
సాక్షి, పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహానికి సీఎం హాజరయ్యారు. నూతన వధూవరులను సీఎం వైఎస్ జగన్ ఆశీర్వదించారు. వివాహ వేడుకల్లో మంత్రి శ్రీరంగనాథ రాజు, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ కె శ్రీధర్, ఎమ్మెల్యేలు దూలం నాగేశ్వరరావు, ప్రసాదరాజు, అబ్బయ్య చౌదరి, కలెక్టర్ కార్తికేయ మిశ్రా పాల్గొన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment