సాక్షి, పశ్చిమ గోదావరి: స్థానిక సంస్థల ఎన్నికల్లో వందకు వంద శాతం స్థానాలు గెలుచుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఉంగుటూరు ఎమ్మెల్యే ఉప్పల వాసుబాబు అన్నారు. అవినీతికి తావు లేకుండా ప్రజలకు పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ వాలంటీర్ల ద్వారా గడప వద్దకే పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. వెయ్యి రూపాయలు దాటిన చికిత్సకు ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఏలూరు పార్లమెంటరీ జిల్లా స్థానిక ఎన్నికల పరిశీలకులు పాతపాటి సర్రాజు మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్ ప్రజాసంకల్పయాత్ర చేసి చరిత్ర సృష్టించారన్నారు. చెప్పిన మాట చేస్తారని ఆయన నిరూపించారని కొనియాడారు. ప్రజలకు హామీ ఇచ్చిన నవరత్నాలతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. ప్రజాబలం కలిగిన ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే అని నొక్కి చెప్పారు. ఈ ఎన్నికల్లో వందకు వంద శాతం తమ పార్టీనే గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment