club closed
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
ఎట్టకేలకు పేకాట క్లబ్ మూతపడింది. ఉంగుటూరు మండలం నారాయణపురంలో టీడీపీ నేతలు పేకాట క్లబ్ నెలకొల్పిన వైనాన్ని ’ఆడుకో పేక.. ఆపేవారు లేరిక’ శీర్షికన ’సాక్షి’ శుక్రవారం సంచికలో వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. దీనిపై స్పందించిన పోలీసులు తక్షణమే మూసివేయాలని ఆదేశించారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దుర్గాప్రసాద్ క్లబ్ నిర్వాహకులను తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేయడంతో క్లబ్‌కు తాళాలు శుక్రవారం వేశారు. ఈ నిర్ణయం పేకాటరాయుళ్లకు మింగుడు పడలేదు. అధికార పార్టీ నేతల అండదండలు, వారికి నెలవారీ మామూళ్లు ఇవ్వడానికి సిద్ధపడినా ప్రయోజనం లేకుండా పోవడంపై వారు ఆవేదన చెందుతున్నట్టు సమాచారం. క్లబ్‌ను తెరిపించేందుకు ఉన్నత స్థాయిలో ఒత్తిళ్తు ప్రారంభమైనట్టు సమాచారం. కొత్త క్లబ్‌కు సమీపంలో ఉన్న పాత క్లబ్‌లోనూ ఎటువంటి జూదం నిర్వహించవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేయటంతో అసలుకే మోసం వచ్చిందంటూ నిర్వాహకులు నెత్తీనోరు బాదుకుంటున్నట్టు సమాచారం.