
ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, లోక్‌సభ స్పీకర్ ఓంప్రకాష్‌బిర్లా నుంచి వచ్చిన ప్రశంసల లేఖ
సాక్షి, చీపురుపల్లి: కరోనా వైరస్ విలయతాండవం చేస్తుండగా ప్రజలు భయాందోళనకు గురైన పరిస్థితుల నేపథ్యంలో విజయనగరం పార్లమెంటు సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్ అందించిన సేవలు చాలా గొప్పవని లోక్‌సభ స్పీకర్ ఓంప్రకాష్‌బిర్లా ప్రశంసల జల్లు కురిపించారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓంప్రకాష్‌బిర్లా నుంచి వచ్చిన లేఖను ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తన కార్యాలయంలో శుక్రవారం విడుదల చేశారు. కరోనా వైరస్ మొదటి, రెండవ, మూడవ సమయంలో నిత్యం ఆస్పత్రులను సందర్శించి, ప్రజల్లో మనోధైర్యాన్ని కల్పిస్తూ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ విలువైన సేవలు అందించినట్లు లోక్‌సభ స్పీకర్ తన లేఖలో పేర్కొన్నారు. జిల్లాలో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు ఎంపీ నిధులు రూ.30 లక్షలు వెచ్చించి జిల్లా కేంద్రాస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడంతో ఎంతోమందికి మేలు జరిగిందన్నారు.
ప్రజలకు అండగా నిలవడం మా బాధ్యత
ఇదే విషయమై ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ కరోనా వైరస్ మహమ్మారి ప్రజలపై విరుచుకుపడుతున్న సమయంలో వారికి అండగా నిలవడం తమ బాధ్యత అని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అందుబాటులో ఉన్నామని తెలిపారు.
చదవండి: ఏపీ: డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన రాజేంద్రనాథ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment