కోలీవుడ్ హీరో విశాల్( Vishal) అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ‘మదగజరాజ’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఆయన వణుకుతూ మాట్లాడారు. అంతకు ముందు కొన్నాళ్ల పాటు కెమెరాకు కనిపించలేదు. సడెన్‌గా ఈవెంట్‌లో కనిపించి.. అలా వణుకుతూ మాట్లాడడంతో తమ హీరోకి ఏమైందోనని అభిమానులు కంగారు పడ్డారు. ఆయన జ్వరంతో బాధపడుతన్నాడని వైద్యులు చెప్పినప్పటికీ.. విశాల్ హెల్త్‌పై రకరకాల పుకార్లు వస్తున్నాయి. అసలు విశాల్‌కి ఏమైందనే విషయాన్ని తాజాగా నటి ఖుష్బూ(khushboo sundar) వివరించింది.
కంగారు పడాల్సిన అవసరం లేదు
తాజాగా ఖుష్బూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..విశాల్ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పారు. ‘ఢిల్లీలో ఉన్నప్పుడే విశాల్‌కి జ్వరం వచ్చింది. కానీ 12 ఏళ్ల తర్వాత ‘మదగజరాజ’ రిలీజ్ అవుందుని ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ఈవెంట్‌కి వచ్చాడు. అప్పటికే విశాల్ డెంగీ ఫీవర్‌తో బాధపడుతున్నాడు. 103 డిగ్రీల జ్వరం కారణంగా వణికిపోయారు. ‘ఇంత జ్వరంతో ఎందుకు వచ్చావు?’అని అడిగితే.. ‘నేను నటించిన చిత్రం 12 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ఈవెంట్‌కి కచ్చితంగా రావాలనుకున్నాను. అందుకే బాడీ సహకరించకపోయినా వచ్చేశాను’ అని విశాల్ చెప్పారు. ఈ ఈవెంట్ పూర్తయిన వెంటనే విశాల్‌ని ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. కంగారుపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారు. అయినా కూడా కొంతమంది యూట్యూబర్స్ విశాల్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. సెలబ్రిటీల గురించి నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాలను ప్రచారం చేయకండి’ అని ఖుష్భూ విజ్ఞప్తి చేశారు.
కాగా, విశాల్, ఖుష్భూ మధ్య మంచి స్నేహబంధం ఉంది. కలిసి సినిమాలు చేయకపోయినా.. చాలా క్లోజ్‌గా ఉంటారు. మదగజరాజు సినిమాకు ఖుష్భూ భర్త సుందర్.సి దర్శకత్వం వహించారు. విశాల్‌తో తనకున్న అనుబంధం గురించి ఖుష్భూ మాట్లాడుతూ.. ‘మేమిద్దరం కలిసి సినిమాలు చేయలేదు. కానీ మొదటగా ఇద్దరం కలిసి ఓకే పార్టీలో పని చేశాం. ఆ కారణంగానే మా మధ్య మంచి స్నేహం ఏర్పడింది. విశాల్ నటించిన సినిమాల్లో కొన్ని నాకు చాలా ఇష్టం. మంచి టాలెంట్ ఉన్న నటుడు ఆయన. సినిమా కోసం చాలా కష్టపడతాడు’ అని ఖష్భూ చెప్పుకొచ్చింది.
12 ఏళ్ల తర్వాత రిలీజ్
విశాల్ హీరోగా సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే ‘మదగజరాజ’(Madha Gaja Raja). 2013లో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పలు కారణాల వల్ల వాయిదా పడి దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యాక్షన్ కామెడీగా రూపొందిన ఈ మూవీలో అంజలి, వరలక్ష్మీ శరత్‌కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఆర్య, సదా అతిథి పాత్రల్లో సందడి చేయనున్నారు. ఈ సినిమా కోసం విశాల్ ఎయిట్ ప్యాక్ చేశాడట.
షూటింగ్ ఆసల్యం అయినా కూడా మరో సినిమా చేయకుండా.. ఈ మూవీ కోసం కష్టపడ్డాడని ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ సుందర్ చెప్పారు. అంతేకాదు విశాల్ తనకు సొంత తమ్ముడి లాంటి వాడని చెప్పాడు. మొదట్లో విశాల్‌ని అపార్థం చేసుకున్నానని, అతనితో పరిచయం ఏర్పడిన తర్వాత అతను ఎంత మంచి వాడనే విషయం తెలిసిందన్నాడు. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలతో పని చేసినప్పటికీ.. కార్తిక్ తర్వాత విశాల్‌తోనే తను బాగా క్లోజ్ అయ్యానని చెప్పారు.
#Vishal na get well soon.. #MadhaGajaRajapic.twitter.com/I2K3lTRR0Q
— Tamil Cinema Spot (@tamilcinemaspot) January 5, 2025
Comments
Please login to add a commentAdd a comment