Artist accuses Adipurush makers of copying his work for Prabhas look - Sakshi
Sakshi News home page

Adipurush Movie: నా ఆర్ట్‌ను కాపీ కొట్టారు.. కనీస సమాచారం ఇవ్వకుండా!

Published Mon, Apr 10 2023 3:51 PM | Last Updated on Tue, Apr 11 2023 4:24 PM

Artist accuses Adipurush makers of copying his work for Prabhas look - Sakshi

ప్రభాస్, కృతి సనన్ జంటగా నటిస్తోన్న మైథలాజికల్ ఫిల్మ్  'ఆది పురుష్'. ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్‌ ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాను వివాదాలు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. ఆది నుంచే కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారింది ఆదిపురుష్.  మొదట టీజర్‌పై విమర్శలు రాగా.. శ్రీరామనవమి రోజు రిలీజైన పోస్టర్‌పై పెద్దఎత్తున విమర్శలొచ్చిన సంగతి తెలిసిందే.  తాజాగా మరొకరు ఆదిపురుష్‌ పోస్టర్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. 

ప్రభాస్ లుక్‌ను ఆదిపురుష్ మేకర్స్ తన ఆర్ట్‌ నుంచి కాపీ కొట్టారని ఆరోపించాడు ఆర్టిస్ట్ ప్రతీక్ సంఘర్. 'ఆదిపురుష్' చిత్రబృందం రిలీజ్ చేసిన ప్రభాస్‌ లుక్ కోసం తన ఆర్ట్ వర్క్‌ను కాపీ చేశారని ఆరోపిస్తున్నారు. తాజాగా తాను రూపొందించిన రాముని రూపాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.  ఫేస్‌బుక్‌లో తాను రూపొందించిన స్క్రీన్‌షాట్స్ షేర్ చేశారు. 'ఆదిపురుష్' మూవీ ఆర్టిస్ట్ టీపీ విజయన్ తన అనుమతి లేకుండా ఇలా చేస్తారా అని ప్రశ్నించారు ప్రతీక్ సంఘర్.

ఆది నుంచి వివాదాలే

కాగా.. గతేడాది టీజర్ విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రంపై వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్, పాత్రల చిత్రీకరణపై నెటిజన్లు మేకర్స్‌ను తప్పుబట్టారు. ఇటీవల రిలీజైన పోస్టర్‌లో సైతం రామునికి పవిత్రమైన హిందూ సంప్రదాయం ప్రకారం 'జానీవు'(జంజం) లేకుండా చూపించినందుకు మేకర్స్‌పై ఫిర్యాదు కూడా నమోదైంది.కాగా.. 'ఆదిపురుష్' జూన్ 16, 2023న థియేటర్లలో విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement