సాక్షి, ఢిల్లీ : ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలుగుదేశం పార్టీ ఓర్చుకోలేక పోతుందని వైఎస్సార్‌సీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ విమర్శించారు. ఇళ్ల పట్టాల పంపిణీ పై కూడా టీడీపీ కోర్టు కెళ్లి స్టే తీసుకొచ్చిందని, ఇల్లు లేని వారికి తీవ్ర అన్యాయం చేస్తోందంటూ మండిపడ్డారు. అమరావతిలో పెద్ద ఎత్తున భూ కుంభకోణం జరిగిందని సిట్ తేల్చిందని, సుప్రీం కోర్టు జడ్జిల కూతుళ్ళ పైనా అభియోగాలు వచ్చాయని పేర్కొన్నారు. అందుకే అందుకే కోర్టు ద్వారా గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారని తెలిపారు. కావాలనే దేవాలయాలపై ప్రతిపక్ష నాయకులు దాడులు చేస్తున్నారు.. అయితే దొంగతనం చేసి దొంగ దొంగ అని అరుస్తున్నట్లు టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. (విగ్రహాల ప్రతిష్ఠ కేసు: ముగ్గురి అరెస్ట్)
Comments
Please login to add a commentAdd a comment