వైఎస్‌ఆర్ సీపీ విజయనగరం పార్లమెంట్ పరిశీలకునిగా బెల్లాన | YSRCP Vizianagaram Parliament observer | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్ సీపీ విజయనగరం పార్లమెంట్ పరిశీలకునిగా బెల్లాన

Published Thu, Aug 28 2014 1:18 AM | Last Updated on Tue, May 29 2018 4:15 PM

వైఎస్‌ఆర్ సీపీ విజయనగరం పార్లమెంట్ పరిశీలకునిగా బెల్లాన - Sakshi

వైఎస్‌ఆర్ సీపీ విజయనగరం పార్లమెంట్ పరిశీలకునిగా బెల్లాన

 సాక్షి ప్రతినిధి, విజయనగరం : పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. నాయకులందరికీ వివిధ స్థాయిల్లో ప్రాధాన్యం కల్పిస్తూ బాధ్యతల్ని అప్పగిస్తున్నారు. ఇప్పటికే పార్టీ జిల్లా  అధ్యక్షునిగా కోలగట్ల వీరభద్రస్వామిని నియమించిన  అధిష్టానం, తాజాగా మరికొన్ని నియామకాలను ప్రకటించింది. విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ  పరిశీలకునిగా జెడ్పీ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్, శ్రీకాకుళం పార్లమెంట్ పార్టీ పరిశీలకునిగా బేబీనాయన నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర పార్టీ కార్యాలయ వర్గాలు బుధవారం రాత్రి ప్రకటన విడుదల చేశాయి.  వీరితో పాటు ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతల్ని రాష్ర్ట పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావుకు అప్పగించారు. వీరి నియామకం పట్ల పార్టీ వర్గాలు హర్షం ప్రకటించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement