సాక్షి, చిత్తూరు జిల్లా: రాజకీయ జీవితంపై మాజీ మంత్రి గల్లా అరుణకుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తవణంపల్లి మండలం దిగువమాఘంలో అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ భవనానికి భూమిపూజలో పాల్గొని గల్లా అరుణకుమారి మీడియాతో మాట్లాడారు.
'నా రాజకీయ జీవితం ముగిసింది. నేను చేయని పదవి లేదు.. చూడాని రాజకీయం లేదు. నా సంకల్పమే నా భవిష్యత్తు. నా అనుచరులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను. ఏ పార్టీలో భవిష్యత్ ఉంటుందో వాళ్లు అక్కడ ఉండొచ్చు. టీడీపీకి మేము పెద్ద దిక్కు కాదు. చంద్రబాబే పార్టీకి పెద్ద దిక్కు అని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏమీ వద్దనుకున్నాను. అందుకే సైలెంట్‌గా ఉన్నానని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అన్నారు.
చదవండి: (అపాచీ పరిశ్రమతో 10 వేల మందికి ఉద్యోగాలు : సీఎం జగన్)
Comments
Please login to add a commentAdd a comment