సాక్షి, విజయనగరం : 2014లో ఇచ్చిన హామీలను విస్మరించి.. చంద్రబాబు నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్ర స్వామి ఆరోపించారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీ అభ్యర్థులు తమ గోడు చెప్పుకోడానికి వెళ్తే బాబు వారితో ప్రవర్తించిన తీరు దురదృష్టకరమన్నారు. గ్రూప్ - 1, 2 ఉద్యోగాల్లో ఖాళీలను పూర్తి చెయ్యకుండా నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారంటూ ఆరోపించారు. అవినీతి పాలనలో, కుంభకోణాల్లో చంద్రబాబు నెంబర్ వన్ అంటూ విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు పక్కదారి పట్టించి రాష్ట్రంలో ప్రాజెక్టులను గాలికి వదిలారంటూ వీరభద్ర స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ ఆశయాలను విస్మరించి.. తెలుగుదేశం పార్టీ సిద్దాంతాను పక్కన పెట్టి చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. ఆదరణ పథకం ద్వారా ఇచ్చిన పనిముట్లు నాసిరకమైనవని ప్రజలు గగ్గోలు పెడుతున్నారని తెలిపారు. ప్రజా సంకల్పయాత్రకు విపరీతమైన ప్రజాదరణ వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీని లేకుండా చేయాలనే కుట్రలో భాగంగా వైసీపీ నాయకులకు ఎర వేస్తున్నారంటూ వీరభద్ర స్వామి ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment