కేఏ పాల్‌కి పవన్‌ కల్యాణ్‌కి పెద్ద తేడా లేదు: ఎంపీ చంద్రశేఖర్‌ | YSRCP MP Bellana Chandra Sekhar Fires on Pawan Kalyan | Sakshi
Sakshi News home page

కేఏ పాల్‌కి పవన్‌ కల్యాణ్‌కి పెద్ద తేడా లేదు: ఎంపీ చంద్రశేఖర్‌

Published Sun, Nov 13 2022 5:47 PM | Last Updated on Sun, Nov 13 2022 6:09 PM

YSRCP MP Bellana Chandra Sekhar Fires on Pawan Kalyan - Sakshi

సాక్షి, విజయనగరం: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతున్న తీరు యువతను పెడదోవ పట్టించేటట్లు ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ విజయనగరం జిల్లాలో పర్యటించిన పవన్‌ కల్యాణ్‌.. 651 లే ఔట్‌లలో నిర్మించిన 79వేల ఇళ్లను పరిశీలించారు. ఎక్కడా అవినీతి జరిగిందని నిరూపించలేకపోయారు. రాజకీయాల్లో కేఏ పాల్‌కి పవన్‌ కల్యాణ్‌కి పెద్ద తేడా లేదని మండిపడ్డారు. 

ఇవాళ పవన్‌ కల్యాణ్‌ యువతను ఉద్దేశించి నా మీద కేసులు ఉన్నాయి. మీ మీద కేసులు వచ్చినా పోరాడండి అంటూ యువతను రెచ్చగొడుతున్నారు. ఆయనను సినిమా నటుడిగా ప్రజలు గౌరవిస్తారు కానీ, ఓట్లు వేయరు అనే సంగతి గుర్తించాలన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అవినీతికి ఆస్కారం లేకుండా సచివాలయ ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి కల్పించామన్నారు. పైసా అవినీతి లేకుండా టిడ్కో ఇళ్లు ఇస్తున్నామని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. 

చదవండి: (విజయనగరం జిల్లాలో పవన్‌ కల్యాణ్‌ టూర్‌ అట్టర్‌ఫ్లాప్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement