సాక్షి, హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు కేటాయించిన భూమి నుంచి మాజీ మంత్రి గల్లా అరుణకుమారికి చెందిన భూమిని మినహాయించడంతో పాటు మ్యూటేషన్ ప్రక్రియలో అక్రమాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలని సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి సీబీఐ ఎస్పీని మంగళవారం ఆదేశించారు. గల్లా అరుణకుమారితో అధికారులు కుమ్మక్కై ప్రభుత్వానికి నష్టం చేకూర్చారని హైదరాబాద్‌కు చెందిన గాలి పురుషోత్తమనాయుడు కోర్టులో పిటిషన్ వేశారు. అరుణ భర్త రామచంద్రనాయుడు, కుమారుడు జయదేవ్ కుమార్తె రమాదేవి సహా అప్పటి ఏపీఐఐసీ, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.