kolagatla Virbhadra Swamy
-
3 నెలలకోసారి భారీ స్పందన కార్యక్రమం
సాక్షి, విజయనగరం : నియోజకవర్గంలో ప్రతి మూడు నెలలకోసారి భారీ స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజా ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి. పోలీస్, ఎక్సైజ్ అధికారులతో శనివారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణంలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను నియంత్రించాలని, పేకాట, వ్యభిచారం ఎక్కడ జరిగినా చర్యలు తీసుకోవాలని డీఎస్పీలను ఆదేశించారు. బహిరంగ మద్యపానం ఎక్కువగా ఉందని.. బార్ల ముందు రోడ్లపై తాగడాన్ని నియంత్రించాలని సూచించారు. రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేసే విధంగా కృషి చేస్తామన్నారు. పార్కింగ్ ప్రదేశాలు గుర్తించమని పోలీసు అధికారులకు సూచించారు. అన్ని రంగాల వారికి మేలు చేకూర్చేలా బడ్జెట్ ఉందన్నారు వీరభద్ర స్వామి. ఎన్నికల హామీలను మరిచిపోలేదని చెప్పే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారని ప్రశంసించారు. 40 రోజలు పాలనలో ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం కలిగిందని తెలిపారు. లంచాలు ఇవ్వొద్దని.. నాయకుల పేర్లు చెప్పి అధికారులు పైరవీలు చేస్తే తమ దృష్టికి తీసుకు రావాలని చెప్పారు. గత పాలకులు అలసత్వం వల్ల తాగునీటి ఎద్దడి వచ్చిందన్నారు. ఇక మీదట అలా జరగకుండా చూసుకుంటామని తెలిపారు. తారక రామ సాగర్ ప్రాజెక్ట్ పూర్తయితే తాగు నీటి సమస్య తీరుతుందన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయించాలని ఇరిగేషన్ మంత్రిని కోరామన్నారు. -
‘అవినీతి, కుంభకోణాల్లో బాబు నం.1’
సాక్షి, విజయనగరం : 2014లో ఇచ్చిన హామీలను విస్మరించి.. చంద్రబాబు నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్ర స్వామి ఆరోపించారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీ అభ్యర్థులు తమ గోడు చెప్పుకోడానికి వెళ్తే బాబు వారితో ప్రవర్తించిన తీరు దురదృష్టకరమన్నారు. గ్రూప్ - 1, 2 ఉద్యోగాల్లో ఖాళీలను పూర్తి చెయ్యకుండా నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారంటూ ఆరోపించారు. అవినీతి పాలనలో, కుంభకోణాల్లో చంద్రబాబు నెంబర్ వన్ అంటూ విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు పక్కదారి పట్టించి రాష్ట్రంలో ప్రాజెక్టులను గాలికి వదిలారంటూ వీరభద్ర స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఆశయాలను విస్మరించి.. తెలుగుదేశం పార్టీ సిద్దాంతాను పక్కన పెట్టి చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. ఆదరణ పథకం ద్వారా ఇచ్చిన పనిముట్లు నాసిరకమైనవని ప్రజలు గగ్గోలు పెడుతున్నారని తెలిపారు. ప్రజా సంకల్పయాత్రకు విపరీతమైన ప్రజాదరణ వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీని లేకుండా చేయాలనే కుట్రలో భాగంగా వైసీపీ నాయకులకు ఎర వేస్తున్నారంటూ వీరభద్ర స్వామి ఆరోపించారు. -
విజయనగరం వైఎస్సార్సీపీ అధ్యక్షునిగా బెల్లాన
-
విజయనగరం వైఎస్సార్సీపీ అధ్యక్షునిగా బెల్లాన
కోలగట్లకు పీఏసీలో స్థానం సాక్షి, హైదరాబాద్: విజయనగరం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా బెల్లాన చంద్రశేఖర్‌ను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలిచ్చినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. కోలగట్ల వీరభద్రస్వామికి పార్టీ అత్యున్నత నిర్ణాయకమండలి అయిన రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ)లో స్థానం కల్పించినట్లు పేర్కొన్నారు. కోలగట్ల వ్యక్తిగత కారణాలతో జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను జగన్ ఆమోదించారని, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు బెల్లానను ఆ స్థానంలో నియమించారని తెలిపారు.