త్వరలో కేజీ టు పీజీ ఉచిత విద్య విధానాలు ఖరారు | telangana cm kcr reviews on various departments | Sakshi
Sakshi News home page

త్వరలో కేజీ టు పీజీ ఉచిత విద్య విధానాలు ఖరారు

Published Fri, Jan 16 2015 5:07 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

త్వరలో కేజీ టు పీజీ ఉచిత విద్య విధానాలు ఖరారు - Sakshi

త్వరలో కేజీ టు పీజీ ఉచిత విద్య విధానాలు ఖరారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ...  తెలంగాణలో కేజీ టూ పీజీ ఉచిత విద్యపై ఈనెల 27వ తేదీన సదస్సును నిర్వహిస్తున్నుట్టు తెలిపారు. సదస్సు ద్వారా అన్ని వర్గాల అభిప్రాయాలు సేకరించి ఉచిత విద్యపై విధివిధానాలు ఖరారు చేస్తామని ఆయన తెలిపారు. పాఠ్యాంశాల రూపకల్పనపై కూడా అందరి అభిప్రాయం తీసుకుంటామన్నారు. 1999 నుంచి పెండింగ్ లో ఉన్న డీఎస్సీ అభ్యర్థుల వినతులపై సానుకూలంగా స్పందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

ఎమ్మార్ ప్రాపర్టీస్ కోసం కేటాయించిన స్థలంపై సమీక్షించిన ఆయన 532 ఎకరాల్లో చాలా స్థలం ఖాళీగా ఉందని తెలిపారు. దానిపై అధ్యయనం చేసి, అవసరమైతే ప్రభుత్వమే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

వనస్థలిపురంలో ఉన్న హరిత వనస్థలి జింకల పార్కును రక్షించాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. పార్కు స్థలం దురాక్రమణ కాకుండా ప్రహరీ నిర్మాణం చేపట్టాలన్నారు. పార్కు పరిరక్షణకు స్థానికులతో కమిటీ ఏర్పాటుచేయాలని సూచించారు. ఎంపీ లాడ్స్ నుంచి దీనికి నిధులు కేటాయించేలా చూస్తామన్నారు. కేబీఆర్ పార్కు తరహాలో బొటానికల్ గార్డెన్ ను అభివృద్ధి  చేయాలని ఆయన తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement