
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం దేవస్థానం, మాన్సస్ ట్రస్ట్ భూముల్లో అక్రమాపై విచారణ పూర్తయినట్లు విచారణ కమిటీ బుధవారం తెలిపింది. రేపు(గురువారం) దేవాదాయశాఖ కమిషనర్‌కు నివేదిక ఇవ్వనున్న పేర్కొంది. సింహాచలం ఆలయ భూముల జాబితా నుంచి తొలగించిన భూముల జాబితాను నివేదికలో చేర్చినట్లు తెలిపింది.
మాన్సాన్స్ ట్రస్ట్‌లో 150 ఎకరాల భూములు అమ్మకాలు, లీజుల వ్యవహారంపై అవకతవకలను నివేదికలో చేర్చినట్లు పేర్కొంది. మాన్సస్, సింహాచలం ఈవోలు, ముందు పని చేసిన అధికారులు నిర్లక్ష్యంపై పలు విషయాలను నివేదికలో చేర్చినట్లు విచారణ కమిటీ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment