
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(శుక్రవారం) కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పర్యటించనున్నారు.
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(శుక్రవారం) కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పర్యటించనున్నారు. వైఎస్సార్ కాపు నేస్తం పథకం మూడో విడత సహాయం బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, 10.30 గంటలకు గొల్లప్రోలు చేరుకోనున్నారు.
10.45-12.15 గంటల వరకు బహిరంగ సభా ప్రాంగణంలో ప్రసంగించి.. వైఎస్సార్ కాపు నేస్తం పథకం సహాయం విడుదల చేస్తారు. మధ్యాహ్నం 12.40 గంటకు అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు. 1.30 గంటలకు తాడేపల్లికి సీఎం చేరుకోనున్నారు.
చదవండి: అక్కా.. సాయం అందిందా?