్గిపోతుం దని భావించిన పాత హమాలీలు వారి రాకను తొలుత అడ్డుకున్నారు. అయితే ఇలాంటి వ్యవహారాలను చక్కదిద్దడంలో అందెవేసిన సదరు సూపర్వైజర్ లిక్కర్ డిపోకు చెందిన ఇద్దరు అధికారులతో కుమ్కకై పాత హమాలీలకు డబ్బు ఎర చూపినట్లు తెలిసింది. ఒక్కో పాత హమాలీకి రూ.3లక్షల చొప్పున మొత్తం 80 మంది హమాలీలకు రూ.2.4 కోట్లు ముట్టజెప్పేందుకు సిద్ధమయ్యారు. తొలుత హమాలీలంతా అమాయకంగా ఒప్పుకున్నప్పటికీ చివర్లో దీనిని వ్యతిరేకించడంతోపాటు దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. బెడిసికొట్టిందిలా... ఇంతవరకు గుంభనంగా సాగిన వ్యవహారం వాటాల్లో తేడాలు రావడంతో ఓ ప్రజాప్రతినిధి దీనిని బయటకు చేరవేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి సదరు ప్రజాప్రతినిధి కూడా లిక్కర్ డిపోలో హమాలీగా నియమిస్తానంటూ ఇద్దరు వ్యక్తుల వద్ద డబ్బులు తీసుకున్నటు తెలిసింది. అయితే ఆ ఇద్దరిలో ఏ ఒక్కరినీ హమాలీగా నియమించుకునేందుకు సిద్ధంగా లేకపోవడం, వాటా చెల్లింపులోనూ వివక్ష చూపడంతో తట్టుకోలేని సదరు ప్రజాప్రతినిధి వ్యూహాత్మకంగా బయటపెట్టడం, పాత హమాలీలు జత కట్టడంతో వివాదాస్పదమైంది. ‘సంతృప్తి' దిశగా చర్చలు హమాలీ పోస్టుల వసూళ్లపర్వం వివాదాస్పదం కావడంతో కంగుతిన్న సూత్రధారులు నష్టనివారణ చర్యల్లో పడ్డారు. అందులో భాగంగా విషయాన్ని బయట పెట్టిన ప్రజాప్రతినిధితో శుక్రవారం చర్చలు మొదలు పెట్టారు. ఇందుకోసం ఓ మధ్యవర్తిని పంపి సంతృప్తికరస్థాయిలో సదరు ప్రజాప్రతినిధికి మంచి ప్యాకేజీని ఆఫర్ చేసినట్లు తెలిసింది. అయితే ఈ వివాదం బయటకు పొక్కడంతో దీనిపై అధికారులు ప్రత్యేక నిఘా వేసినట్లు సమాచారం. -
కిన్నెరసాని డీర్ పార్క్‌కు 40 ఏళ్లు
పాల్వంచ రూరల్: పాల్వంచ పరిధిలోని కిన్నెరసానిలో జింకల పార్క్ ఏర్పాటుచేసి నేటికి 40సంవత్సరాలు పూర్తైది. పాల్వం చ మండలంలోని యానంబైల్ గ్రామ పంచాయతీ కిన్నెరసాని ప్రాజెక్టు సమీపంలో 30 జింకలతో ఏర్పాటు చేసిన ఈ పార్క్‌ను 1974 సెప్టెంబర్ 29వ తేదీన అప్పటి రాష్ట్రముఖ్యమంత్రి దివంగత జలగం వెంగళవారం ప్రారంభించారు. అప్పటినుంచి సింగరేణి యాజమాన్యం దీనిని పర్యవేక్షించింది. పర్యాటకులకోసం కిన్నెరసాని రిజర్వాయర్ వద్ద సింగరేణి ఏర్పాటు చేసిన అద్దాల మేడను 2000 సంవత్సరంలో మావోయిస్టులు డిటోనేటర్ల ద్వారా పేల్చి వేయడంతో అద్దాల మేడ, పది కాటేజీలు, జింకల పార్కు నిర్వహణ బాధ్యతలను వన్యమృగ సంరక్షణ అధికారులకు అప్పగించారు. అప్పటి నుంచి వైల్డ్‌లైఫ్ అధికారులు ప్రత్యేక సిబ్బందిని నియమించి జింకల పార్క్‌ను పర్యవేక్షిస్తున్నారు. ప్రారంభంలో 30 జింకలు ఉండగా క్రమక్రమం గా అధికారులు పార్క్ విస్తీర్ణం పెంచి 110 జింకలకు పెంచారు. రాష్ట్రంలోనే అరుదుగా కనిపించే కృష్ణ జింకలు కిన్నెరసాని రిజర్వాయర్‌కు వచ్చే పర్యాటకులకు ముందుగా కనువిందు చేస్తాయి. పార్క్‌లో ఉండే జింకలకు గ్రాస్‌తోపాటు తాటి చెట్టు కర్ర తొట్లను ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యం కల్పిచేవారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం సిబ్బందితో జింకలకు గడ్డి, 120 కేజీల ఫీడ్‌ను పోషకాహారంగా అందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న డీర్ పార్క్ 40 జింకలు మాత్రమే సరిపోతుంది. కానీ స్థాయికి మించి జింకలు ఉన్నాయి. -
ఆహ్లాదం... ఆధ్యాత్మికం... ఆనందం!
మనదగ్గరే - శామీర్‌పేట్ చెరువు పచ్చని పరిసరాలతో చూపరులను ఇట్టే ఆక ర్షిస్తోంది శామీర్‌పేట్ పెద్ద చెరువు. 956 ఎకరాలలో విస్తరించి 33 అడుగుల లోతు నీటి నిల్వ సామర్థ్యం కల్గి ఉన్న వర్షాధారిత చెరువు ఇది. హైదరాబాద్ నగరానికి 24 కిలోమీటర్ల దూరంలో రాజీవ్హ్రదారికి ఆనుకుని మంచి ఆహ్లాదకరమైన, విశాలమైన స్థలంలో శామీర్‌పేట్ పెద్ద చెరువు ఉంది. రంగారెడ్డి జిలాల్లో ఉన్న ఈ సువిశాలమైన చెరువు అందాలను చూసేందుకు వందల సంఖ్యలో పర్యాటకులు వచ్చి విడది చేసి వెళ్తుంటారు. పెద్ద చెరువుకు మరింత వైభవం... వరదనీరు వచ్చే అవకాశం లేకపోవడంతో ఈ చెరువు పూర్తి స్థాయిలో నిండాలంటే భారీ స్థాయిలో వ ర్షాలు పడాలి. ఒకసారి పూర్తి స్థాయిలో చెరువులో నీటి మట్టం చేరితే శామీర్‌పేట్ మండలంలోని సుమారు 2600ఎకరాల భూ సాగుకు అనువుగా ఉంటుంది. మెదక్, నల్గొండ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల గ్రామాల్లో వేల ఎకరాలకు సేద్యపు నీరు ప్రత్యక్షంగా, భూగర్భజలాల ద్వారా బోరు బావులకు చేరేందుకు పరోక్షంగా ఉపయోగపడుతుంది. మది దోచే జింకలపార్క్... ఈ చెరువుకు సమీపంలో బిట్స్‌పిలానీ క్యాంపస్, రాజీవ్ రహదారికి చేరువలో నల్సార్ లా యూనివర్శిటీ ఉన్నాయి. సమీపంలో జవహర్ జింకలపార్క్ 26 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఈ పార్క్‌లో చుక్కల జింకలు, కుందేళ్ళు, నెమళ్ళు, రకరకాల పక్షులు కనువిందుచేస్తుంటాయి. ఈ ప్రాంతానికి బర్డ్ వాచ్ స్పాట్‌గా కూడా పేరుంది. ఈ పార్క్ పక్కనే టూరిజమ్ వారి హరితా భవన్ ఉంది. రమ్యంగా రత్నాలయం... శామీర్‌పేట నుండి 3 కి.మీ దూరంలో ఉన్న రత్నాలయం ఉంది. వెంకటేశ్వరస్వామి కొలువుండే ఈ ఆలయం బిర్లా, టెంపుల్ని తలపిస్తుంటుంది. ఓమ్, విష్ణుచక్రాలతో ఉద్యాన, వాటర్ ఫౌంటెయిన్ మధ్యలో భూదేవి, శ్రీదేవిలతో కొలువున్న వెంకటేశ్వర , కాళిందిపై నర్తించే కృష్ణ విగ్రహాలు.. ప్రధాన ఆకర్షణ. సమీపంలో పేరొందిన అలంకృత, లియోనియా రిసార్టులున్నాయి. ఇలా చేరుకోవాలి.. సికింద్రాబాద్ నుంచి 24 కి.మీ దూరంలో ఉన్న ఈ లేక్‌కు సొంత వాహనాలలో చేరుకోవచ్చు. - అభిమన్యు