నల్గొండ: సిమీ ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సూర్యాపేట సీఐ మొగిలయ్య పూర్తిగా కోలుకున్నారు. బుధవారం నుంచి తిరిగి విధుల్లో చేరారు. నెలరోజుల కిందట రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సూర్యాపేట బస్టాండు హత్యాకాండలో గాయపడిన సీఐ కోలుకొని విధుల్లో చేరారు.
సూర్యాపేట బస్టాండులో అర్ధరాత్రి సిమీ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో కానిస్టేబుల్ నాగరాజు తో పాటు మరో హోంగార్డు మరణించగా సీఐ మొగలయ్య తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. సీఐ ఇంత త్వరగా తిరిగి విధుల్లో చేరడంతో ఆయన ధ్రుడచిత్తాన్ని, సంకల్పశక్తిని పలువురు కొనియాడుతున్నారు.
విధుల్లో చేరిన సూర్యాపేట సీఐ మొగిలయ్య
Published Wed, May 6 2015 3:16 PM | Last Updated on Sun, Sep 3 2017 1:33 AM
Advertisement
Advertisement