emmar properties
-
త్వరలో కేజీ టు పీజీ ఉచిత విద్య విధానాలు ఖరారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో కేజీ టూ పీజీ ఉచిత విద్యపై ఈనెల 27వ తేదీన సదస్సును నిర్వహిస్తున్నుట్టు తెలిపారు. సదస్సు ద్వారా అన్ని వర్గాల అభిప్రాయాలు సేకరించి ఉచిత విద్యపై విధివిధానాలు ఖరారు చేస్తామని ఆయన తెలిపారు. పాఠ్యాంశాల రూపకల్పనపై కూడా అందరి అభిప్రాయం తీసుకుంటామన్నారు. 1999 నుంచి పెండింగ్ లో ఉన్న డీఎస్సీ అభ్యర్థుల వినతులపై సానుకూలంగా స్పందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కోసం కేటాయించిన స్థలంపై సమీక్షించిన ఆయన 532 ఎకరాల్లో చాలా స్థలం ఖాళీగా ఉందని తెలిపారు. దానిపై అధ్యయనం చేసి, అవసరమైతే ప్రభుత్వమే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వనస్థలిపురంలో ఉన్న హరిత వనస్థలి జింకల పార్కును రక్షించాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. పార్కు స్థలం దురాక్రమణ కాకుండా ప్రహరీ నిర్మాణం చేపట్టాలన్నారు. పార్కు పరిరక్షణకు స్థానికులతో కమిటీ ఏర్పాటుచేయాలని సూచించారు. ఎంపీ లాడ్స్ నుంచి దీనికి నిధులు కేటాయించేలా చూస్తామన్నారు. కేబీఆర్ పార్కు తరహాలో బొటానికల్ గార్డెన్ ను అభివృద్ధి చేయాలని ఆయన తెలిపారు. -
గల్లాపై ఆరోపణలు: దర్యాప్తునకు కోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు కేటాయించిన భూమి నుంచి మాజీ మంత్రి గల్లా అరుణకుమారికి చెందిన భూమిని మినహాయించడంతో పాటు మ్యూటేషన్ ప్రక్రియలో అక్రమాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలని సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి సీబీఐ ఎస్పీని మంగళవారం ఆదేశించారు. గల్లా అరుణకుమారితో అధికారులు కుమ్మక్కై ప్రభుత్వానికి నష్టం చేకూర్చారని హైదరాబాద్‌కు చెందిన గాలి పురుషోత్తమనాయుడు కోర్టులో పిటిషన్ వేశారు. అరుణ భర్త రామచంద్రనాయుడు, కుమారుడు జయదేవ్ కుమార్తె రమాదేవి సహా అప్పటి ఏపీఐఐసీ, జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.