విజయనగరం వైఎస్సార్సీపీ అధ్యక్షునిగా బెల్లాన
కోలగట్లకు పీఏసీలో స్థానం
సాక్షి, హైదరాబాద్: విజయనగరం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా బెల్లాన చంద్రశేఖర్‌ను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలిచ్చినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. కోలగట్ల వీరభద్రస్వామికి పార్టీ అత్యున్నత నిర్ణాయకమండలి అయిన రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ)లో స్థానం కల్పించినట్లు పేర్కొన్నారు. కోలగట్ల వ్యక్తిగత కారణాలతో జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను జగన్ ఆమోదించారని, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు బెల్లానను ఆ స్థానంలో నియమించారని తెలిపారు.