ఉంగుటూరు (పశ్చిమగోదావరి) : ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లటంతో 10 మందికి గాయాలయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం వాచూరు వద్ద శనివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోకు చెందిన బస్సు 20 మంది ప్రయాణికులతో భీమవరం నుంచి వెళ్తోంది.
కాగా వాచూరు వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కనున్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులోని 10 మంది గాయాలపాలయ్యారు. ఇంట్లో ఉన్న వారు అప్రమత్తమై పక్కకు తప్పుకోవటంతో ఎవరికీ ప్రమాదం జరుగలేదు. క్షతగాత్రులను ఉంగుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇంట్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
Published Sat, Sep 12 2015 5:03 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement