simhachalam temple
-
సింహాచలం ఆలయంలో భక్తుల రద్దీ
-
దర్శనానికి వచ్చి ఉంగరం దొంగిలిస్తారా..?
సింహాచలం: ‘శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దర్శనానికి వచ్చి ఆయన ఉంగరాన్నే దొంగిలిస్తారా? మర్యాదగా దొంగిలించిన ఉంగరాన్ని ఇచ్చేయండి.. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం..’అని సింహాచలం కొండకి వచ్చిన పలువురు భక్తులను దేవస్థానం స్థానాచార్యులు ప్రశ్నించే సరికి వారంతా కంగుతిన్నారు. ‘మేం దొంగల్లా కనిపిస్తున్నామా.! స్వామి దర్శనానికి వస్తే ఉంగరాన్ని దొంగతనం చేశారంటారేంటి? పైగా తాళ్లతో బంధించి తీసుకొస్తారా..’అంటూ భక్తులు ఆవేశంతో స్థానాచార్యులపై గర్జించారు. ‘చూడండీ.. మీరు దొంగతనం చేసినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి. పోలీసులు తీసుకెళ్లకముందే దొంగిలించిన ఉంగరాన్ని మర్యాదగా ఇచ్చేయండి.’ అంటూ స్థానాచార్యులు మరింత గర్జించి అడగటంతో భక్తుల కళ్లంట నీళ్లు గిర్రున తిరిగాయి.తాము ఉంగరం తీయలేదని ఎంత చెబుతున్నా వినకుండా మీరే దొంగ అంటూ పదే పదే ప్రశ్నించడంతో వారంతా ఆగ్రహంతో చిందులు వేశారు. పైగా చేతికున్న ఉంగరాలను చూపెట్టమని.. దొంగిలించిన ఉంగరంలా ఇవి ఉన్నాయంటూ స్థానాచార్యులు అడగటంతో భక్తుల నోటి మాట రాలేదు. చివరికి ఇదంతా వినోదోత్సవంలోని ఘట్టమని తెలుసుకుని భక్తులంతా సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. తమకు మాత్రమే దక్కిన భాగ్యంగా భావించి ఆనందభరితులయ్యారు. ఇదీ సింహగిరిపై బుధవారం నవ్వుల సందడిగా జరిగిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి వినోదోత్సవం. స్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మృగయోత్సవంలో పోయిన ఉంగరం వెతికే ఘట్టాన్ని బుధవారం ఉదయం వినోదోత్సవంగా నిర్వహించారు.ఏడు పరదాల్లో దాగి ఉన్న స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని రాజగోపురం వద్ద పల్లకీలో అధిష్టింపజేశారు. స్వామి దూతగా పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు కర్ర, తాడు పట్టుకుని దర్శనానికి వచ్చిన పలువురు భక్తులను ఉంగరం దొంగిలించారంటూ తాళ్లతో బంధించి రాజగోపురం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ దొంగిలించిన ఉంగరాన్ని ఇవ్వాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.ఉత్సవం గురించి తెలియని వాళ్లు కన్నీటిపర్యవంతం చెందారు. ఉత్స వం గురించి తెలిసిన వాళ్లు నవ్వుతూ సమాధానం చెప్పారు. ఈ తరుణంలోనే స్వామిపై ఉన్న ఒక్కొక్క పరదాను తొలగించారు. చివరికి స్వామి చివరి పరదాలోనే ఉంగరం దొరికింది. ఎస్.కోట మండలం బొద్దాంకి చెందిన నూతన దంపతులు ఈశ్వరరావు, మాధవి, ఆరిలోవ ప్రాంతానికి చెందిన మౌళీ, గౌతమి, ఆంధ్రా యూనివర్సిటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యారి్థనులు హిమజ, ప్రత్యూష, లావణ్య, శ్వేత అశ్విని, టెక్కలికి చెందిన అక్కాతమ్ముళ్లు జీవిత, నవీన్‌కుమార్‌లను పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు తాళ్లతో బంధించి తీసుకురాగా వారిని స్థానాచార్యులు ప్రశ్నించారు. విజయనగరం జిల్లా దాసన్నపేటకి చెందిన రోజా అనే మహిళ తన కుమార్తె మిక్కి, అల్లుడు కిశోర్, మనవలతో కలిసి సింహగిరికి రాగా వారిని తాళ్లతో బంధించారు.వాళ్ల చేతికి ఉన్న ఉంగరం.. దొంగిలించిన ఉంగరంగానే ఉందని స్థానాచార్యులు, అర్చకులు అనుమా నం వ్యక్తం చేయడంతో వారంతా వాదనకు దిగారు. నా కూతురుకు, అల్లుడికి నిశి్చతార్థం రోజు పెట్టిన ఉంగరాలు ఇవని, దొంగిలించినవి కాదని స్థానాచార్యులతో రోజా వాదించారు. ఇదిలా ఉండగా దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఇరగవరపు రమణాచార్యులు, ఆలయ కొత్వాల్ నాయక్ లంక సూరిబాబు, ఆలయ ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లు, సూపరింటెండెంట్ వెంకటరమణ, ట్రస్ట్‌బోర్డు మాజీ సభ్యుడు గంట్ల శ్రీనుబాబు సైతం దొంగలుగా పట్టుపట్టారు. తొలుత స్థానాచార్యులను కూడా తాళ్లతోనే బంధించి తీసుకురావడం విశేషం. అదే సమయంలో సింహగిరి వచ్చిన భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు వినోదోత్సవంలో పాల్గొని.. స్వామిని దర్శించుకున్నారు. -
సింహాచలం సింహగిరిపై ఘనంగా రథ సప్తమి వేడుకలు
-
శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో గజేంద్ర మోక్షం
-
అడవివరంలో 20 ఎకరాలపై కన్నేసిన కబ్జాదారులు
సాక్షి, విశాఖపట్నం : అది సింహాచలం దేవస్థానానికి చెందిన అటవీ ప్రాంతం.. తాము అక్కడ నివాసముంటున్నామని పలువురు.. ప్రభుత్వ సర్వేయర్లు ఇచ్చిన రిపోర్టుతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అఫిడవిట్ చూసిన జాయింట్ కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. అక్కడ నివాసం కాదు.. పూర్తి చెట్లతో నిండిన అడవి ఉందని గుర్తించారు. రూ.కోట్ల భూమిని కొట్టేసేందుకు వేసిన ఎత్తుగడకు సహకరించిన ప్రభుత్వాధికారులపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. అడవివరం గ్రామంలో సర్వే నెంబర్ 275లో 20.39 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమికి సంబంధించి హద్దులు నిర్ణయించడంతో పాటు అక్కడ ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న నేపథ్యంలో రెవెన్యూ రికార్డులో తమ పేరుతో మార్చేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని బి.మంగతల్లితో పాటు మరో ఆరుగురు హైకోర్టులో రిట్‌పిటిషన్ వేశారు. పిటిషనర్ దరఖాస్తుపై నెల రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు విశాఖ రూరల్ తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సర్వే విభాగం అధికారులు సదరు భూమికి సర్వే నిర్వహించారు. 1903 సేల్ ప్రకారం అడవివరం గ్రామంలో సర్వే నెంబర్ 275లో ఉన్న 20.39 ఎకరాల భూమి మంగతల్లి కుటుంబ సభ్యుల ఆధీనంలోనే ఉందని, వారు పొజిషన్లు ఉన్నారని నిర్ధారిస్తూ నివేదిక సమర్పించారు. సర్వే అధికారుల నివేదిక ఆధారంగా ఆ భూమి తమదేనని, సింహాచలం దేవస్థానం అధికారులు ఈ భూమి విషయంలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని మరోసారి మంగతల్లి మరో ఆరుగురు హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు స్టాటస్ కో ఇచ్చింది. సర్వే నివేదిక తప్పంటూ దేవస్థానం పిటిషన్ సర్వే విభాగం ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ సింహాచలం దేవస్థానం అధికారులు 2021, అక్టోబర్ 20న రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. సదరు నివేదిక సక్రమంగా లేదని, సర్వే నెంబర్ 275లో మొత్తం 5,279.57 ఎకరాల భూమి దేవస్థానం పరిధిలోనే ఉందని, ఈ సర్వే నంబర్‌కు సంబంధించి ఎలాంటి సబ్ డివిజన్లు లేవని పిటిషన్లో స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ విస్తీర్ణం మొత్తం 22ఏ జాబితాలో చేర్చడం జరిగిందని, ఆ భూమిలో దేవస్థానం కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా ఉందని న్యాయస్థానానికి విన్నవించారు. ఈ పిటిషన్‌పై స్పందించిన జాయింట్ కలెక్టర్ కేఎస్ విశ్వనాథన్.. జాయింట్ సర్వే బృందానికి, సర్వే, భూరికార్డుల శాఖ అధికారులకు నోటీసులు జారీ చేశారు. అప్పుడే సర్వే బృందం అవకతవకలు బయటపడ్డాయి. స్వయంగా పరిశీలించిన జేసీ 2021లో సర్వే చేసిన విశాఖ రూరల్ మండలం అప్పటి సర్వేయర్, ప్రస్తుత గోపాలపట్నం సర్వేయర్ డి.జగదీశ్వరరావు, సింహాచలం దేవస్థానం అప్పటి సర్వేయర్ కె.హరీష్‌కుమార్, అప్పటి గోపాలపట్నం సర్వేయర్, ప్రస్తుతం యలమంచిలి సర్వేయర్ సత్యనారాయణ, డీఐవోఎస్ కె.వేణుగోపాల్‌ను అధికారులు విచారించి వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. అదేవిధంగా ఈ ఏడాది మే 15న భీమిలి ఆర్డీఓ భాస్కర్‌రెడ్డి, సింహాచలం దేవస్థానం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ, ఇతర అధికారులతో కలిసి జేసీ కేఎస్ విశ్వనాథన్ స్వయంగా ఆ భూమిని పరిశీలించి విస్తుపోయారు. పిటిషన్ వేసిన వారి భూ పత్రాల్లో సదరు భూమి గోపాలపట్నం మండలం మాధవధారలో ఉంది. కానీ వారు చూపిస్తున్న భూమి, వారి డాక్యుమెంట్లో ఉన్న భూమికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైంది. దీని ప్రకారం సర్వే నెంబర్ 275లో ఉన్న భూమి సింహాచలం దేవస్థానం ఆధీనంలో ఉందని గుర్తించారు. ఆ భూమిలోనే పొజిషన్లో ఉన్నట్లు సర్వేయర్లు ఇచ్చిన నివేదిక తప్పు అని బట్టబయలైంది. ఈ కేసులో ప్రమేయం ఉన్న సర్వే ఏడీ విజయ్‌కుమార్, డీఐవోఎస్ వేణుగోపాల్, ముగ్గురు సర్వేయర్లపై క్రమశిక్షణ చర్యలకు జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆ భూమిని సింహాచలం దేవస్థానానికి అప్పగించినట్లు ఆయన తెలిపారు. -
సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి గిరి ప్రదక్షిణ ప్రారంభం
-
బంగారు కాంతులతో మెరిసిపోతున్న సింహాచల ఆలయ ధ్వజస్తంభం
-
స్వామివారిని దర్శించుకున్న స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి
-
Kanaka Durga Temple: నేడు గాయత్రీదేవి అలంకారం
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా కేంద్రం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో మూడోరోజు బుధవారం కనకదుర్గమ్మ.. గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సకల మంత్రాలకు మూలశక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొంది.. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశించే పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుపై బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖలో రుద్రుడు ఉండటంతో గాయత్రీదేవి త్రిమూర్త్యాంశగా వెలుగొందుతోంది. గాయత్రీదేవిని దర్శించుకుంటే ఆరోగ్యం, తేజస్సు, జ్ఞానం కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇంద్రకీలాద్రిపై నేడు ►తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారి దర్శనం ►ఉదయం 5 గంటలకు ఖడ్గమాలార్చన ►ఉదయం 7 గంటలకు ప్రత్యేక కుంకుమార్చన ►ఉదయం 9 గంటలకు ప్రత్యేక శ్రీచక్రనవార్చన ►ఉదయం 9 గంటలకు ప్రత్యేక చండీయాగం ►ఉదయం 10 గంటలకు ప్రత్యేక కుంకుమార్చన రెండో బ్యాచ్ ►సాయంత్రం 6.30 గంటలకు అమ్మవారికి మహానివేదన, పంచహారతుల సేవ ►రాత్రి 11 గంటలకు అమ్మవారి దర్శనం నిలిపివేత మయూర వాహనంపై కొలువుదీరిన భ్రామరీ సమేత మల్లికార్జునుడు బ్రహ్మచారిణిగా భ్రమరాంబాదేవి శ్రీశైలం టెంపుల్: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీశైల క్షేత్రంలో మంగళవారం భ్రమరాంబాదేవి.. బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. రాత్రి భ్రమరాంబాదేవి, మల్లికార్జునస్వామి మయూర వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. తొలుత ఉత్సవమూర్తులను ఆలయ ప్రదక్షిణ చేయించి ప్రధానాలయ రాజగోపురం నుంచి రథశాల వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 8 గంటల తర్వాత ప్రారంభమైన గ్రామోత్సవం నందిమండపం, అంకాలమ్మగుడి, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు వెళ్లి తిరిగి ఆలయ ప్రవేశం చేసింది. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామిఅమ్మవార్ల అలంకారమూర్తులను దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, సభ్యులు, ఈవో ఎస్.లవన్న, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. పూజలు చేస్తున్న స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి మహేశ్వరిగా రాజశ్యామల అమ్మవారు సింహాచలం: విశాఖ శ్రీశారదాపీఠంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండోరోజు మంగళవారం శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు మహేశ్వరిగా దర్శనమిచ్చారు. అమ్మవారికి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి విశేషంగా పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అంతకుముందు అమ్మవారి మూలవిరాట్‌కి స్వరూపానందేంద్ర సరస్వతి అభిషేకం చేశారు. దాదాపు 40 నిమిషాలు జరిగిన అభిషేకసేవలో భక్తులు అమ్మవారి నిజరూప దర్శనం చేసుకున్నారు. పీఠం ప్రాంగణంలో చండీహోమం, చతుర్వేదపారాయణ, దేవీ భాగవత పారాయణ నిర్వహించారు. శ్రీచక్రానికి నవావరణార్చన చేశారు. ఈ సందర్భంగా శంకర విజయం అనే అంశంపై ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ధూళిపాళ కృష్ణమూర్తి చేసిన ప్రవచనం భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. సాయంత్రం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర చేతులమీదగా రాజశ్యామల అమ్మవారికి, చంద్రమౌళీశ్వరస్వామికి పీఠార్చన చేశారు. -
అప్పన్న భక్తులకు ‘సర్కారు వారి పాట’ దర్శకుడు క్షమాపణ
సాక్షి, సింహాచలం(పెందుర్తి): ఇటీవల విడుదలైన సర్కారు వారి పాట సినిమాలో సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఉద్దేశించి విలన్‌తో పలికించిన ఒక డైలాగ్ భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంటే క్షమించాలని ఆ సినిమా దర్శకుడు పరశురామ్ తెలిపారు. సర్కారు వారి పాట సినిమా విజయవంతం కావడంతో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శుక్రవారం ఆయన దర్శించుకున్నారు. (చదవండి: అభిమానిని తలుచుకొని ఎమోషనల్ అయిన సూపర్‌స్టార్ కృష్ణ) ఈ సందర్భంగా సినిమాలోని ఒక డైలాగ్ విమర్శలకు తావివ్వడంపై మీడియా ప్రతినిధులు, కొందరు భక్తులు పరశురామ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన మాట్లాడుతూ అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, ఆ విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతిని ఉంటే మనస్పూర్తిగా క్షమాపణలు అడుగుతున్నానని తెలిపారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి అంటే తనకు ఎంతో భక్తి అని, వీలైనప్పుడల్లా స్వామిని దర్శించుకుంటానని అన్నారు. సర్కారు వారి పాట సినిమా ప్రారంభ సమయంలోనూ స్వామిని దర్శించుకున్నానన్నారు. సినిమాకు విజయం చేకూర్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతున్నానని తెలిపారు. నాగచైతన్యతో త్వరలో సినిమా తీస్తున్నట్టు చెప్పారు. దర్శనార్థం వచ్చిన పరశురామ్ ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆయన పేరిట అర్చకులు స్వామికి పూజలు చేశారు. వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం టెంపుల్ ఇన్స్పెక్టర్ కనకరాజు స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_721246091.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వినోదోత్సవం
-
ఉంగరం దొంగలు మీరేనా?
సింహాద్రి నాథుడి ఉంగరం పోయింది. దానికోసం అన్వేషించే క్రమంలో భక్తులను బంధించి విచారించే కార్యక్రమం జరిగింది. అలా అర్చకులకు చిక్కిన విద్యార్థినులు ఉంగరం చోరీలో తమ ప్రమేయం లేదని మొరపెట్టుకున్నారు. చివరికి ఇదంతా వినోదోత్సవంలోని ఘట్టమని తెలుసుకుని ఆనందభరితులయ్యారు. తమకు మాత్రమే లభించిన ఈ అరుదైన అవకాశం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సింహాచలం : నిన్న రాత్రి స్వామివారి ఉంగరం పోయింది. మీరే దొంగిలించారని తెలిసింది. దయచేసి దొంగిలించిన ఉంగరాన్ని ఇచ్చేయండి. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం... అని స్థానాచార్యులు అడిగేసరికి భక్తులు ఆశ్చర్యపోయారు. స్వామి దర్శనానికి వస్తే ఉంగరం దొంగతనం చేశారంటారేంటి? తాళ్లతో బంధించి తీసుకురావడమేంటి? మేము దొంగల్లా కనిపిస్తున్నామా అంటూ స్థానాచార్యులను భక్తులు ఆవేశంతో ఎదురు ప్రశ్నించారు. చూడండీ.. మీరు దొంగతనం చేసినట్టు మా దగ్గర ఆధారాలున్నాయి. సీసీ కెమెరాల్లో కూడా రికార్డయ్యాయి. పోలీసులు తీసుకెళ్లకముందే ఉంగరాన్ని ఇచ్చేయండంటూ స్థానాచార్యులు ప్రశ్నించే సరికి భక్తుల కళ్లంట నీళ్లు తిరిగాయి. దొంగతనం చేయలేదని చెబుతున్నా వినకుండా, అందరిమధ్యలో మీరే ఉంగరం దొంగతనం చేశారని స్థానాచార్యులు పదేపదే ప్రశ్నించడంతో కన్నీటిపర్యవంతయ్యారు. తమవైపు చూసి నవ్వుతున్న వాళ్లపై ఆవేశంతో చిందులు కూడా వేశారు. చివరికి ఇదంతా వినోదోత్సవంలోని ఘట్టాలని తెలుసుకుని ఆనందభరితులయ్యారు. తమకు మాత్రమే లభించిన ఈ అరుదైన అవకాశంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇదీ... సింహగిరిపై ఆదివారం నవ్వుల సందడిగా జరిగిన శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వినోదోత్సవం. ఈనెల 11 నుంచి వారం రోజుల పాటు జరిగిన స్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి జరిగిన మృగయోత్సవంలో దొంగిలించబడ్డ స్వామి ఉంగరాన్ని వెతికే ఘట్టాన్ని సింహగిరిపై ఆదివారం ఉదయం వినోదోత్సవంగా నిర్వహించారు. ఏడు పరదాల్లో దాగున్న స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని రాజగోపురం వద్ద పల్లకీలో కూర్చోబెట్టారు. స్వామి దూతగా పురోహిత్ అలంకారి సీతారామాచార్యులు కర్రను చేతితో పట్టుకుని దర్శనానికి వచ్చిన భక్తులను ఉంగరం దొంగిలించారంటూ తాళ్లతో బంధించి తీసుకొచ్చారు. స్థానాచార్యులు టీపీ రాజగోపాల్ దొంగిలించిన ఉంగరాన్ని ఇవ్వాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. స్వామిపై ఉన్న ఒక్కొక్క పరదాని తొలగించారు. చివరికి ఆయన చివరి పరదాలోనే ఉంగరం దొరికింది. నగరంలోని మాధవదార ప్రాంతానికి చెందిన శ్రావ్య, జాహ్నవి, శృతి అనే విద్యార్థులు తాము దొంగలం కాదంటూ వ్యక్తం చేసిన ఆందోళన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే స్వామివారి దర్శనానికి గాజువాకకు చెందిన ఎయిర్‌టెల్‌లో పనిచేస్తున్న కల్యాణి, మంజు, మణి, త్రినాథ్, విశాఖకు చెందిన న్యాయవాది పద్మజ, నగరంలోని ఐటీఐ ప్రాంతానికి చెందిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉద్యోగి రమేష్ దంపతులు, తెలంగాణ రాష్ట్రం వేములవాడకు చెందిన సాయికిరణ్ దంపతులు, అనకాపల్లికి చెందిన వంశీధర్, పార్థసారథి సైతం దొంగలుగా చిక్కారు. అలాగే దేవస్థానం ఈవో ఎంవీ సూర్యకళ, ఆలయ కొత్వాల్ నాయక్, దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు గంట్ల శ్రీనుబాబు, వారణాసి దినేష్‌రాజ్, బయ్యవరపు రాధ, ఏఈవో తిరుమలేశ్వరరావు, ఇన్చార్జి ప్రధానార్చకుడు కేకే ప్రసాదాచార్యులు, ఉప ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఆలయ సూపరింటిండెంట్ నిద్దాం నాయుడు, టెంపుల్ ఇన్స్పెక్టర్ కనకరాజు సైతం దొంగలుగా బందీలయ్యారు. చివరికి దొంగలంటూ భక్తులను ప్రశ్నించిన స్థానాచార్యులను, కర్రపట్టుకుని తాళ్లతో భక్తులను బంధించిన పురోహిత్ అలంకారి సైతం కూడా దొంగలుగా చిత్రీకరింపబడ్డారు. మంత్రి గారూ ఉంగరం ఇచ్చేయండి రాష్ట్రానికి మంత్రిగా ఉండి మీరు కూడా ఉంగరం దొంగతం చేస్తే ఎలాగండీ.. దయచేసి ఉంగరం ఇచ్చేయండంటూ రాష్ట్ర బీసీ వెల్ఫేర్, సమాచారశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణను స్థానాచార్యులు కోకారు. సింహగిరిపై వినోదోత్సవం జరుగుతున్నప్పుడే ఆలయానికి మంత్రి చెల్లుబోయిన దర్శనానికి వచ్చారు. ఆయన రాజగోపురం వద్దకు రాగానే పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు తాళ్లతో బంధించి స్థానాచార్యుల ముందు హాజరుపరిచారు. దొంగలించిన ఉంగరం ఇచ్చేయాలంటూ స్థానాచార్యులు మంత్రిని అడిగారు. ఏ ఆపదా రాకూడదని ఆస్వామి రక్ష (తాడు) వేశాడని, స్వామి అనుగ్రహం నాపై ఉందని భావిస్తున్నట్టు మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. వినోత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉత్సవం అనంతరం మంత్రి స్వామివారి పల్లకీని మోశారు. -
‘స్వామి వారిని దర్శించుకోవడం అనుభూతి కలిగించింది’
విశాఖ: ప్రత్యేక విమానంలో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ విశాఖ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. సోమవారం ఉదయం విజయవాడ నుంచి విశాఖ పర్యటనకు వెళ్లారు. దీనిలో భాగంగా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న బిశ్వభూషణ్‌కు ఘనస్వాగతం లభించింది.ఎయిర్పోర్ట్ నుంచి కాన్వాయ్‌లో నేరుగా సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయానికి గవర్నర్ దంపతులు చేరుకున్నారు. ఈ మేరకు మాట్లాడిన ఆయన..సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. సింహాద్రి అప్పన్నను దర్శించుకోవడం చాలా అనుభూతి కలిగించిందని పేర్కొన్నారు. పంచగ్రామాల భూ సమస్యపై చర్చించి , తన వంతు కృషి చేస్తానని గవర్నర్ తెలిపారు. అంతకుముందు సింహగిరికి చేరుకున్న గవర్నర్ దంపతులకు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి అంతరాలయంలో ఉన్న కప్ప స్తంభం ఆలింగనం చేసుకొని , అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
12,149 ఇళ్లకు మరమ్మతులు చేసుకోవచ్చు: విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి: నాలుగు అంశాలు ప్రధానంగా చర్చించామని, కోర్టు కేసును త్వరగా డిస్పోజ్ చేసేలా కోర్టును కోరనున్నామని వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి తెలిపారు. సింహాచలం దేవస్థానం పరిధిలోని పంచ గ్రామ సమస్యపై హైపవర్ కమిటీ భేటీ గురువారం జరిగింది. ఈ భేటీలో మంత్రి వెల్లంపల్లి, ఎంపీ విజయసాయిరెడ్డి, దేవాదాయశాఖ అధికారులు పాలొన్నారు. భేటీ అనంతరం ఎంపీ విజయసాయరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 12,149 మంది నివాసం ఉంటున్నారని, వారందరికి రెగ్యులర్ చేయాలనేది ఇక్కడివారి ప్రధాన సమస్య అని తెలిపారు. కొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయని, వాటి మరమ్మతులు చెసుకోవచ్చని, ఇంకో ఫ్లోర్‌కి అనుమతి ఇవ్వనున్నామని పేర్కొన్నారు. ఈ అంశాలు ప్రభుత్వం అనుమతి తీసుకుని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పూరిపాకలో నివసించే వారికి పక్క ఇల్లు కట్టుకునే అవకాశం ఉందని, ఆక్రమణలు జరుగుతున్నాయని.. అందుకే రూ. 20 కోట్లతో కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఈ నిధులు భక్తులు, దాతల నుంచి సేకరిస్తామని, గిరి ప్రదిక్షణం చేసుకునేలా ఈ వాల్ నిర్మాణం చేస్తామని పేర్కొన్నారు. కోర్టు సలహా తీసుకుని ఈ సూచనలన్నీ చేపడతామని అన్నారు. సింహాచల దేవాలయ భూములను కాపాడాలన్నదే తమ ధ్యేయమని, అక్కడ ఉంటున్నవారికి న్యాయం చేస్తామని తెలిపారు. అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పంచ గ్రామాల సమస్యపై భేటీ అయ్యామని, నిర్వాసితులకు న్యాయం జరిగే దిశగా చర్చలు జరిపామని తెలిపారు. దేవాలయ స్థలాలను ఎలా కాపాడాలనే అంశంపై కూడా చర్చించామని పేర్కొన్నారు. -
‘మాన్సాస్’ నుంచి నన్ను తప్పించండి
విజయనగరం: మాన్సాస్ ట్రస్ట్‌పై సర్వాధికారాల కోసం కేంద్ర మాజీమంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు ఆరాటపడుతున్నారా? ఈ విషయంలో అధికారులపై తీవ్రస్థాయిలో వేధింపులకు గురిచేస్తున్నారా?.. ప్రస్తుత పరిస్థితులు పరిశీలిస్తే వీటన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ నిబద్ధతతో పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్ హోదా కలిగిన మాన్సాస్ ట్రస్ట్ ఈవో డి. వెంకటేశ్వరరావుకు కనీస సహకారం అందించకపోగా.. తాము చెప్పినట్లే నడుచుకోవాలంటూ ట్రస్ట్ చైర్మన్ వర్గాల నుంచి ఒత్తిడి తీవ్రమవుతోంది. ఇది తట్టుకోలేని ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధపడ్డారు. ఈ మేరకు గత నెల 31న రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాశారు. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాన్సాస్ ట్రస్ట్ ఈవోగా విధులు నిర్వహిస్తున్న తనను వ్యక్తిగత సమస్యల కారణంగా తిరిగి రెవెన్యూ విభాగానికి పంపించాలంటూ లేఖలో కోరారు. అప్పటి నుంచి ఈవో టార్గెట్? గత తొమ్మిది నెలలుగా ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయనను ట్రస్ట్ చైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు తిరిగి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు.. ట్రస్ట్ సిబ్బంది జీతాల చెల్లింపులో జాప్యానికి ఈవోయే కారణమంటూ అశోక్‌గజపతిరాజు వర్గీయులు ఉద్యోగులందరినీ రెచ్చగొట్టారు. ఆయనపై భౌతికదాడి చేయించేందుకు సైతం సిద్ధమైనట్లు కూడా ఆరోపణలున్నాయి. కొనసాగుతున్న విజిలెన్స్ విచారణ అధికారులు అడిగిన రికార్డులు అందిస్తాం ∙సింహాచలం దేవస్థానం ఈవో సూర్యకళ సింహాచలం (పెందుర్తి): శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన ఆస్తుల జాబితా నుంచి టీడీపీ ప్రభుత్వ హయాంలో 862.22 ఎకరాలు తప్పించడంపై విజిలెన్స్– ఎన్ఫోర్స్మెంట్ విచారణ కొనసాగుతోందని ఆలయ ఈవో సూర్యకళ తెలిపారు. వారు అడిగిన రికార్డులను దేవస్థానం తరఫున అందజేస్తామని చెప్పారు. సింహాచలం దేవస్థానం కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రికార్డుల నుంచి భూములు ఎలా తొలగింపునకు గురయ్యాయని అధికారులు అడిగారన్నారు. అలాగే ఆ భూములు ఏ పట్టా ప్రకారం దేవస్థానానికి దఖలు పడ్డాయన్న విషయంపై లిఖితపూర్వకంగా వివరాలు ఇవ్వాలని అధికారులు కోరారని తెలిపారు. అప్పటి ఈవో హయాంలో జరిగిన ఫిక్స్డ్ డిపాజిట్లు, కోర్టు కేసులు, తదితర వివరాలను కూడా విజిలెన్స్ అధికారులు అడిగారని చెప్పారు. ఇప్పటికే భూములకు సంబంధించిన రిపోర్టు సిద్ధంగా ఉందన్నారు. ఎఫ్డీలు, కోర్టు కేసుల నివేదికను తయారు చేస్తున్నామని తెలిపారు. రెండు రోజుల్లో మొత్తం రిపోర్టు అందజేస్తామన్నారు. -
సింహాచలం: కేంద్ర పర్యాటక అభివృద్ధి సంస్థ బృందం పర్యటన
సాక్షి, విశాఖపట్నం: సింహాచలంలో కేంద్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రతినిధులు శుక్రవారం పర్యటించారు. కేంద్ర ప్రతినిధులతో ప్రసాదం పథకంపై పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ చర్చించారు. ఆలయంలో యజ్ఞశాల నిర్మాణం తలపెట్టామని అవంతి శ్రీనివాస్ తెలిపారు. దర్శనం కోసం వచ్చిన భక్తుల కోసం వెయిటింగ్ హాల్ నిర్మాణం చేయాలని నిర్ణయించామన్నారు. గిరి ప్రదక్షిణ కోసం ఒక మట్టి రోడ్‌తో ట్రాక్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామన్నారు. పర్యాటక శాఖ సహాయ కార్యదర్శి ఎస్ ఎస్ వర్మ మాట్లాడుతూ, ఈ పథకం పర్యాటక శాఖ పర్యవేక్షిస్తోందన్నారు. పరిశీలన పూర్తయ్యాక డీపీఆర్ పనులు పూర్తి చేస్తామని ఎస్.ఎస్.వర్మ తెలిపారు. -
‘సింహాద్రి అప్పన్న’కు యునెస్కో గుర్తింపునకు యత్నాలు
సింహాచలం(పెందుర్తి): సింహగిరి వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలోని శిల్పాలు, శాసనాలకు యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సింహాచలం దేవస్థానం ఈవో ఎం.వి.సూర్యకళ తెలిపారు. వీటిని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు సాంకేతిక సహకారం అందించాలని ఆంధ్రా యూనివర్సిటీ వీసీ పి.వి.జి.డి.ప్రసాదరెడ్డిని బుధవారం కలిసి కోరారు. రామప్ప ఆలయానికి మించిన చారిత్రక శిల్పకళా సౌందర్యం సింహాచలం ఆలయానికి ఉందని ఈవో వెల్లడించారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు, పురాతన పుస్తకాలు, ఫొటోలను వీసీకి చూపించారు. 11వ శతాబ్దం నుంచి తరతరాల సంస్కృతికి అద్దంపట్టేలా సింహాచలం దేవస్థానంలో శిల్పాలు ఉన్నాయని, శ్రీకృష్ణదేవరాయలు నుంచి గజపతుల వరకు ఉన్న రాజశాసనాలు చరిత్రకు అద్దం పడుతున్నాయని వివరించారు. ఇటీవలే అన్ని శిల్పాలను ప్రత్యేక తైలంతో శుభ్రపరిచినట్టు చెప్పారు. వీటి గురించి భక్తులకు అర్థమయ్యేలా బోర్డులను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఏయూ సహకారం అందిస్తే సింహాచలం ఆలయ విశిష్టతను యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చేందుకు ప్రయ త్నిస్తాయన్నారు. సహకారం అందిస్తాం.. ఆలయ శిల్పకళ, శాసనాలను అధ్యయనం చేసి అన్ని విషయాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన సహకారం అందిస్తామని వీసీ ప్రసాదరెడ్డి హామీ ఇచ్చారు. నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి త్వరలోనే సింహాచలం దేవస్థానంపై పూర్తిస్థాయి పరిశీలన చేయిస్తామన్నారు. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందేందుకు అన్ని అర్హతలు సింహాచలం దేవస్థానానికి ఉన్నాయని ఈ సందర్భంగా వీసీ అభిప్రాయపడ్డారని ఈవో తెలిపారు. -
సింహాచలం కొండపై నేలకొరిగిన ధ్వజస్తంభం
సాక్షి,విశాఖపట్నం: సింహాచలం కొండపైఉన్న సీతారామ ఆలయంలోని ధ్వజస్తంభం అర్థరాత్రి అకస్మాత్తుగా నేలకొరిగింది. ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పురాతనమైన ఈ ధ్వజస్తంభం లోపలి కర్ర పాడై పోవడంతో ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. ఆలయ సాంప్రదాయరీతిలో ధ్వజస్తంభం పునః ప్రతిష్ట చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
బయటకొస్తున్న మాన్సాస్ ట్రస్ట్ అక్రమాలు
-
మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం భూములపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
అమరావతి: మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం భూముల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు నోడల్ ఆఫీసర్‌గా దేవాదాయశాఖ కమిషనర్‌ను నియమించింది. ఇక సింహాచలం దేవస్థానం ప్రాపర్టీ రిజిస్ట్రార్‌లో.. భారీగా భూములు తొలగించినట్లు గుర్తించారు. మాజీ ఈవో రామచంద్రమోహన్ హయాంలో అక్రమాలపై విచారణకు ఆదేశించారు. మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇప్పటికే త్రిసభ్య కమిటీ ప్రాథమిక నివేదిక అందించింది. -
సింహాచలం, మాన్సాస్ ట్రస్ట్ భూముల్లో అక్రమాలపై విచారణ పూర్తి
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం దేవస్థానం, మాన్సస్ ట్రస్ట్ భూముల్లో అక్రమాపై విచారణ పూర్తయినట్లు విచారణ కమిటీ బుధవారం తెలిపింది. రేపు(గురువారం) దేవాదాయశాఖ కమిషనర్‌కు నివేదిక ఇవ్వనున్న పేర్కొంది. సింహాచలం ఆలయ భూముల జాబితా నుంచి తొలగించిన భూముల జాబితాను నివేదికలో చేర్చినట్లు తెలిపింది. మాన్సాన్స్ ట్రస్ట్‌లో 150 ఎకరాల భూములు అమ్మకాలు, లీజుల వ్యవహారంపై అవకతవకలను నివేదికలో చేర్చినట్లు పేర్కొంది. మాన్సస్, సింహాచలం ఈవోలు, ముందు పని చేసిన అధికారులు నిర్లక్ష్యంపై పలు విషయాలను నివేదికలో చేర్చినట్లు విచారణ కమిటీ వెల్లడించింది. -
సింహాచలం భూములపై లోతుగా విచారణ
మహారాణిపేట (విశాఖ దక్షిణ): సింహాచలం దేవస్థానం భూముల జాబితా నుంచి వందలాది ఎకరాలు మాయం కావడంపై విచారణ మరింత లోతుగా సాగుతోంది. పంచగ్రామాల భూ జాబితా నుంచి 740 ఎకరాల గల్లంతు కావడంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దేవదాయ శాఖ అదనపు కమిషనర్ చంద్రకుమార్, ఉప కమిషనర్ ఇ.పుష్పవర్దన్ బుధవారం టర్నర్ సత్రం ఉప కమిషనర్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. దేవదాయ శాఖ ఆస్తుల జాబితా, 22 ఏ జాబితా, ఇతర రికార్డులను అధికారులు తనిఖీ చేశారు. అడంగల్ కాపీలు, టెన్ వన్ రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. 2016 డిసెంబర్–2017 ఫిబ్రవరి మధ్య 740 ఎకరాల భూమిని జాబితాల నుంచి తప్పించినట్టు అధికారులు గుర్తించారు. ఏ ప్రాంతాల్లోని భూములను జాబితాల నుంచి తప్పించారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. 2010 రికార్డుల ప్రకారం దేవస్థానానికి 11,118 ఎకరాల భూమి ఉండగా.. 2016 నాటికి 10,278 ఎకరాలు మాత్రమే ఉన్నాయి. మొత్తం వ్యవహారంపై విచారణ అధికారులు రెండు రోజుల్లో దేవదాయ శాఖ నివేదిక సమర్పించే అవకాశం ఉంది. -
సింహాచలం భూముల అక్రమాలపై విచారణకు కమిటీ
సాక్షి, అమరావతి/దొండపర్తి (విశాఖ దక్షిణ)/విజయనగరం టౌన్: రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం ఆలయానికి చెందిన సుమారు రూ.12 వేల కోట్లు విలువ చేసే 840 ఎకరాల భూములను ఆలయ ఆస్తుల రిజిస్టర్ నుంచి తొలగించిన అంశంపై విచారణకు దేవదాయ శాఖ ఇద్దరు అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2013–19 మధ్య ఆలయ భూముల ఆస్తుల రిజిస్టర్లలో రికార్డుల ట్యాంపరింగ్ జరిగినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీటిపై విచారణ జరిపేందుకు దేవదాయ శాఖ అడిషనల్ కమిషనర్–1 చంద్రకుమార్, విశాఖపట్నం డివిజన్ డిప్యూటీ కమిషనర్ పుష్పవర్థన్‌లతో కమిటీని ఏర్పాటు చేశారు. అప్పట్లో మాన్సాస్ ట్రస్టు భూముల్లో జరిగిన అక్రమాలపైన కూడా ఈ ఇద్దరు అధికారులు విచారణ జరిపి ఈ నెల 15లోగా ప్రాథమిక నివేదిక అందజేయాలని ఆదేశించారు. సింహాచలం ఆలయ, మాన్సాస్ ట్రస్టు ఈవోలు విచారణ కమిటీ ముందు రికార్డులను అందుబాటులో ఉంచాలన్నారు. విచారణలో భాగంగా కమిటీ సభ్యులు క్షేత్ర స్థాయిలో పరిశీలించేటప్పుడు ఆయా అధికారులు హాజరు కావాలని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో రికార్డుల ట్యాంపరింగ్ సింహాచలం దేవస్థానానికి 2010లో 11,118 ఎకరాల భూమి ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అయితే 2016 నాటికి ఇందులో 10,278 ఎకరాలే మిగిలాయి. 840 ఎకరాల భూములను ఆలయ రికార్డుల నుంచి తప్పించినట్లు దేవదాయ శాఖ అధికారులు తాజాగా గుర్తించారు. ఆలయ భూములు, ఆస్తుల పరిరక్షణలో భాగంగా జియోఫెన్సింగ్ ప్రక్రియ చేపడుతున్న క్రమంలో ఈ వేల కోట్ల రూపాయల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రభుత్వం జిల్లా అధికారులతో విచారణ జరిపించగా టీడీపీ ప్రభుత్వ హయాంలో రికార్డుల ట్యాంపరింగ్ జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. 2016లో అప్పటి సింహాచలం దేవస్థానం ఈవోగా పనిచేసిన కె.రామచంద్రమోహన్ ఆలయ భూరికార్డులను ట్యాంపరింగ్ చేసి వందల ఎకరాలను రికార్డుల నుంచి తొలగించినట్లు గుర్తించారు. అలాగే ఆయన మాన్సాస్ ట్రస్ట్ ఈవో (ఎఫ్ఏసీ)గా ఉన్న సమయంలో పలు భూ అక్రమాలకు పాల్పడినట్లు తేల్చారు. దీంతో ఆయనను విధుల నుంచి తప్పించి ఇప్పటికే ప్రభుత్వానికి సరెండర్ చేశారు. తాజాగా ఈ వ్యవహారాలన్నింటిపై సమగ్ర విచారణకు ప్రభుత్వం సిద్ధమైంది. మాన్సాస్‌లో ప్రారంభమైన ఆడిటింగ్ మాన్సాస్ ట్రస్ట్ కార్యకలాపాలు, భూవ్యవహారాలపై గత కొన్నేళ్లుగా అనేక ఆరోపణలు, వివాదాలు తలెత్తుతున్నాయి. గత 16 ఏళ్లుగా ట్రస్టులో ఆడిటింగ్ జరగకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీంతో ప్రభుత్వం ట్రస్ట్ వ్యవహారాలతోపాటు భూములపై కూడా పూర్తి స్థాయిలో ఆడిటింగ్ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు మాన్సాస్ ట్రస్ట్ రికార్డులు, భూముల వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. విజయనగరం జిల్లా ఆడిట్ అధికారి డాక్టర్ హిమబిందు ఆధ్వర్యంలో అధికారుల బృందం కోటలో ఉన్న ట్రస్ట్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి సోమవారం రికార్డులను పరిశీలించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2004 నుంచి మాన్సాస్ ట్రస్ట్ ఆడిటింగ్ జరగలేదన్నారు. తమ విధి నిర్వహణలో భాగంగా ఏటా ఆడిటింగ్ చేసేందుకు నోటీసులిస్తున్నా ట్రస్ట్ పెద్దలు సహకరించలేదని చెప్పారు. ఇప్పటికీ దేవాలయాలు, విద్యాసంస్థలకు సంబంధించిన ఎటువంటి పత్రాలు తమకు అందజేయలేదని స్పష్టం చేశారు. -
9 మంది అప్పన్న వైదికులకు షోకాజ్ నోటీసులు
సింహాచలం (పెందుర్తి): శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో గడిచి జ్యేష్ట ఏకాదిశి రోజున జరిగిన లక్ష్మీనారాయణస్వామి వార్షిక కల్యాణోత్సవంలో అర్చకులు ఆలపించిన గరుడ గజ్జన పాటను మార్ఫింగ్ చేసిన ఘటనలో తొమ్మిది మంది వైదికులకు దేవస్థానం ఈవో ఎంవీ సూర్యకళ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తానే మార్ఫింగ్ చేసి ఇన్చార్జి ప్రధానార్చకుడికి పంపినట్టు ఇప్పటికే ఓ వేదపండితుడు అధికారుల వద్ద ఒప్పుకున్నట్టు కూడా ప్రచారం జరిగింది. మొత్తం సంఘటనపై ఈవో కొద్ది రోజులుగా విచారణ చేస్తున్నారు. ఈసంఘటనలో మొత్తం తొమ్మిది మంది వైదికులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అందరినుంచి సమాధానం వచ్చినవెంటనే ఈవో తదుపరి చర్యలు తీసుకోనున్నారు. వైదికుల సమాధానం ఆధారంగా విచారించి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై సింహాలచలం దర్శనాలపై కఠిన నిబంధనలు అమలవుతాయని, ఉద్యోగులైనా సరే దర్శనం టికెట్ తీసుకోవాల్సిందేనని ఈవో సూర్యకళ తెలిపారు. -
భూ అక్రమాల బాధ్యులపై కఠిన చర్యలు
సాక్షి, విశాఖపట్నం: మాన్సాస్ ట్రస్టు, సింహాచలం అప్పన్న దేవస్థాన భూముల పరాధీనానికి బాధ్యులపై కఠినచర్యలు తప్పవని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, ఎంపీ వి.విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ సుమారు 748 ఎకరాల భూమిని ఆలయ రిజిస్టర్ నుంచి తొలగించిన విషయాన్ని ‘సాక్షి’ పత్రిక వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఆయా భూములను సర్వే చేయడంతో పాటు ఆ వ్యవహారంపై విచారణ జరపడానికి విజయనగరం, విశాఖపట్నం జాయింట్ కలెక్టర్లు కిశోర్‌బాబు, ఎం.వేణుగోపాల్‌రెడ్డికి రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి బాధ్యతలు అప్పగించారని మంత్రి ముత్తంశెట్టి చెప్పారు. వారు పదిరోజుల్లో నివేదికను, సంబంధిత రికార్డులను అందించిన తర్వాత ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఈ భూముల వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై, తద్వారా అడ్డగోలుగా లబ్ధిపొందిన వ్యక్తులపై చర్యలు తప్పవని చెప్పారు. విశాఖ నగర అభివృద్ధి, సింహాచలం పంచగ్రామాల భూసమస్య, ప్రభుత్వ భూముల పరిరక్షణ తదితర అంశాలపై మంగళవారం విశాఖ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి, ఎంపీ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉత్తరాంధ్రలో దేవాలయాల భూముల పరిరక్షణపై ఇటీవల దేవదాయశాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాన్సాస్ ట్రస్టు, సింహాచలం పంచగ్రామాల భూసమస్య గురించి అధికారులు ప్రస్తావించినట్లు మంత్రి చెప్పారు. దేవాలయ భూములను ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుని పేదలకు పట్టాలివ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎవరిపైనా కక్షసాధింపు చర్యలు కావని స్పష్టం చేశారు. చంద్రబాబు పరిపాలనలో యథేచ్ఛగా భూఆక్రమణలు జరిగాయన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.వేలకోట్ల విలువైన భూములను ఆక్రమణదారుల చెరనుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. తప్పు చేసినవారు తప్పించుకోలేరు వేల కోట్ల రూపాయల విలువైన సింహాచలం ఆలయ భూముల దుర్వినియోగం వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దలున్నారని ఎంపీ వి.విజయసాయిరెడ్డి చెప్పారు. ఎస్టేట్స్ ఎబాలిషన్ యాక్ట్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సింహాచలం దేవస్థానం, మాన్సాస్ భూముల్లో జరిగిన అవకతవకలను వెలికితీస్తామన్నారు. తప్పు చేసినవారు ఎంతటివారైనా తప్పించుకోలేరని స్పష్టం చేశారు. పంచగ్రామాల భూసమస్య కోర్టులో ఉందని, జూలైలో విచారణకు వచ్చేలా చూడాలని అడ్వకేట్ జనరల్‌ను కోరామని చెప్పారు. పంచగ్రామాల్లో నివాసితులకు కోర్టు ఆదేశాలను అనుసరించే భూముల క్రమబద్ధీకరణ ఉంటుందని తెలిపారు. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, మేయర్ గొలగాని హరివెంకటకుమారి పాల్గొన్నారు. -
ష్... గప్‌చుప్!
సాక్షి, అమరావతి: సింహాచలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ భూముల గోల్‌మాల్‌కు సంబంధించి రోజుకో వ్యవహారం వెలుగుచూస్తోంది. ఈ విషయమై రెండ్రోజులుగా ‘సాక్షి’లో వస్తున్న సంచలనాత్మక కథనాలు తెలిసిందే. తాజాగా.. ఈ 748 ఎకరాల భూబాగోతం వ్యవహారం వెలుగుచూడకుండా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ పెద్దలే అధికారుల నోరు నొక్కేసినట్లు తెలుస్తోంది. నిజానికి.. 2016 డిసెంబర్లో సింహాచలం ఆలయ ఆస్తుల రిజిస్టర్ నుంచి ఆ భూములు తొలగించడానికి నాలుగు నెలల ముందే అప్పటి దేవదాయ శాఖ కమిషనర్ మౌఖిక ఆదేశాలతో ఆలయ ఆస్తులపై రహస్యంగా విచారణ జరిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ శాఖలో ఉన్నతాధికారులకు కూడా తెలీకుండా గుట్టుగా ఆలయ ఈఓ స్థాయిలో సాగుతున్న ఈ భూబాగోతం వ్యవహారం గురించి దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి ఉప్పు అందింది. దీంతో అప్పటి కమిషనర్ ఈ మొత్తం తతంగంపై విచారణకు మౌఖికంగా ఆదేశిలిచ్చారు. ఈ నేపథ్యంలో.. కమిషనర్ కార్యాలయంలో భూముల వ్యవహారాలను పర్యవేక్షించే అధికారితో పాటు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు సంబంధించిన దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, విశాఖపట్నం జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో ఈ విచారణ సాగింది. ఆరు పేజీలతో కమిషనర్‌కు నివేదిక కాగా, ఆలయాల ఆస్తుల రిజిస్టర్లో పేర్కొన్న భూముల వివరాల వారీగా ఆ ముగ్గురు అధికారులు మూడ్రోజులపాటు విచారణ జరిపి కమిషనర్‌కు ఆరు పేజీల నివేదికను అందజేశారు. ఈ నివేదికలో.. ఎవరి నుంచి ఎలాంటి వినతులు రాకుండా ఏకపక్షంగా సదరు 748 ఎకరాలు దేవుడి భూములు కావని ప్రకటించే అధికారం ఎవరికీ లేదని అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు. భూములు తమవిగా ప్రజల నుంచి వినతి వచ్చినప్పుడు మాత్రమే నిబంధనల ప్రకారం విచారణ జరిపి వాటికి కమిషనర్ ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ (ఎన్ఓసీ) జారీచేయాల్సి ఉంటుందని అందులో వివరించారు. లేదంటే.. దీనిపై ఎవరైనా ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తే ట్రిబ్యునల్ తగిన ఆదేశాలు జారీచేస్తుందంటూ దేవదాయ శాఖ చట్టంలోని నిబంధనలను ఆ ముగ్గురు అధికారులు తమ నివేదికలో స్పష్టంచేశారు. కాగా, ఈ ఆరు పేజీల నివేదిక ప్రస్తుతం దేవదాయ శాఖ వద్ద భద్రంగా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అందరూ సైలెంట్.. ఇదిలా ఉంటే.. ముగ్గురు అధికారులు అప్పటి కమిషనర్‌కు నివేదిక ఇచ్చిన తర్వాత కూడా సింహాచలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓ స్థాయిలో ఈ భూముల గోల్మాల్ యథేచ్ఛగా కొనసాగింది. కానీ, అప్పటి కమిషనర్ సహా సంబంధిత శాఖ ఉన్నతాధికారులందరూ ఒక్కసారిగా గప్‌చుప్ అయ్యారు. ఇందుకు ప్రధాన కారణం.. అప్పటి ప్రభుత్వ ముఖ్యుల నుంచి అందిన ఆదేశాలే కారణమని విశ్వసనీయ సమాచారం. -
సింహాచలం భూముల గోల్మాల్.. పన్నాగం ‘పెద్ద’లదే!
సాక్షి, అమరావతి: విశాఖపట్నం నగరం చుట్టుపక్కల పది వేల కోట్లకుపైగా విలువ చేసే 748 ఎకరాల సింహాచలం ఆలయ భూములను 2016లో దేవదాయ శాఖ ఆస్తుల జాబితా నుంచి తొలగించడం వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్రే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ ఆదివారం సంచికలో ‘అప్పన్నకే శఠ గోపం’ శీర్షికతో సంచలనాత్మక కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీంతో.. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మరికొన్ని పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. ఈ భూబాగోతానికి సంబంధించి నాటి ప్రభుత్వ ‘ముఖ్య’నేత కనుసన్నల్లో భారీ కుంభకోణానికి రెండేళ్లకు పైగా పకడ్బందీ స్కెచ్ నడిచినట్లు దేవదాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే ముందుగా సింహాచలం ఆలయ భూములను కబ్జా చేసినట్లు తెలిసింది. అలాగే, 2016 డిసెంబరు 14న సింహాచల ఆలయ ఆస్తుల పట్టిక నుంచి 748 ఎకరాలను తొలగించిన జాబితాలో.. టీడీపీ నేతలు చేసిన కబ్జా భూములు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేవుడి భూములను ఆలయ ఆస్తుల జాబితా నుంచే నాటి ప్రభుత్వమే తనంతట తానుగా తొలగించడంతో టీడీపీ నేతలు ముందస్తు వ్యూహంతోనే దురాక్రమించుకున్నారని.. ఆ తర్వాత ఆ భూములన్నింటికీ వారే నిజమైన యజమానులుగా చలామణీలోకి వచ్చారన్నది ఒక బలమైన వాదన. నిషేధ జాబితాకు ఎక్కకుండా జాగ్రత్తలు 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రాష్ట్రమంతటా వ్యవసాయ భూములను అన్లైన్లో నమోదు చేసేందుకు ‘మీ ఇంటికి మీ భూమి’ పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో దేవదాయ శాఖ కూడా రాష్ట్రంలో వివిధ ఆలయాల పేరిట ఉన్న భూములన్నింటినీ అన్లైన్లో నమోదుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రతి మండలానికి ఒక అధికారిని నియమించి ఆ మండల పరిధిలో దేవుడి భూములను అన్లైన్లో నమోదు చేయించే బాధ్యతను ఆయనకు అప్పగించింది. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల వారీగా భూముల వివరాలను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖకు కూడా పంపి ఆయా భూములకు భవిష్యత్‌లో కొత్తగా రిజిస్ట్రేషన్ల జరగకుండా దేవదాయ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆలయాల భూములన్నింటినీ ప్రత్యేకంగా 22 (ఏ) (1) (సీ) అన్లైన్లో నిషేధిత జాబితాలో చేర్చారు. ఈ సమయంలోనూ అప్పటి ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో టీడీపీ నేతలు ఆ 748 ఎకరాలు అసలు రిజిస్ట్రేషన్ శాఖ 22(ఏ)(1)(సీ) జాబితా దాకా వెళ్లకుండా పక్కా వ్యూహంతో వ్యవహరించారు. సింహాచలం ఆలయ భూములపైనే ప్రత్యేక నివేదిక ఇదిలా ఉంటే.. ఆలయాల వారీగా 22(ఏ)(1)(సీ) జాబితాలో చేరాల్సిన భూముల వివరాలను జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ద్వారా ఆయా జిల్లాల పరిధిలోని అన్ని ఆలయాల వివరాలను ఒక నివేదిక రూపంలో కమిషనర్ కార్యాలయానికి తెప్పించుకుంది. అనంతరం ఇదే నివేదికను కమిషనర్ కార్యాలయం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు పంపింది. అయితే, విశాఖ జిల్లాలో అన్ని ఆలయాల వివరాలు కమిషనర్ కార్యాలయానికి చేరగా.. సింహాచలం ఆలయ నాటి ఈఓ మాత్రం దేవస్థానం పరిధిలోని ఆస్తుల వివరాలను పంపలేదు. అప్పటి ప్రభుత్వ పెద్దల సూచనల మేరకే ఇలా జరిగిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. అంతేకాక.. ఆస్తుల వివరాలను అప్పటి దేవదాయ శాఖ కమిషనర్ ఈఓను సమాచారం కోరినప్పటికీ నాటి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకున్నట్లు తెలిసింది. నాలుగు నెలల తర్వాత సింహాచలం దేవస్థానానికి సంబంధించిన భూముల నివేదికను విడిగా పంపినట్లు సమాచారం. రికార్డుల తారుమారు? సింహాచలం దేవస్థానం ఆస్తులకు సంబంధించిన 22(ఏ)(1)(సీ) జాబితాను రిజిస్ట్రార్ శాఖకు పంపే ముందు ఆలయ ఆస్తుల రికార్డులను తారుమారు చేశారన్న ఆరోపణలున్నాయి. ఆలయ ఆస్తుల జాబితా నుంచి 748 ఎకరాలను తొలగించాలన్న నిర్ణయం బయటకు పొక్కకుండా ఉండేందుకు సింహాచల ఆలయ ఆస్తులకు సంబంధించి 22(ఏ (1)(సీ) జాబితా వివరాలు మొదట ఆలయ ఈఓ ద్వారానే స్థానికంగా ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపి గుట్టుచప్పుడు కాకుండా కార్యక్రమాన్ని ముగించాలన్న ప్రయత్నం జరిగింది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా నాటి ఈఓ నేరుగా పంపిన నివేదికను పరిగణనలోకి తీసుకోవడానికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు సాహసించలేదు. దీంతో నెలల విరామం అనంతరం ఈఓ కమిషనర్ కార్యాలయం ద్వారానే రిజిస్ట్రేషన్ శాఖకు పంపారని రెండు వేర్వేరు కథనాలు వినిపిస్తున్నాయి. ఆ అధికారికి అందలం కాగా.. 2016లో సింహాచలం ఆలయ ఆస్తుల జాబితా నుంచి 748 ఎకరాల దేవుడి భూమి తొలగించినప్పుడు ఆలయ ఈఓగా పనిచేసిన అధికారే ఇప్పుడు దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ తర్వాత స్థాయి ర్యాంకులో అడిషనల్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో సదరు ఈఓకు అదనపు కమిషనర్‌గా పదోన్నతి ఇవ్వగా, ఆప్పటి నుంచే ఆయన కమిషనర్ కార్యాలయంలో ఆ హోదాలో పనిచేస్తున్నారు. ఆస్తుల గోల్‌మాల్‌పై విచారణ సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయ ఆస్తుల రిజిస్టర్ నుంచి 2016లో ఒకేసారి 748.07 ఎకరాల తొలగింపు వ్యవహరంపై దేవదాయశాఖ విచారణకు ఆదేశించింది. ఆదివారం ‘సాక్షి’లో ఈ బాగోతంపై వచ్చిన కథనం మీద ఆ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ స్పందించారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రత్యేక కమిషనర్ అర్జునరావును కోరారు. దీంతో దేవదాయ శాఖ విశాఖపట్నం ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్‌తో సమగ్ర విచారణకు అర్జునరావు ఆదేశించారు. -
కల్యాణోత్సవం వీడియో మార్ఫింగ్ వివాదం పై ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
-
తెలుగు ప్రేక్షకులు బెస్ట్: నటుడు
సాక్షి, సింహాచలం(పెందుర్తి): ముద్దుల మావయ్య సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చిందని, అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నానని ప్రముఖ సినీ నటుడు ఆనంద్‌రాజ్ అన్నారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామిని ఆదివారం ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. తెలుగు ప్రేక్షకులు బెస్ట్ అంటూ ప్రశంసించారు. బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా విశాఖలో షూటింగ్ జరుగుతున్న సమయంలో తొలిసారిగా సింహాచలం వచ్చానన్నారు. అప్పటి నుంచి ఎప్పుడు విశాఖ వచ్చినా.. వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుంటున్నట్టు తెలిపారు. 1986 నుంచి సినిమాల్లో నటిస్తున్నానని వెల్లడించారు. ప్రస్తుతం తమిళ సినిమాల్లో బిజీగా ఉన్నానన్నారు. ఈ సందర్భంగా ఆనంద్‌రాజ్ స్వామికి పూజలు నిర్వహించారు. (చదవండి: కిల్ రాజు అంటావా..సినిమా ఎవడు ఇస్తాడు?) -
మత కలహాలు సృష్టించి..
-
‘ఆ దాడులు వెనుక కుట్ర కోణం’
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో మత కలహాలు సృష్టించి.. రాజకీయ లబ్ధి పొందాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. శనివారం ఆయన సింహాద్రి అప్పన్న స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనుక కుట్ర కోణం దాగి ఉందనే అనుమానాలు కలుగుతున్నాయని సందేహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే సహించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అటువంటి వారికి కఠిన శిక్ష తప్పదని మోపిదేవి వెంకటరమణ హెచ్చరించారు. -
విశాఖతో విడదీయలేని అనుబంధం
సాక్షి, ప్రతినిధి, విశాఖపట్నం: సింహాచలం శ్రీ వరాహ నరసింహస్వామి సన్నిధిలో ప్రేమ వివాహం చేసుకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి, అప్పటినుండి విశాఖతో ఎనలేని అనుబంధం ఏర్పడింది. ► వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకు బాలు హాజరై.. తన గళంతో విశాఖ ప్రజల హృదయాల్ని గెలుచుకున్నారు. ► స్టీల్‌ప్లాంట్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరైన బాలు.. ‘‘విశాఖ నగరమున వెలసిన ఉక్కు కర్మాగారం, ప్రపంచ పటమున మెరిసిన దేవాలయ శిఖరం’’ అనే పాటని ఆలపించారు. ► 2016 జనవరి 2వ తేదీన సాగరతీరంలో నిర్వహించిన విశాఖ ఉత్సవ్ ముగింపు కార్యక్రమానికి బాలు హాజరై తన గానామృతంలో ప్రజల్ని ఓలలాడించారు. బాలు పాటకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనకు స్వరకళా సామ్రాట్ బిరుదుని ప్రదానం చేశారు. ► చివరిసారిగా 2019లో ఏయూ కాన్వొకేషన్ హాల్లో నిర్వహించిన ‘సామవేదం పదార్చన–ఎస్పీ బాలు స్వరార్చన’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనంద కైలాసం ఆడియో సీడీని ఆవిష్కరించి.. భక్తి పాటలు ఆలపించారు. ► 2009 డిసెంబర్ 5న బాల సుబ్రహ్మణ్యానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ని ప్రదానం చేసింది. ► వీలుదొరికినప్పుడల్లా బాలు భీమిలిలోని ఆనందవనానికి వచ్చి.. సద్గురు కందుకూరి శివానందమూర్తి సన్నిధిలో గడిపేవారు. ► 2009, 2010, 2014లో కొప్పరపు కవుల కళాపీఠం వార్షికోత్సవంలో పాల్గొన్నారు. 2009లో ప్రతిష్టాత్మక కొప్పరపు కవుల జాతీయ ప్రతిభా పురస్కారాన్ని బాలు అందుకున్నారు. ► పాటకు ప్రాణం పోసిన ఎస్పీబీ మరణం.. సంగీతానికి తీరని లోటని పలువురు విశాఖ ప్రముఖులు, కళాకారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
అప్పన బంగారం మోసం కేసు: విచారణ కమిటీ
సాక్షి, విశాఖపట్నం: సింహాచలంలో అప్పన్న బంగారు ఆభరణాల విక్రయం పేరిట జరిగిన మోసంపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దేవాదాయ శాఖ ఉన్నతాధికారి అజాద్ పర్యవేక్షణలో కమిటీ విచారణ చేపట్టింది. హైమావతికి సహకరించిన దేవాదాయశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు మధు, శేఖర్‌లపై సస్పెన్షన్ వేటు వేశారు. నెల్లూరు మహిళ శ్రావణి నుంచి ఆన్లైన్లో కోటి 40 లక్షలు తీసుకున్న విశాఖ మహిళ హైమవతిని విచారిస్తున్నామని దేవాదాయ శాఖ ఉన్నతాధికారి ఆజాద్ తెలిపారు. (చదవండి: అప్పన్న బంగారం పేరిట రూ.1.44 కోట్లకు టోకరా) సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని వెల్లడించారు. దేవస్థానం పేరుతో రసీదు ఎక్కడ ముద్రించారు?, ఆలయ సిబ్బంది పాత్ర ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఆజాద్ వెల్లడించారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం బంగారాన్ని విక్రయిస్తున్నట్టుగా నమ్మించి రూ.1.44 కోట్లకు టోకరా వేసిన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. -
అప్పన్న బంగారం పేరిట రూ.1.44 కోట్లకు టోకరా
సాక్షి, సింహాచలం (పెందుర్తి): శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం బంగారాన్ని విక్రయిస్తున్నట్టుగా నమ్మించి రూ.1.44 కోట్లకు టోకరా వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన వివరాలివీ.. జూలై నెలలో అప్పటి ఈవో డి.భ్రమరాంబకు ఒక ఫోన్ వచ్చింది. తన పేరు ఎం.శ్రావణి అని, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన తాను దేవస్థానం వద్ద రూ.1.44 కోట్ల విలువైన బంగారం కొనుగోలు చేశానని, ఎప్పుడు ఇస్తారని అడిగింది. కంగుతిన్న ఈవో భ్రమరాంబ ఆలయ ఏఈవో పి.రామారావు ఫోన్ నంబర్‌ను శ్రావణికిచ్చి పూర్తి వివరాలు ఆయనకు తెలియజేయాలని సూచించారు. శ్రావణి.. ఏఈవోకి ఫోన్ చేసి తాను సింహాచలం కొండపై ఉంటున్న కోన హైమావతి అనే మహిళ ద్వారా దేవస్థానం బంగారం అమ్ముతోందని తెలుసుకుని ఆమెకు రూ.1.44 కోట్లు ఇచ్చి బంగారం కొనుగోలు చేశానని చెప్పింది. ఆ బంగారాన్ని తనకు ఎప్పుడు అప్పగిస్తారని అడిగింది. దేవస్థానం బంగారం అమ్మకాలు ఏమీ చేయదని ఏఈవో చెప్పారు. దీంతో ఆ మహిళ ఈవో డి.భ్రమరాంబ సంతకం, దేవస్థానం స్టాంప్‌తో రూ.1.30 కోట్లు, రూ.14 లక్షలు ఉన్న రెండు టాక్స్ ఇన్వాయిస్ క్యాష్ బిల్లులను ఏఈవో వాట్సాప్‌కు పంపించింది. సదరు బిల్లుల్లో కొనుగోలు చేసిన వస్తువుల వివరాలు కూడా ఉన్నాయి. విషయాన్ని ఈవో భ్రమరాంబ దృష్టికి ఏఈవో తీసుకెళ్లగా ఆ బిల్లులు నకిలీవని, సంతకం కూడా ఫోర్జరీ చేసిందని గుర్తించారు. ఈ విషయాన్ని శ్రావణికి కూడా తెలియజేసి ఆలయంలో బంగారం విక్రయించడం లేదని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అయినా శ్రావణి ఆలయ అధికారులకు పదేపదే ఫోన్ చేస్తుండటంతో ఎట్టకేలకు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పూనుకున్నారు. ఇదిలావుండగా శ్రావణి దేవస్థానం ఏఈవోకి వాట్సప్‌లో పంపిన బిల్లు మద్దూరు నాగేంద్రకుమార్ పేరిట ఉంది. ఈ విషయాన్ని ఏఈవో శ్రావణిని అడగ్గా.. అది తన భర్తదని, ఆయన ఇస్రోలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారని తెలిపింది. దేవస్థానానికి సంబంధం లేదు బాధితురాలు శ్రావణిని ‘సాక్షి’ వివరణ కోరగా తమకు ఆలయంతో ఎలాంటి సంబంధం లేదని, హైమావతికే క్యాష్ ఇచ్చామని తెలిపారు. సింహాచలం ఆలయంలో ఏటా బంగారు బిస్కెట్లు వేలం వేస్తారని, ఈ సారి కరోనా కారణంగా ఎవరికీ ఎలాంటి సమాచారం లేకుండా బంగారం వేలం వేస్తున్నారని, మీరు రూ.1.44 కోట్లు ఇస్తే బిస్కెట్లు తీసిస్తానని నమ్మబలికిందని ఆమె వాపోయారు. ఆ మాటలను నమ్మి జూన్ 27న రూ.కోటి నేరుగా, మరో రూ.44 లక్షలు బ్యాంక్ ఖాతాల ద్వారా చెల్లించామన్నారు.రసీదులు పంపే వరకు అవి నకిలీవని మాకు కూడా తెలియదని చెప్పారు. అయితే హైమావతి తమను తెలివిగా మోసం చేసి రూ.1.44 కోట్లు నగదు తీసుకుందని, ఆమెపై తాము కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
సింహగిరిపై నేటి నుంచి పవిత్రోత్సవాలు
సింహాచలం(పెందుర్తి): సింహగిరిపై శుక్రవారం నుంచి ఐదు రోజులపాటు వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి. రాత్రి 7 గంటలకు మృత్సంగ్రహణం, అంకురార్పణ, హోమాలతో పవిత్రోత్సవాలను ప్రారంభిస్తారు. 29వ తేదీన ఉదయం విశేష హోమాలు, పారాయణలు, రాత్రి ఆదివాసములు, పారాయణలు, 30వ తేదీ ఉదయం విశేష హోమాలు, పారాయణలు, రాత్రి పవిత్ర సమర్పణ, 31న ఉదయం విశేష హోమాలు, పారాయణలు, రాత్రి పూర్ణాహుతి, పవిత్ర విసర్జన, రథబలి నిర్వహిస్తారు. సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం ఏకాంత స్నపనంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. పవిత్రోత్సవాలను పురస్కరించుకుని ఈనెల 28వ తేదీ నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు ఆర్జిత సేవలన్నీ రద్దుచేసినట్లు దేవస్థానం ఈవో డి.భ్రమరాంబ తెలిపారు. -
అప్పన్న ఆలయానికి అపూర్వ గౌరవం
దొండపర్తి (విశాఖ దక్షిణ): సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు లేఖ మేరకు రాష్ట్రంలో ప్రసిద్ధ దేవస్థానాల్లో ఒకటైన సింహాచలాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘పిలిగ్రిమేజ్ రెజువెనేషన్, స్పిరిచ్యువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్’ (ప్రసాద్) స్కీమ్‌లోకి ఈ చారిత్రాత్మక ఆలయాన్ని చేర్చింది. 11వ శతాబ్దానికి చెందిన సింహాచలం దేవస్థానంతో పాటు అనుబం«ధంగా ఉన్న ఆలయాల్లో సకల సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించింది. దేవాలయ పర్యాటకంలో భాగంగా సింహాచలానికి రూ.53 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. ‘ప్రసాద్’ స్కీమ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని పలు ప్రఖ్యాత తీర్థయాత్ర స్థలాలను ఎంపిక చేసి అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా 2015–16లో అమరావతి ఆలయం అభివృద్ధికి రూ.28.36 కోట్లు, శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి రూ.47.45 కోట్లు మంజురు చేసింది. దేశంలో ముఖ్యమైన పర్యాటక, ఆధ్యాత్మిక, ధార్మిక, ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం ‘ప్రసాద్’ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడు దేవాలయాల పేర్లను సూచిస్తూ రాష్ట్ర పర్యాటక మంత్రిత్వ శాఖ కేంద్రానికి లేఖ రాసింది. అయితే కేంద్రం దేశంలో ఉన్న దేవాలయాల్లో ఐదింటిని మాత్రమే ఎంపిక చేసింది. వాటిలో సింహాచలం దేవస్థానం ఉండడం విశేషం. రూ.53.69 కోట్లతో ప్రతిపాదనలు కేంద్రం సూచనలు మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ సింహాచలం అభివృద్ధి, చేపట్టాల్సిన పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సింహాచలం మెట్ల మార్గం అభివృద్ధికి రూ.27.86 కోట్లు, కొండపైనే వివిధ అభివృద్ధి పనులకు రూ.18,21,50,000, పాన్ ఏరియా కాంపొనెంట్స్‌కు రూ.3,87,50,000, కన్సల్టెన్సీ, ఇతర ఛార్జీలతో కలిపి మొత్తంగా రూ.53.69 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేసి కేంద్రానికి పంపించింది. దీనికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సింహాచలం దేవస్థానాన్ని ‘ప్రసాద్’ స్కీమ్‌లో చేరుస్తున్నట్లు ప్రకటించింది. కాగా, దేవాలయ పర్యాటకంలో భాగంగా సింహాచలం దేవస్థానాన్ని ‘ప్రసాద్’ స్కీమ్‌లో చేర్చడం పట్ల రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పథకంలో మంజూరైన రూ.53 కోట్లతో ఆలయంలో పర్యాటక రంగ అభివృద్ధికి తగిన విధంగా ఖర్చు చేస్తామన్నారు. -
బాబాయ్ భ్రష్టు పట్టించారు
సాక్షి, విశాఖపట్నం: మాన్సాస్ ట్రస్టు చైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు ఉన్నప్పుడు ట్రస్టు, సింహాచలం దేవస్థానం అభివృద్ధికి ఏం చేశారో ప్రజలకు బహిరంగంగా చెప్పగలరా.. అని ట్రస్టు చైర్పర్సన్ సంచయిత గజపతిరాజు ప్రశ్నించారు. విశాఖలోని తన నివాసంలో ‘సాక్షి’తో మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే..(అవన్నీ బాబు, బాబాయ్ కలిసే చేశారట!) ►ట్రస్టు ఆశయాన్ని బాబాయ్ పూర్తిగా భ్రష్టు పట్టించారు. ►మోతీమహల్‌ని కూల్చివేసినప్పుడు గత చరిత్ర గుర్తుకు రాలేదా? మూడు లాంతర్ల కూడలిని ధ్వంసం చేశారంటూ ఇప్పుడు మొసలి కన్నీరుకార్చడం హాస్యాస్పదం. ►తమ కుట్రలు ఎక్కడ బయటపడిపోతా యేమోనన్న భయంతో ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. -
ఏపీ: మూడు ఆలయాలకు పాలకమండళ్లు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రముఖ ఆలయాలకు రాష్ట్ర ప్రభుత్వం పాలక మండళ్లను నియమించింది. విజయవాడ, సింహాచలం, ద్వారకా తిరుమల ఆలయాలకు పాలక మండళ్లను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు వెలువరించింది. ప్రిన్సిపల్ కార్యదర్శి ఉషారాణి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పాలకమండళ్లలో పదహారుగురు చొప్పున సభ్యులను నియమించారు. మూడు ఆలయాల్లోని ప్రధాన అర్చకులు ఎక్స్అఫిషియో సభ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సింహాచలం, ద్వారకా తిరుమలలో వ్యవస్థాపక కుటుంబ సభ్యులు చైర్మన్‌గా వ్యవహరిస్తారని వెల్లడించింది. దుర్గ గుడి పాలక మండలి చైర్మన్‌గా పైలా సోమినాయుడును ఎన్నుకునే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ మేరకు ఆలయాల పాలకమండళ్లలో మహిళలకు పెద్దపీట వేశారు. (చదవండి: 29 నుంచి ‘అరకు ఉత్సవ్’) విజయవాడ: దుర్గ గుడి పాలక మండలి సభ్యులు 1. పైలా సోమినాయుడు 2. కటకం శ్రీదేవి 3. డీఆర్కే ప్రసాద్ 4. బుసిరెడ్డి సుబ్బాయమ్మ 5. పులి చంద్రకళ 6. ఓవీ రమణ 7. గంటా ప్రసాదరావు 8. రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి 9. చక్కా వెంకట నాగ వరలక్ష్మి 10. కార్తీక రాజ్యలక్ష్మి 11. నేటికొప్పుల సుజాత 12. నేలపట్ల అంబిక 13. కానుగుల వెంకట రమణ 14. నెర్సు సతీశ్ 15. బండారు జ్యోతి 16. లింగంబొట్ల దుర్గాప్రసాద్ (పధాన అర్చకుడు) ద్వారకా తిరుమల: వెంకటేశ్వరస్వామి దేవస్థానం పాలక మండలి సభ్యులు 1. వ్యవస్థాపక కుటుంబ సభ్యులు (చైర్మన్) 2. మాతూరు శ్రీవల్లీ 3. గ్రంథి శేషగిరిరావు 4. కర్పూరం గవరయ్య గుప్తా 5. గూడూరి ఉమాబాల 6. కనకతాల నాగ సత్యనారాయణ 7. కొండేటి పద్మజ 8. కొత్తా విజయలక్ష్మి 9. చిలువులూరి సత్యనారాయణరాజు 10. కుంజా శాంతి 11. నందిని బందంరావూరి 12. మనుకొండ నాగలక్ష్మి 13. జి. సత్యనారాయణ 14. మేడిబోయిన గంగరాజు 15. వీరమళ్ల వెంకటేశ్వరరావు 16. పీవీఎస్‌ఎస్‌ఆర్ జగన్నాథ ఆచార్యులు (ప్రధాన పూజారి) సింహాచలం: లక్ష్మీనరసింహ దేవస్థానం పాలక మండలి సభ్యులు 1. వ్యవస్థాపక కుటుంబ సభ్యులు (చైర్మన్) 2. దాడి దేవి 3. వారణాసి దినేశ్‌రాజ్ 4. నల్లమిల్లి కృష్ణారెడ్డి 5. జి. మాధవి 6. గడ్డం ఉమ 7. రాగాల నరసింహారావు నాయుడు 8. దాడి రత్నాకర్ 9. సూరిశెట్టి సూరిబాబు 10. రంగాలి పోతన్న 11. సంచిత గజపతిరాజు 12. దొనకొండ పద్మావతి 13. నెమ్మాడి చంద్రకళ 14. సిరిపురపు ఆశాకుమారి 15. విజయ్ కే. సోంధి 16. గొడవర్తి గోపాల కృష్ణామాచార్యులు (ప్రధాన అర్చకుడు) -
ప్రసాదంలా..నిధుల పందేరం
కోర్కెలు తీర్చే అప్పన్నకు భక్తిపూర్వకంగా సమర్పించుకుంటున్న మొక్కులు, విరాళాలు స్వాహార్పణం అయిపోయాయి. బిల్లులు లేకపోయినా.. పనులు జరగకపోయినా చాలా ఉదారంగా ప్రసాదం పంచినట్లు అప్పన్న నిధులను దేవస్థానం అధికారులు పంచిపెట్టేశారు. ఇది ఏ ఒక్క ఏడాదికో పరిమితం కాలేదు. టీడీపీ హయాంలో గత ఐదేళ్లలోనూ ఇదే తంతు సాగింది. నిధుల వ్యయం, బిల్లుల చెల్లింపులు ఎంత దారుణంగా జరిగాయంటే.. ఏకంగా 105 అంశాల్లోనే సరైన లెక్కాపత్రాలు లేకుండా కోట్లకు కోట్లు ఖర్చు చేసేశారు. ఈ మొత్తం సుమారు 29 కోట్లు. ఇది ఎవరో ఊసుపోక చేసిన ఆరోపణ కాదు. స్వయంగా ఆడిట్లో తేలిన అంశం. ఆ శాఖే నివేదించిన కఠోర వాస్తవం. మొత్తంగా చూసుకుంటే 375 అంశాల్లో నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిగాయని ఆ శాఖ నిగ్గు తేల్చింది. అంతర్గత విజిలెన్స్ వ్యవస్థ లేకపోవడం.. బ్లాక్‌లిస్టులో చేర్చాల్సిన కాంట్రాక్టర్లు, షాపుల యజమానులే మళ్లీ మళ్లీ కాంట్రాక్టులు, షాపుల లీజులు పొందుతుండటంతో అడ్డగోలు చెల్లింపులు, ఎగవేతలకు అడ్డుకట్ట పడటం లేదని ఆడిట్ నివేదికలో పేర్కొన్నారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: దేశంలోనే పేరుగాంచిన నారసింహ క్షేత్రాల్లో మొదటి స్థానంలో ఉన్న సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం నిధులు అడ్డగోలుగా దుర్వినియోగమవుతున్నాయి. టీడీపీ అధికారం చెలాయించిన గత ఐదేళ్లలో దేవస్థానం ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఇష్టారాజ్యంగా అడ్వాన్స్ పేమెంట్లు, బిల్లులు లేకపోయినా నగదు చెల్లింపులు.. ఇలా అడ్డగోలుగా అప్పన్న ఖజానాకు భారీ చిల్లులు పడ్డాయి. ఆడిట్ అధికారుల నివేదికతో ఈ అవినీతి పర్వం వెలుగు చూసింది. రూ.61 కోట్ల చెల్లింపులపై అభ్యంతరం.. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రూ.61 కోట్ల 32 లక్షల 87వేల చెల్లింపులపై ఆడిట్ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆ చెల్లింపులకు దేవస్థానం సిబ్బంది సమర్పించిన బిల్లులు చూసి ఆడిట్ అధికారులు విస్తుపోయినట్టు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 375 అంశాల్లో(కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించి) చెల్లింపులు జరిగాయని తేలింది. అంతే కాకుండా కోట్లాది రూపాయలను అవసరానికి మించి అదనంగా చెల్లించేశారని ఆడిట్ అధికారులు లెక్కవేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 105 అంశాల్లో కోట్లకు కోట్లు అదనపు చెల్లింపులు జరిగాయి. రూ.2.09 కోట్ల సర్దుబాటు చెల్లింపులకు అసలు బిల్లులే లేవట. రూ. 27.42 కోట్ల చెల్లింపులకు సరైన రికార్డుల్లేవని, ఇంకొన్ని బిల్లులకు సంబంధించి రూ. 29 కోట్ల మేర అదనంగా చెల్లించారని ఆడిట్ శాఖ నిగ్గుతేల్చింది. ఇంజినీరింగ్, పరిపాలన విభాగం తప్పులు 105.. ఇక ఇంజినీరింగ్, పరిపాలన విభాగాల్లో 105 అంశాలకు సంబంధించి అవకతవకలకు పాల్పడినట్లు, ఆడిట్ అనుమతి లేకుండా అభ్యంతరకర అదనపు చెల్లింపులు చేసినట్లు తేలింది. ఇదే విషయమై ఈ ఏడాది మార్చిలో ఆడిట్‌శాఖ అప్పటి ఈవో రామచంద్రమోహన్‌కు ఒక నివేదిక సమర్పించింది. ఇందులో 35 అంశాలకు సంబంధించి తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొంది. దేవస్థానం ఉన్నతాధికారిగా రామచంద్రమోహన్ ఆ అభ్యంతరాలకు సమాధానాలు ఇవ్వగా.. వాటిలో 13 వివరణలకు మాత్రమే ఆడిట్ అధికారులు ఒకింత సంతృప్తి చెందారు. మిగిలిన 22 అంశాల విషయంలో ఇప్పటికీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్‌లిస్ట్‌లో ఉండాల్సిన బకాయిదారులదే ఇష్టారాజ్యం.. 2016–17 ఆడిట్ రిపోర్టు ప్రకారం సుమారు రూ.6.75 కోట్ల బకాయిలు ఇంకా కాంట్రాక్టర్లు, షాపుల యజమానుల నుంచి రావాల్సిఉంది. 2019 మార్చి నాటికి ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదు. బకాయిల వసూలులో సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంతో ఉన్నారనడానికి ఇదే నిదర్శనం. బకాయిలు అడగకుండా ఉండడటానికి కాంట్రాక్టర్లు, షాపుల యజమానులు ఎప్పటికప్పుడు సిబ్బందికి చేతులు తడుపుతున్నారనేది బహిరంగ రహస్యం. బ్లాక్ లిస్టులో ఉండాల్సిన బకాయిదారులే తిరిగి కాంట్రాక్టులు, వేలం పాటల్లో యథేచ్చగా పాల్గొంటున్నారు. పాత బకాయిలు కట్టకపోయినా అధికారులు వారితో కుమ్మక్కవ్వడం వల్లే దేవస్థానానికి రావాల్సిన కోట్లాది రూపాయలు రాకుండా పోతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆదాయం రూ.147కోట్లు... ఖర్చు రూ.144కోట్లు.. 2016–17లో దేవస్థానానికి రూ.147.26 కోట్ల ఆదాయం రాగా అందులో రూ.144.50 కోట్లు ఖర్చుగా చూపించారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చునన్న వాదనలు వినిపిస్తున్నాయి. దేవస్థానంలో అంతర్గత విజిలెన్స్ టీం ఏర్పాటు చేయాలని ఆడిట్ విభాగం ఎప్పటి నుంచో కోరుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఉన్నతాధికారులు ఈ అడ్డగోలు చెల్లింపులు, ఆడిట్ అభ్యంతరాలపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. -
సింహగిరి.. భక్తఝరి
సాక్షి,సింహాచలం(విశాఖపట్నం) : విరులు పులకించాయి. ఝరులు స్వాగతించాయి. గిరులు ఉప్పొంగిపోయాయి. అడుగులో అడుగేస్తూ అప్పన్నను తలుస్తూ ముందుకు సాగింది భక్తజనం. అన్ని దారులూ సింహగిరివైపే.. అందరి నోటా గోవింద నామస్మరణే.. స్వామి తలపుతో గిరియాత్ర సాగిపోయింది.సింహ గిరీశా పాహిమాం..రక్షమాం..అంటూ భక్తజనం వేడుకుంది. స్వామే నడిపిస్తున్నారనే భావనతో అలవోకగా ప్రదక్షిణలో నిమగ్నమైంది. భక్తిభావం ఉప్పొంగింది. ఎటు చూసినా ఉత్సాహం.. ప్రదక్షిణోత్సాహం.. ఆషాడ పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం సింహగిరి ప్రదక్షిణ ఘనంగా జరిగింది. 32 కిలోమీటర్ల ప్రదక్షిణలో ఈ ఏడాది లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ చేసేందుకు ఉదయం 8 గంటల నుంచే సింహాచలానికి భక్తులు చేరుకున్నారు. రాత్రి 10 వరకు ప్రదక్షిణ చేసేందుకు భక్తులు సింహాచలం తరలివస్తూనే ఉన్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఈ ఏడాది అధిక సంఖ్యలో భక్తులు ప్రదక్షిణకు తరలివచ్చారు. పెద్ద ఎత్తున మహిళలు, యువత గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఘల్లుమన్న జానపదం రథోత్సవంలో సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం పురుషోత్తపల్లికి చెందిన ‘ఓం నమో వెంకటేశాయ భజన మండలి’ మహిళల డప్పు వాయిద్య కార్యక్రమం ఈ ఏడాది ప్రత్యేకం.విజయనగరం జిల్లా పూసపాటిరేగకి చెందిన తప్పెటగుళ్లు, పులివేషాలు, విశాఖకి చెందిన కోలాటం తదితర ప్రదర్శనలు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రదక్షిణలో పదనిసలు భక్తుల సందడి ఉదయం 8 గంటల నుంచే మొదలైంది. 10 గంటలకు భక్తుల తాకిడి పెరిగింది. రథోత్సవం జరిగే సమయానికి 32 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గం భక్తులతో నిండిపోయింది. తొలిపావంచా వద్ద కొబ్బరికాయలు కొట్టే భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఈ ఏడాది 26 క్యూలను ఏర్పాటు చేశారు. నగరం నుంచి పాత గోశాల వైపు వచ్చే బస్సుల్ని ఉదయం నుంచే గోశాల జంక్షన్ వద్ద నిలిపివేశారు. కొన్ని వాహనాలను శ్రీనివాసనగర్ నుంచే అనుమతించలేదు. దీంతో చాలామంది భక్తులు శ్రీనివాసనగర్ నుంచి కాలినడకన తొలిపావంచా వద్దకు చేరుకున్నారు. హనుమంతవాక నుంచి బీఆర్టీఎస్ రోడ్డులో అడవివరం జంక్షన్ వరకు మాత్రమే అనుమతించారు. అక్కడి నుంచి తొలిపావంచాకి వచ్చే భక్తులను గాంధీనగర్, పుష్కరిణి, రాజవీధి మీదుగా మళ్లించడంతో భక్తులంతా ఆ మార్గంలోనే నడిచి వెళ్లారు. కొంతమంది భక్తులు సింహగిరి ఘాట్‌రోడ్‌లోకి వెళ్లి కొత్త ఘాట్‌రోడ్డు మీదుగా అడవివరం జంక్షన్ చేరుకుని ప్రదక్షిణ చేశారు. యువత సెల్ఫీలు తీసుకుంటూ ప్రదక్షిణ చేసారు. రథోత్సవం ప్రారంభమయ్యే సమయానికి వరుణుడు చిరుజల్లులు కురిపించాడు. సాయంత్రం అడవివరంలో చినుకులు పలకరించాయి. భక్తులు తడుస్తూనే గిరి ప్రదక్షిణ చేశారు. -
ఈవో తీరుపై భక్తుల ఆగ్రహావేశాలు
సాక్షి, విశాఖపట్నం: గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైన సింహాచలం దేవస్థానం ఈవో రామచంద్రమోహన్‌పై భక్తులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఏటా జరిగే అప్పన్న చందనోత్సవం కోసం చేసిన అరొకర ఏర్పాట్లు పట్ల భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు భానుడు భగభగమంటూ మండుతున్న సమయంలో క్యూలైన్లలో నిల్చొనే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టిన పాపాన పోలేదు. సాధారణంగా అప్పన్న నిజరూపదర్శనం కోçసం ఉత్తరాంధ్ర వాసులతో పాటు ఒడిశా, చత్తీస్ఘడ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఏటా లక్ష మందికి పైగా భక్తులు ఆయా రాష్ట్రాల నుంచి తరలివస్తుంటారు. ఈసారి ఫొని తుపాను ప్రభావం వల్ల ఒడిశా, పశ్చిమబెంగాల్ నుంచి వచ్చే భక్తులు తాకిడి బాగా తగ్గింది. గతంలో మాదిరిగానే ఆయా రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఉంటే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. షామియానాలు లేక.. తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక క్యూలైన్లలో భక్తులు విలవిల్లాడిపోయారు. భక్తులే కాదు.. అప్పన్న చందనోత్సవం కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులు సైతం నానా అగచాట్లు పడాల్సివచ్చింది. తొలిసారి ఓబీ వ్యాన్లకు కొండపైకి అనుమతినివ్వకపోవడంతో చందనోత్సవం ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు మీడియా ప్రతినిధులు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఒకటి రెండు సమీక్షలు నిర్వహించడం తప్ప ఆలయ ఈవో రామచంద్ర మోహ¯న్ ఏర్పాట్లపై కనీసంగా పట్టించు కోలేదంటున్నారు. ఈవోపై మండిపడ్డ అవంతి అప్పన్న నిజరూపదర్శనం చేసుకునేందుకు వచ్చిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు సింహాచలం ఈవో రామచంద్రమోహన్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నేను ఎంపీని.. నా రాజీనామాను ఇంకా ఆమోదించలేదు.. ఈనెల 23వ తేదీ వరకు తాను ఎంపీనే.. తాను ఎంపీని కాదనుకుంటున్నావా? ఎంపీనైన తన పట్లే ఇలా ప్రవర్తిస్తుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటో అర్థమవుతుందంటూ మండిపడ్డారు. నిజరూప దర్శనం చేసుకునేందుకు వచ్చిన అవంతి కుటుంబ సభ్యులను గర్భాలయం వద్ద ఆలయ సిబ్బంది అడ్డుకున్నారు. గర్భగుడిలోకి వెళ్లకుండానే తీవ్ర మనస్తాపంతో వెనుదిరిగారు. బయటకొచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఈవో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. క్యూలైన్లలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారంటున్నారు. అధికార టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతల సేవలోనే ఈవో ఉన్నారు తప్ప భక్తులను, ఇతరులను పట్టించుకునే పరిస్థితి లేదని మండిపడ్డారు. సింహగిరిని తిరుమల వలే అభివృద్ధి చేయాలి సింహాద్రి అప్పన్న క్షేత్రాన్ని రానున్న రోజుల్లో తిరుమల వలే అభివృద్ధి చేయాల్సి ఉందని వైఎస్సార్ సీపీ భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. గతంలో చేసిన మాస్టర్ ప్లాన్ మూలనపడిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దివ్యక్షేత్రంగా సింహగిరిని తీర్చదిద్దడం జరుగుతుందన్నారు. పంచగ్రామాల భూసమస్యను పరిష్కరిస్తామన్నారు. చందనోత్సవంలో మీడియాపై ఆంక్షలుపెట్టడం సరికాదన్నారు. -
అప్పన్న సన్నిధిలో రామ
అజర్బైజాన్, హైదరాబాద్ చుట్టొచ్చాక వైజాగ్ వెళ్లారు రామ్‌చరణ్. సినిమా ఫ్యామిలీతో కలసి సింహాచలం అప్పన్నను దర్శించుకున్నారు. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను ఓ చిత్రం తెరక్కెకిస్తున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ కథానాయిక. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం వైజాగ్‌లోని సింహాచలం గుడిలో జరుగుతోంది. రామ్‌చరణ్, ఆర్యన్ రాజేశ్‌పై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. ఈ షెడ్యూల్లో ఎక్కువ కుటుంబానికి సంబంధించిన సీన్స్ ఉంటాయని సమాచారం. రామ్ చరణ్‌కు అన్నయ్యలుగా ‘జీన్స్’ ఫేమ్ ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్ కనిపించనున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. వివేక్ ఒబెరాయ్ విలన్‌గా కనిపించనున్నారు. దసరాకు ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ చేయనున్నారని టాక్. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
గిరి ప్రదక్షణతో సందడిగా సింహగిరి పుణ్యక్షేత్రం
-
ప్రియా గార్డెన్స్‌లో నాగజెర్రి కలకలం
సింహాచలం(పెందుర్తి): తొమ్మిది అడుగుల నాగజెర్రి సోమవారం రాత్రి సింహాచల దేవస్థానం ఇన్చార్జి ప్రధానార్చకుడు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు ఇంట్లో కలకలం సృష్టించింది. రాత్రి 8 గంటల సమయంలో నాగజెర్రి స్థానిక ప్రియాగార్డెన్స్లో నివసిస్తున్న అర్చకుని ఇంట్లో మేడ మెట్ల కిందకి వెళ్లడాన్ని పులువురు స్థానికులు చూశారు. విషయాన్ని గోపాలకష్ణమాచార్యులకు తెలియజేశారు. దేవస్థానంలోనే పనిచేస్తున్న అలంకారి కరి సీతారామాచార్యులు(ఈయన స్నేక్ క్యాచర్)కు ఫోన్లో సమాచారం అందించారు. ఆయన వచ్చి చాకచక్యంగా పాముని పట్టుకుని సమీప తోటల్లో విడిచిపెట్టారు. -
అప్పన్న దూరదర్శన్
సింహాచలం అప్పన్న నిజరూపదర్శన భాగ్యం కలిగేది ఒకే ఒక్క రోజు.. ఏడాదంతా చందన శోభితుడైన సింహాచలేశుడు.. ఆ గంధపు పూత నుంచి బయల్వెడలి నిజరూప దర్శనం కల్పించేరోజు. అది చందనోత్సవం రోజు. అంత శుభప్రదమైన దినాన దురదృష్టం కొద్దీ సింహాచల ఆలయ అధికారుల నిజ(స్వ)రూపం బట్టబయలై భక్తులను ఆవేదనకు గురి చేసింది. ఆలయ అధికారులు, దళారులు ఇదే తడవుగా చందనస్వామి దర్శనాన్ని స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవడం.. నిష్కర్షగా చెప్పాలంటే అయినకాడికి డబ్బులు దండుకోవడం భక్తజనకోటికి మనోక్లేశాన్ని మిగిల్చింది. సంపన్నులకు, అస్మదీయులైన వీఐపీలకు దగ్గరుండి అంతరాలయ దర్శనాలు చేయించిన అధికారులు, దళారులు.. సామాన్యభక్తులకు ‘దూరదర్శన’ భాగ్యం మాత్రమే కల్పించడం విమర్శలకు తావిచ్చింది. 20 అడుగుల దూరం నుంచి కేవలం లిప్తపాటు దర్శనం కల్పించిన అధికారుల తీరు సర్వదా ఖండనలను పాత్రమైంది. అయితేనేం.. ఏదైనా తమకేంటన్న అధికారుల తీరు మారకపోవడమే విస్తుగొలిపింది. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఏ దేవాలయంలోనైనా మూలమూర్తి ఏడాదంతా ఒకే రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. కానీ ఏడాదంతా చందనపు పూతల చాటున ఉంటూ నిత్యరూపంతో పూజలందుకునే సింహగిరిపై కొలువైన వరాహ లక్ష్మీనృసింహస్వామి వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రం నిజరూపంలో సాక్షాత్కరిస్తారు. ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా నిజరూపాన్ని దర్శించి తరించేందుకు లక్షలాది మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి మంగళవారం అర్ధరాత్రి నుంచే సింహాచలం చేరుకున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి ఆలయ అధికారులు కేవలం లిప్తపాటు మాత్రమే దర్శనానికి అనుమతినివ్వడం, భక్తులతో అనుచితంగా ప్రవర్తించడం, వీఐపీలకు, దళారులకు మాత్రమే అంతరాలయ దర్శన ఏర్పాట్లు చేయడంతో ఈ ఏడాది కూడా ఆలయనిబంధనలకు, భక్తుల మనోభావాలకు విరుద్ధంగా చందనోత్సవ నిర్వహణ జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఆలయ వంశపారంపర్య అనువంశిక ధర్మకర్త, కేంద్ర మాజీ మంత్రి అశోకగజపతిరాజు దంపతులు, కుటుంబసభ్యుల తొలి దర్శనం తర్వాత అర్ధరాత్రి 2.15 గంటలకు భక్తులకు దర్శనాలు ప్రారంభించారు. మంగళవారం రాత్రి నుంచే క్యూల్లో ఉన్న భక్తులను దర్శనానికి అనుమతిస్తూనే ఒక్కసారిగా వీఐపీల గేట్లు తెరిచేశారు. ప్రొటోకాల్‌కు విరుద్ధంగా.. ’గంట’లసేపు మంత్రులు, న్యాయమూర్తులు, ఐఏఎస్ అధికారులు, వీఐపీలు తదితర ప్రముఖులకు ఉదయం 5 నుంచి 6 గంటల వరకు అనుమతిస్తామని స్వయంగా మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు ఈవో చంద్రమోహన్ కొద్దిరోజులుగా ప్రకటిస్తూ వచ్చారు. చందనోత్సవం రోజు వచ్చేసరికి ప్రొటోకాల్ నిబంధనలన్నీ గాల్లోకి ఎగిరిపోయాయి. తెల్లవారుజాము 3 గంటల నుంచే ప్రొటోకాల్ దర్శనాలు మొదలైపోయాయి. దీంతో రూ.500, రూ.200లు టికెట్లు కొనుక్కొని క్యూల్లో నిలుచున్న భక్తులకు కష్టాలు మొదలయ్యాయి. ఆయా టికెట్లకు తొందరగానే దర్శనం అందుతుందని చెప్పిన అధికారులు తీరా ప్రొటోకాల్ దర్శనాల దెబ్బకు మూడు, నాలుగు గంటలపైనే పట్టింది. ఇక ఏకంగా మంత్రి గంటా శ్రీనివాసరావు తెల్లవారుజామున 3 గంటలకు పది వాహనాల్లో సుమారు 70 మందినిపైగా తీసుకుని వచ్చి ఆలయంలో హల్చల్ చేశారు. దాదాపు గంటకు పైగా ఆయన ఆలయంలోనే ఉండిపోవడంతో క్యూలైన్లన్నీ స్తంభించిపోయాయి. ఆయన ఆలయంలో ఉన్నంతసేపు క్యూలైన్లు కదల్లేదు. ఆ తర్వాత గంటా సతీమణి ఓ 30 మందిని తీసుకుని ఆలయంలోకి వచ్చారు. అప్పుడు కూడా సామాన్య భక్తుల క్యూలైన్లు నిలిచిపోయాయి. ప్రొటోకాల్ దర్శనాల వేళలకు ముందుగానే అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ ఓ మంది అనుచరులతో వచ్చి ఆలయంలో హడావుడి చేశారు. సామాన్య భక్తులకు లిప్తకాలం.. ఆలయ సిబ్బంది దూషణ పర్వం సింహాచలం అప్పన్న ఆలయ ఆచారాలకు విరుద్ధంగా భక్తులకు ఈసారి కేవలం ఒకటి రెండు సెకన్ల పాటే దర్శనం కల్పిస్తూ అధికారులు, ఆలయ సిబ్బంది ఓవర్ యాక్షన్ చేశారు. లఘుదర్శనం అని ప్రకటించినప్పటికీ ఎంతోదూరం నుంచి వచ్చిన భక్తులను అర నిమిషం కాదు కదా.. పదిసెకన్లు కూడా దర్శనానికి అనుమతివ్వకుండా లాగిపడేశారు. ఒకింత వారించిన భక్తులపై సిబ్బంది దూషణ పర్వానికి దిగారు. స్వామి వారి విగ్రహం ఎదురుగూండానే పత్రికల్లో రాయలేని భాష పదేపదే ప్రయోగిస్తూ ఆలయ సిబ్బంది సామాన్యభక్తులపై ప్రతాపం చూపించారు. డిప్యుటేషన్ సిబ్బంది ఎక్కడ? చందనోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ ఆలయాల నుంచి 150 మంది దేవాదాయ, ధర్మాదాయశాఖ ఉద్యోగులు డెప్యూటేషన్‌పై ఇక్కడకు వచ్చారు. విధి నిర్వహణలో మాత్రం వారు ఎక్కడున్నారు.. ఏం చేశారన్నది మాత్రం ఎవరికీ తెలియదు. విధుల కేటాయింపులో పక్కా ప్రణాళిక లేకపోవడంతో చాలా మంది విధులు నిర్వర్తించకుండా ఎవరి పనివారు చూసుకున్నారన్న వాదనలు ఉన్నాయి, పర్యవేక్షించాల్సిన ఈవో రామచంద్రమోహన్ వీఐపీల సేవలో తరించడం, మిగిలిన అధికారులు ప్రొటోకాల్ సేవల్లో మునిగిపోవడంతో డిఫ్యూటేషన్ సిబ్బంది ‘â¶పని’తనం గురించి పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు. రూ. వెయ్యి టిక్కెట్లు ఎన్ని? వెయ్యి రూపాయల వీఐపీ టికెట్లను ఈసారి 8 వేలు ముద్రించామని, బ్యాంకుల్లోనే విక్రయాలు చేస్తామని అధికారులు చెబుతూ వచ్చారు. ఆ మేరకు బ్యాంకుల్లో మంగళవారం సాయంత్రం వరకు విక్రయాలు చేశారు. బుధవారం ఆయా టికెట్లు తీసుకొచ్చిన వారి సంఖ్య 15 వేల మందికిపైగానే ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 8 వేల టికెట్లు ముద్రిస్తే 15 వేల మంది ఎలా వచ్చారు.. బ్లాక్‌లో టికెట్ల విక్రయాలు పక్కనపెడితే ఎవరైనా నకిలీ టికెట్లు ముద్రించారా... అధికారులకు తెలిసే ఇదంతా జరిగిందా.. అన్న వాదనలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి, ఈ టికెట్లపై స్వయంగా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. తీరుమారని రామచంద్ర? అప్పన్న ఆలయ కార్యనిర్వహణాధికారిగా కె.రామచంద్రమోహన్ ఐదేళ్లుగా ఇక్కడే పాతుకుపోయారు. వాస్తవానికి రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఓ ఈవో ఐదేళ్లపాటు నిరాటంకంగా కొనసాగడం అనేది ఎక్కడా లేదు.. కానీ రామచంద్రమోహన్ శైలే వేరు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ముఖ్యనేతల అడుగులకు మడుగులొత్తుతూ నిరాటంకంగా ఐదేళ్లుగా ఉన్నారంటేనే ఆయన పైరవీల ప్రతిభ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. ఎన్ని ఆరోపణలు వచ్చినా.. ఎన్ని విమర్శలు వచ్చినా చలించని ఈవో ఈ ఏడాది మాత్రం విమర్శలకు తావివ్వకుండా దర్శన ఏర్పాట్లు చేస్తామని ప్రకటిస్తూ వచ్చారు. కానీ చందనోత్సవం రోజు వచ్చిసరికి తనదైన రీతినే కొనసాగించారు. యథావిధిగా వీఐపీల సేవలోనే తరించారు. ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా వేళ కాని వేళల్లో వీఐపీలను గంటల తరబడి అనుమతించారు. సర్వదర్శనానికి, టికెట్లు కొనుగోలు చేసి వచ్చిన భక్తులకు అవసరమైన ఏర్పాట్ల గురించి కనీసమాత్రంగా కూడా పట్టించుకోలేదు. -
అప్పన్న చందనోత్సవంలో దివ్యాంగులకు ఇబ్బందులు
-
‘దేవాలయాల్లో రాజకీయ పెత్తనం ఎక్కువైంది’
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం
సింహాచలం(పెందుర్తి) : చందనచర్చిత స్వామి నిజరూప దర్శన వేళ. సింహాద్రి అప్పన్న చందనోత్సవం వైభవంగా ప్రారంభమైంది. వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ)ను పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజాము 4 గంటల నుంచి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దివ్యరూపాన్ని భక్తులు దర్శించుకుని తరిస్తున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు, భార్య సునీలా గజపతిరాజు, సుధా గజపతి రాజు, మాజీ ఎంపీ ప్రదీప్ చంద్రదేవ్ తదితరులు స్వామివారి తొలి దర్శనాన్ని చేసుకున్నారు. మరోవైపు టీటీడీ నుంచి ఈవో అశోక్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు, డాలర్ శేషాద్రి... స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే మంత్రి గంటా శ్రీనివాసరావు సింహాద్రి అప్పన్నకు చందనం, పట్టువస్త్రాలు సమర్పించగా, విజయవాడ కనకదుర్గ ఆలయం నుంచి ఈఓ పద్మ పట్టువస్త్రాలు అందచేశారు. ఇక ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు కుటుంబీకులు, హోంమంత్రి చినరాజప్ప, ఆయన కుటుంబసభ్యులు మంత్రి గంటా కుటుంబీకులు స్వామివారి నిజరూపాన్ని దర్శించుకున్నారు. ఒంటి గంట నుంచి వైదిక కార్యక్రమాలు బుధవారం వేకువజామున ఒంటి గంట నుంచి చందనోత్సవ వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు ప్రారంభించారు. సుప్రభాత సేవ అనంతరం వెండి బొరుగుతో స్వామిపై ఉన్న చందనాన్ని ఒలిచారు. అనంతరం ఆరాధన నిర్వహించి తొలి దర్శనాన్ని దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజుకు అందించారు. తదుపరి ఇతర ప్రముఖులకు దర్శనం అనంతరం తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులనుదర్శనాలకు అనుమతించారు. రాత్రి 9 గంటల నుంచి సహస్ర ఘటాభిషేకం రాత్రి 9 గంటల నుంచి సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహిస్తారు. గంగధార నుంచి 1000 కలశాలతో నీటిని తీసుకొచ్చి శ్రీ వైష్ణవస్వాములు నృసింహస్వామి వారి నిజరూపాన్ని అభిషేకిస్తారు. అనంతరం అర్చకులు తొలివిడత చందనాన్ని సమర్పిస్తారు. విధుల్లో 1200మంది పోలీసులు చందనోత్సవాన్ని పురస్కరించుకుని పలు శాఖల సమన్వయంతో దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికారులు సన్నాహాలు చేశారు. నగర సంయుక్త పోలీస్ కమిషనర్ రవికుమార్ మూర్తి ఏర్పాట్లు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ దాదాపు 12 వందల మంది పోలీసులు చందనోత్సవ విధుల్లో ఉంటారని తెలిపారు. వారికి షిఫ్టులు కేటాయించామన్నారు. దేవస్థానం సిబ్బందితో సమన్వయం చేసుకుని బందోబస్తు నిర్వహించాలని సూచించారు. పరిశీలించిన ఇన్చార్జి కలెక్టర్ సృజన, కమిషనర్ హరినారాయణన్ సింహగిరిపై చందనోత్సవ ఏర్పాట్లను విశాఖ ఇన్చార్జి కలెక్టర్ సృజన పరిశీలించారు. ఆలయ నీలాద్రి గుమ్మం, దక్షిణ మార్గం, ఉత్తర ద్వారం, భక్తులు వేచి ఉండే క్యూలను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవం నిర్వహిస్తామన్నారు. జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ కొండ దిగువన పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పకడ్బందీగా ఏర్పాట్లు : మంత్రి గంటా చందనోత్సవంలో సాధారణ భక్తులకు ఎలాంటి ఆటంకం, అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. చందనోత్సవ ఏర్పాట్లను ఆయన నిన్న పరిశీలించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. బందోబస్తుకు చేరుకున్న పోలీసులు చందనోత్సవం సందర్భంగా విధులు నిర్వర్తించాల్సిన పోలీసులు నిన్న సాయంత్రానికే సింహగిరికి చేరుకున్నారు. పాత గోశాల జంక్షన్, పాత అడవివరం జంక్షన్ నుంచి ఎలాంటి వాహనాలు అడవివరం ప్రధాన రహదారిలో ప్రవేశించకుండా చర్యలు చేపట్టారు. చందనోత్సవ దర్శన సమయాలు ఉచిత దర్శనం : తెల్లవారుజాము 4 గంటల నుంచి రూ.200, 500 టిక్కెట్ల దర్శనం : ఉదయం 4గంటల నుంచి ప్రొటోకాల్ వీవీఐపీల దర్శనాలు : ఉదయం 5 నుంచి 6గంటల వరకు, 8 గంటల నుంచి 9 గంటల వరకు రూ.1000 వీఐపీల దర్శనాలుః ఉదయం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు, ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, సాయంత్రం 2 గంటల నుంచి 3 గంటల వరకు -
ప్రేక్షకులు మెచ్చుకునే సినిమాలు తీస్తా..
సాక్షి, సింహాచలం(పెందుర్తి): ప్రేక్షకులు మెచ్చుకునే సినిమాలు తీయడానికే తాను ప్రాధాన్యత ఇస్తానని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు తెలిపారు. సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని సోమవారం ఆయన దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఏడాది ఆరు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామన్నారు. ప్రేక్షకులు వాటిని ఆదరించారు. కమర్షియల్‌గా కూడా సక్సెస్ అయ్యాయని అన్నారు. మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని తెలిపారు. ఈ ఏడాది కూడా నాలుగు ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయన్నారు. మహేష్‌బాబు హీరోగా ఓ సినిమా ప్రారంభించామని ఆయన తెలిపారు. అలాగే నితిన్ హీరోగా శ్రీనివాస కల్యాణం, రామ్ హీరోగా ఒక సినిమా, మరో సినిమా కూడా తీస్తున్నామన్నామని చెప్పారు. గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మంచి సినిమాలు తీయడానికి ప్రయత్నం చేస్తామన్నారు. ఈసందర్భంగా ఆయన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో అష్టోత్తరంపూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ ఉత్తరరాజగోపురంలో జరిగిన శ్రీనృసింహ దీక్షల విరమణ కార్యక్రమాన్ని తిలకించి స్వామిని దర్శించుకున్నారు. శ్రీనృసింహ దీక్షల విరమణ కార్యక్రమంలో రావడం అదృష్టంగా భావిస్తానని తెలిపారు. చిరంజీవి సేవాసమితి అధ్యక్షుడు లంక సూరిబాబు ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
‘సింహాచలం’ భూమిపై తప్పుడు పత్రాలు
పెందుర్తి: విశాఖపట్నం జిల్లా సింహాచలం దేవస్థానం కేంద్రంగా ఓ భారీ కుంభకోణం బట్టబయలైంది. దేవస్థానం భూమిని తమ పేరున తప్పుడు పత్రాలు సృష్టించి వాటితో రూ.34 కోట్లు బ్యాంక్ రుణం పొందిన ముఠాను పెందుర్తి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. విశాఖ నగర నార్త్ జోన్ ఏసీపీ ఎల్.అర్జున్ వెల్లడించిన మేరకు వివరాలిలా ఉన్నాయి.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన జోక విష్ణు దుర్గాప్రసాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఈ నేపథ్యంలో తన వద్ద పనిచేస్తున్న కాకినాడకు చెందిన బోదసకుర్తి గొల్లయ్యకాపు పేరిట సింహాచలం దేవస్థానానికి చెందిన సర్వే నంబరు 3/ఎ4లో దాదాపు ఆరెకరాలకు పట్టా చేయించాడు. దీనికి ఆరిలోవ సర్వే ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న గేదల లక్ష్మిగణేశ్వరరావు సహకరించి నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకం, టైటిల్ డీడ్ సృష్టించారు. అనంతరం భూమిని గొల్లయ్య భార్య వరసత్యవేణి పేరిట గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించారు. వీటిని ఆధారంగా హైదరాబాద్‌లో విన్‌డేటా సొల్యూషన్స్ పేరుతో కంపెనీ పెడుతున్నట్లు చెప్పి బంజారాహిల్స్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.34 కోట్లు రుణం తీసుకున్నారు. నిందితుడు తొలి వాయిదా నుంచే నగదు చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు ఆరా తీశారు. తనఖా పెట్టింది దేవస్థానం భూమి అని తేలడంతో 2014 ఆగస్టులో విషయాన్ని దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్‌కు చెప్పారు. ఆయన పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నిఘాపెట్టి నిందితుడు గొల్లయ్యను పట్టుకున్నారు. అతడి ద్వారా మిగిలిన వారి ఆచూకీ తెలుసుకొని వారినీ అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో గొల్లయ్య, దుర్గాప్రసాద్, శ్రీనివాస్, వీరాస్వామిలను అరెస్ట్ చేయగా కీలకపాత్రధారి గణేశ్వరరావు పలు భూ కుంభకోణం కేసుల్లో ఇప్పటికే జైల్లో ఉన్నాడు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఏసీపీ వెల్లడించారు. -
దేవుడి ఉంగరాన్నే దొంగిలిస్తారా?
-
దర్శనానికి వచ్చి దేవుడి ఉంగరాన్నే దొంగిలిస్తారా?
సింహాచలం(విశాఖపట్టణం): ’దర్శనానికి వచ్చి స్వామివారి ఉంగరాన్నే దొంగలిస్తారా... అదేం పని...దొంగిలించిన ఉంగరాన్ని మర్యాదగా ఇచ్చేయండి. లేదంటే మిమ్మల్ని పోలీసులకు అప్పగిస్తాం..’ అంటూ బుధవారం సింహగిరికి వచ్చిన పలువురు భక్తులను దేవస్థానం స్థానాచార్యులు ప్రశ్నించేసరికి వారంతా కంగుతిన్నారు. ‘మేం దొంగల్లా కనిపిస్తున్నామా... స్వామి దర్శనానికి వస్తే ఉంగరాన్ని దొంగతనం చేస్తారంటారేంటి? పైగా తాళ్లతో బంధిస్తారా... ’అంటూ భక్తులు తట్టుకోలేని ఆవేశంతో స్థానాచార్యులని ఎదురు ప్రశ్నించారు. ‘చూడండి... మీరు దొంగతనం చేసినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి. మీరు ఉంగరాన్ని తీసిన దృశ్యం మా సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. పోలీసులు తీసుకెళ్లకముందే ఉంగరాన్ని మర్యాదగా ఇచ్చేయండి.. ’అంటూ స్థానాచార్యులు మరింత గద్దించి అడగడంతో భక్తుల కళ్లంట నీళ్లు గిర్రున తిరిగాయి. తాము దొంగలం కాదని ఎంతచెబుతున్నా వినకుండా మీరే దొంగ అని స్థానాచార్యులు పదేపదే అనడంతో వారంతా కోపోద్రేకాలతో చిందులు వేశారు. చివరికి ఇదంతా వినోదోత్సవంలోని ఘట్టాలని తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. తమకు మాత్రమే దక్కిన భాగ్యంగా భావించి ఆనందభరితులయ్యారు. ఇదీ... సింహగిరిపై బుధవారం నవ్వుల సందడిగా జరిగిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి వినోదోత్సవం. ఈనెల 6 వతేదీ నుంచి వారం రోజుల పాటు జరుగుతున్న స్వామివారి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మృగయోత్సవంలో పోయిన స్వామివారి ఉంగరాన్ని వెతికే ఘట్టాన్ని బుధవారం ఉదయం వినోదోత్సవంగా నిర్వహించారు. ఏడు పరదాల్లో దాగున్న స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని రాజగోపురం వద్ద పల్లికీలో ఆశీనింపజేశారు. స్వామివారి దూతగా అర్చకుడు సీతారామాచార్యులు కర్రను చేతితో పట్టుకుని దర్శనానికి వచ్చిన పలువురు భక్తులను ఉంగరం దొంగిలించారంటూ తాళ్లతో బంధించి రాజగోపురం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ దొంగిలించిన ఉంగరాన్ని ఇవ్వాలంటూ వారిని ప్రశ్నల వర్షం కురిపించారు. ఉత్సవం గురించి తెలియని వాళ్లు కన్నీటిపర్యవంతం చెందగా, ఉత్సవ విశేషాలు తెలిసిన వాళ్లు నవ్వుతూ సమాధానం చెప్పారు. ఈ తరుణంలోనే స్వామిపై ఉన్న ఒక్కొక్క పరదాని తొలగించారు. చివరికి ఆయన చివరి పరదాలోనే ఉంగరం దొరికింది. విశాఖ గీతం కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం పరీక్షలు రాసి స్వామివారి దర్శనానికి వచ్చిన కాకినాడకి చెందిన హారిక, హోటల్‌మేనేజ్‌మెంట్ కోర్సు చేస్తున్న ఖరగ్‌పూర్‌కు చెందిన వరలక్ష్మి, వేపగుంటకి చెందిన సంధ్య, హనుమాన్ జంక్షన్‌కి చెందిన దిలీప్, విశాఖ ఆర్కెబీచ్కి చెందిన శ్వేతాకన్నా, కన్నప్రియ, షర్మిళ, ప్రహ్లాదపురంనకు చెందిన హాసిని, గోపాలపట్నంనకు చెందిన హైమావతి, ఢిల్లీకి చెందిన నాగభూషణం దంపతులు, కోయంబత్తూరు నగల వ్యాపారి ఆర్.ఎస్. గోపాల్చెట్టుమర, విశాఖలోని సాగర్ దుర్గా హాస్పటల్ ఈఎన్టీ వైద్యుడు బాపారావు అండ్ ఫ్యామిలి ఫ్రెండ్స్, సినీ నిర్మాత కొర్రపాటి సాయి, పలువురు నూతన దంపతులు, దేవస్థానం కొత్వాల్‌నాయక్, ప్రధానార్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు, గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఏఈవో ఆర్.వి.ఎస్. ప్రసాద్, పీఆర్ఓ జైముని, వినోదోత్సవంలో ఉంగరం దొంగలుగా చిత్రీకరింపబడ్డారు. అలాగే, ఉంగరం దొంగలెవరని ప్రశ్నించిన స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ కూడా ఉత్సవం ప్రారంభంలో ఉంగరం దొంగగా చిత్రీకరింపబడటం విశేషం. ఆయన్ని కూడా తాళ్లతో బంధించారు. -
అందుకే వారికి మంత్రి పదవులిచ్చాను
-
అందుకే వారికి మంత్రి పదవులిచ్చాను: చంద్రబాబు
విశాఖ : పార్టీ ఫిరాయింపులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు నోరు విప్పారు. పార్టీ ఫిరాయింపులపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని, అది మంచిదే అని ఆయన అన్నారు. టీడీపీ నుంచి తలసాని శ్రీనివాసయాదవ్ టీఆర్ఎస్లోకి వెళ్లేటప్పుడు తాను ఫిరాయింపులపై మాట్లాడానని, అయితే అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరని చంద్రబాబు సమర్థించుకున్నారు. ఫిరాయింపుదారుల రాజీనామాలు స్పీకర్ పరిధిలో ఉన్నాయని ఆయన తెలిపారు. పార్టీ ఫిరాయించి తమ దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యేల్లో సమర్థులు ఉన్నారని, అందుకే వారికి మంత్రి పదవులు ఇచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. మంత్రివర్గ విస్తరణలో అందరికి న్యాయం చేయలేకపోయామన్నారు. (కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి ఆ తర్వాత పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలలో నలుగురికి చంద్రబాబు కేబినెట్లో స్థానం కల్పించిన విషయం తెలిసిందే) రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే మంత్రివర్గ విస్తరణ జరిగిందన్నారు. మంత్రి పదవులు రానివారు అసంతృప్తికి గురి కావద్దని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు రాజకీయాలు కాదని రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమన్నారు. అలాగే మంత్రుల పనితీరుపై ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్ష ఉంటుందన్నారు. ఇవాళ్టి నుంచి మంత్రుల పనితీరుపై పోటీ ఉంటుందని ఆయన తెలిపారు. సింహాచలం పంచగ్రామల భూ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. విశాఖ పర్యటనలో భాగంగా శనివారం ఆయన సింహాద్రి అప్పన్న దర్శించుకున్నారు. అంతకు ముందు సింహాచలం దేవస్థానానికి చెందిన గోశాలలో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభించారు. స్వామివారి దర్శనం అనంతరం సీఎం... దేవస్థానంలో డార్మిటరీ కమ్ ఫంక్షన్ హాలు, తొలిపావంచా, కల్యాణమండపం నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ విశాఖ రైల్వేజోన్ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. త్వరలోనే సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖలో విద్యాసంస్థలు, ఆస్పత్రులు పెట్టేందుకు అనేకమంది ముందుకు వస్తున్నారన్నారు. విశాఖను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, విశాఖలాంటి నగరం దేశంలో మరెక్కడా లేదని అన్నారు. 2019లో నియోజకవర్గాల పునర్ విభజన జరుగుతుందని చంద్రబాబు అన్నారు. దేశంలోని ఎన్నికలన్నీ ఒకేసారి జరగాలని, అలాగైతే అభివృద్ధికి ఆటంకం ఉండదని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు వెంట మంత్రులు గంటా శ్రీనివాసరావు, మాణిక్యాలరావు, పలువురు పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా ఈ కార్యక్రమానికి పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి దూరంగా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో మంత్రిపదవిని ఆశించిన బండారు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అప్పటి నుంచి ఆయన ఎవరికీ అందుబాటులోనికి రాకుండా అజ్ఞాతంలో ఉన్నారు. జిల్లాలో సీఎం పర్యటనకు కూడా గైర్హాజరు అయ్యారు. -
16 వేల మెజారిటీ.. 16 వేల కొబ్బరికాయలు
అప్పన్నకు మొక్కు చెల్లించిన ఒడిశా ఎమ్మెల్యే సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామికి గురువారం ఒడిశాలోని గంజాం జిల్లా సొరడ నియోజకవర్గం ఎమ్మెల్యే పూర్ణచంద్ర స్వైన్ 16 వేల కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించారు. ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యులు, అనుచరులతో గురువారం సింహాచలానికి వచ్చారు. ఆలయ ధ్వజస్తంభం ప్రాంగణంలో అమ్మవారి సన్నిధి వద్ద కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. 2014లో జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడి తరఫున పోటీ చేసిన పూర్ణచంద్ర తనకు ఎంత మెజార్టీ వస్తే అన్ని కొబ్బరికాయలు కొడతానని అప్పన్నకు మొక్కుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆయన 16 వేల ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థిపై గెలుపొందారు. దీంతో ఆయన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామికి గురువారం 16 వేల కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. -
500 కిలోల చందనం పూత...
సింహాచలం ఆలయానికి ఏ రోజు వెళ్లినా స్వామిని చాలా దగ్గరగా దర్శించుకోవచ్చు. చందనం అలమిన దేహం, పట్టుబట్టలూ, వజ్రాల నగలూ, తులసి మాలలూ... ఆయన ఆకారం పెద్ద లింగంలా ఉంటుంది. కానీ, ఆ చందనపు పొరల క్రింద చిన్న నిజరూప విగ్రహం ఉంటుంది. వరాహ-నరసింహుని విగ్రహం. స్వామి నిజరూప దర్శనభాగ్యం సంవత్సరంలో కేవలం ఒక్క వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే లభిస్తుంది. ఆ పుణ్య తిథి ఈ నెల 9వ తేదీ.. సోమవారం. ఆ రోజే చందనోత్సవం. వరాహ ముఖం, మనిషి మొండెం, సింహం తోక, రెండు చేతులు, నేలలో దాగివున్న పాదాలు... ఈ నిజరూప స్వామి దర్శనం ఏడాదికి ఒక్కసారి కేవలం అక్షయ తృతీయ నాడు మాత్రమే కొన్ని గంటల సేపు చందనం తీసి వేయగా లభిస్తుంది. ఆ వేళకు లక్షలాది భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని తరిస్తారు. టన్నుల కొద్దీ చందనం మొక్కులు తీర్చుకుంటారు. మళ్లీ అర్చనాదులు పూర్తిచేసి, దర్శన భాగ్యం భక్తులకు కల్పించి తిరిగి చందనం లేపనం చేస్తారు. చందనం లేపనం తర్వాత స్వామి లింగాకారుడుగా దర్శనమివ్వడం అద్వైత దర్శనానికి ప్రతీక. స్వామి నుంచి తీసిన చందన ప్రసాదాన్ని ముఖాన ధరించి, కొంత చందనాన్ని నీటిలో కలిపి తీర్థంగా సేవిస్తే దీర్ఘరోగాలు తగ్గిపోతాయని భక్తుల అపార నమ్మకం. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో సింహాచల పుణ్యక్షేత్రం ఒకటి. అత్యంత ప్రాచీనమైన క్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం క్షేత్రం విశాఖపట్నానికి 16 కిలోమీటర్ల దూరంలో, సముద్రమట్టానికి 800 అడుగుల ఎత్తులో ఉంది. సింహాకారంలో ఉన్న కొండపై వరాహ, నారసింహ రూపాలను ఒక్కటిగా చేసుకుని శ్రీమహా విష్ణువు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిగా దర్శనమిచ్చే మహా పుణ్యక్షేత్రం ఇది. సుజల, సుఫల, సస్యశ్యామల ప్రశాంత వాతావరణంలో ఈ క్షేత్రం నెలకొని ఉంది. చుట్టూ కొండలు, అనాస, జీడి, మామిడి, సంపెంగ వనాల మధ్య ఈ క్షేత్రం విరాజిల్లుతోంది. వరాహం, నారసింహం... హిరణ్యాక్షుణ్ణి సంహరించిన వరాహావతారం, హిరణ్యకశిపుని సంహరించిన నారసింహ అవతారాల కలయికే శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి. హిరణ్యకశిపుని వధించాక లక్ష్మీదేవితో కలిసి ప్రహ్లాదునితో పూజలందుకుంటూ సింహాచల క్షేత్రంలో శాంతమూర్తిగా ఉంటానన్నాడట స్వామి. ఆ విధంగా శ్రీ లక్ష్మీ వరాహ నారసింహ స్వామి సింహాచల క్షేత్రంపై వెలసి భక్త సులభుడుగా పూజలందుకుంటున్నాడు. విహంగవీక్షణంలో సింహాకారంలో ఈ కొండ ఉండటంతో సింహగిరిగా కూడా ఈ క్షేత్రం పిలువబడుతోంది. అద్భుతమైన శిల్పసంపద, రాతి కట్టడాలతో ఆలయం కనువిందు చేస్తుంది. ఆలయంలోని బేడా మండపం, కల్యాణమండపం, ఆస్థానమండపం, భోగమండపం, అంతరాలయంలో ప్రహ్లాదమండపం, రాజగోపురం ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఆలయంలోనే ఎంతో మహిమ గల కప్పస్తంభం ఉంది. సంతాన వేణుగోపాలస్వామి యంత్రాన్ని ప్రతిష్ఠించిన ఈ స్తంభాన్ని మొక్కుకుంటే కోరిన కోర్కెలు ఫలిస్తాయన్న నమ్మకం. ఈ క్షేత్రంలోనే ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న గంగధార నిత్యం నీటితో కళకళలాడుతుంటుంది. పురూరవుడు నిర్మించిన ఆలయం హిరణ్యకశిపుడి కోపోద్రేకానికి గురై, విశాఖ పూర్వ సముద్రంలో పడవేయబడ్డ ప్రహ్లాదుణ్ణి రక్షించేందుకు శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి జారుతున్న వస్త్రాన్ని ఒక చేతితోను, మరొక చేతితో గరుత్మంతునికి అమృతాన్ని అందిస్తూ అమితవేగంతో ఒక్కసారిగా సింహగిరిపైకి దూకి ప్రహ్లాదుణ్ణి రక్షించాడు. ప్రహ్లాదుడి కోరిక మేరకు స్వామి సింహగిరిపైనే ఉండి, కొంతకాలం పూజలు అందుకున్నాడు. ప్రహ్లాదుడు అనంతరం పూజలు చేసేవారు కరువై మరుగునపడ్డ స్వామిపై పెద్ద పుట్ట వెలసింది. కొంత కాలానికి షట్చక్రవర్తులో ఒకరైన పురూరవ చక్రవర్తి ఆకాశమార్గంలో విహరిస్తున్నప్పుడు ఆయన వాహనం ఈ కొండపై ఆగిపోయింది. ఆ రోజు రాత్రి పురూరవుడు సింహగిరిపైనే నిద్రించినప్పుడు స్వప్నంలో సాక్షాత్కరించిన స్వామి పుట్టలో తాను దాగివున్న విషయాన్ని తెలిపాడు. పుట్టను తొలగించి ఆలయాన్ని నిర్మించాలని ఆజ్ఞాపించాడు. పుట్ట మన్నుకు బదులుగా తనపై చందనాన్ని వేయాలని, ఏడాదంతా చందనంతో నిత్యరూపంతోనూ, ఒక్క వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రం చందనం మణుగుల్లో నుంచి బయటకి వచ్చి నిజరూప దర్శనమిస్తానని తెలియజేశాడు. స్వామి ఆజ్ఞ ప్రకారం పురూరవుడు పుట్టను తొలగించి స్వామిని సేవించాడు. స్వామికి ఆలయాన్ని నిర్మించాడు. పురూరవుడు స్వామిపై ఉన్న పుట్టను తొలగించిన రోజే వైశాఖ శుద్ధ తదియ పర్వదినం. దీంతో ఈ రోజున ప్రతీ ఏటా ఈ క్షేత్రంలో చందనోత్సవంను వైభవంగా నిర్వహిస్తారు. ఏడాదిలో నాలుగు విడతల్లో చందన సమర్పణ... ఏడాదిలో నాలుగు విడతలుగా మూడు మణుగుల (సుమారు 125 కిలోలు) చొప్పున చందనాన్ని (మొత్తం 500 కిలోలు) స్వామికి సమర్పిస్తారు. చందనోత్సవం రోజు రాత్రి, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో ఉదయం వేళల్లో మరో మూడు విడతలుగా మూడేసి మణుగుల చొప్పున చందనాన్ని సమర్పిస్తారు. నాలుగు పర్యాయాల్లో సుమారు 15 మంది చొప్పున సిబ్బంది ఆలయ బేడా మండపంలో ఐదేసి రోజులపాటు కావాల్సిన చందనాన్ని అరగదీస్తారు. ఈ చందనంలో అర్చకులు సుగంధ ద్రవ్యాలను కలిపి స్వామికి సమర్పిస్తారు. - అవసరాల గోపాలరావు, సాక్షి, సింహాచలం చేరుకోవడం ఇలా! * సింహాచలం చేరుకోవడానికి విశాఖపట్నం ఆర్టీసి కాంప్లెక్స్, రైల్వేస్టేషన్ల నుంచి పది నిమిషాలకు ఒక ఆర్టీసి బస్సు అందుబాటులో ఉంటుంది. * విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తే బస్సులు అందుబాటులో ఉన్నాయి. * సింహాచలంలో కొండపై నుంచి కొండదిగువకు దేవస్థానం బస్సులు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇతర టూరిస్టు వెహికల్స్ కూడా విరివిగా లభిస్తాయి. -
ఆ భూములు అప్పన్నవే..
జీవో నం.237ను రద్దు చేసిన ప్రభుత్వం 144.75 ఎకరాల వివాదంపై నిర్ణయం విశాఖపట్నం : సింహాచలం దేవస్థానం భూములపై మూడు దశాబ్దాలుగా నలుగుతున్న వివాదంపై ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. 144.75 ఎకరాల భూసేకరణకు సంబంధించి 1990లో జారీ చేసిన జీవో (నెం.237)ను రద్దు చేసింది. సింహాచలం దేవస్థానానికి చెందిన వేపగుంటలోని 144.75 ఎకరాల భూమిని 1982లో భూసేకరణకు వుడా నోటిఫై చేసింది. ఈ నిర్ణయంపై కొంతమంది రైతులు ఆ భూమి తమదంటూ కోర్టుకెళ్లారు. ఈ మేరకు భూసేకరణ అధికారి రూ.32,47,057లను సివిల్ కోర్టులో జమ చేశారు. ఈ నేపథ్యంలో ఆ భూమిని 1ః2 నిష్పత్తిలో దేవస్థానం, రైతులు పంచుకోవాలంటూ ప్రభుత్వం అప్పట్లో 237 జీవోను జారీ చేసింది. దేవస్థానం పేరిట రైత్వారీ పట్టాలను ఇచ్చింది. దేవస్థానం ఈనాం భూములు అలా పంచుకోవడానికి వీల్లేదంటూ దేవాదాయశాఖ అభ్యంతరం చెప్పింది.ఇలా ఏళ్ల తరబడి సాగుతున్న ఈ వివాదంపై ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. -
తీర ప్రాంత రక్షణలో వైఫల్యం
చంద్రబాబు సర్కారుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం ⇒ రాష్ట్రంలో శాశ్వత చర్యలు చేపట్టకుంటే 282 గ్రామాలు కనుమరుగు ⇒ నిరాశ్రయులు కానున్న 13 లక్షలమంది ప్రజలు.. సమస్య పరిష్కారానికి సమగ్ర అధ్యయనం అవసరం ⇒ ‘హెడ్గ్రోయిన్ బ్రేక్ వాటర్’ విధానమే శాశ్వత పరిష్కారం సాక్షి, విశాఖపట్నం: ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడితే దుబాయ్, జపాన్, సింగపూర్ దేశాలు తిరుగుతున్నారు. అవన్నీ సముద్ర తీరమున్న దేశాలే. సముద్ర తీరం కోతలకు గురైనప్పుడు ఆ దేశాలు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుంటున్నారో చంద్రబాబు చూడలేదా? ఆయనకు తెలియదా? రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అప్పటికప్పుడు రావడం.. తాత్కాలిక చర్యలతో సరిపుచ్చడమేతప్ప రాష్ట్రప్రభుత్వం శాస్త్రీయ విధానంలో శాశ్వత చర్యలు చేపట్టడం లేదు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. విశాఖపట్నంలో కోతకు గురి అవుతున్న ఆర్కేబీచ్‌లోని కురుసుర జలాంతర్గామి మ్యూజియం సమీప ప్రాంతాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. పార్టీ నేతలు, స్థానిక నేతలతో మాట్లాడి తీరం కోత తీవ్రతను తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘రాష్ర్టంలో 442 కిలోమీటర్ల తీరం కోతముప్పును ఎదుర్కొంటోంది. ప్రస్తుత సముద్ర నీటిమట్టం కేవలం మరో 0.6 మీటర్లు ఎత్తు పెరిగితే సముద్రం మరో 100 మీటర్ల మేర తీరంలోకి చొచ్చుకొస్తుంది. దీంతో రాష్ట్రంలోని 282 తీరప్రాంత గ్రామాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఈ గ్రామాల్లో నివసిస్తున్న 13 లక్షలమంది ప్రజలు నిరాశ్రయులవుతారు. వారి జీవనోపాధీ దెబ్బతింటుంది. మన కళ్లెదుటే ఇంతటి పెనుప్రమాదం పొంచిఉన్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. తీరప్రాంతాల్లో ఇష్టమొచ్చినట్టుగా డ్రెడ్జింగ్ సాగిస్తుండడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన పాలకులే పర్యావరణానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అప్పటికప్పుడు రావడం.. చూడడం.. నాలుగురాళ్లు వేయడంతో సరిపెట్టడం చేస్తున్నారు.కోతకు గురైనప్రాంతాన్ని పనికిరాని రాళ్లతో నింపుతున్నారు. ఇందుకోసం టీడీపీ నాయకుల జేబులు నింపేందుకు నామినేషన్ పద్ధతిలో ఏకంగా రూ.మూడున్నర కోట్ల పనులు కట్టబెట్టారు. ఇది శాశ్వత పరిష్కారం కాదు. తీరప్రాంతానికి పొంచిఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు సమగ్ర అధ్యయనం జరగాలి. కేంద్రాన్ని సంప్రదించి అవసరమైతే అంతర్జాతీయస్థాయి నిపుణులను రప్పించి తరచూ కోతలకు గురవడానికి గల కారణాలు.. శాశ్వత పరిరక్షణకు తీసుకోవల్సిన చర్యలపై అధ్యయనం చేయించాలి. కోత నివారణకు విదేశాల్లో అమలు చేస్తున్న ‘హెడ్ గ్రోయిన్ బ్రేక్ వాటర్’ విధానాన్ని మన తీరంలోనూ అమలు చేయాలి. ఈ సమస్యపై ప్రతిపక్షంగా అసెంబ్లీలో ప్రస్తావిస్తాం. శాశ్వత పరిరక్షణకోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం.. విశాఖపట్నంలోని మేధావులు, వివిధ రంగాల నిపుణులు ఈ సమస్యపై ఉద్యమించాలి. అప్పుడే పరిష్కారం దొరుకుతుంది’’. సింహాద్రి అప్పన్న దర్శనం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం మధ్యాహ్నం సింహాచలం దేవస్థానాన్ని సందర్శించి వరాహలక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. దేవస్థానంవద్ద ఆలయ అధికారులు, వేదపండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జగన్ దేవస్థానంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా మండపం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం దేవస్థానం అంతరాయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు జగన్ పేరిట అష్టోత్తర పూజ చేశారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. తర్వాత ఆస్థాన మండపంలో అర్చకులు జగన్‌ను వేదమంత్రోచ్ఛారణతో ఆశీర్వదించారు. ఆలయ ఈవో కె.రామచంద్రమోహన్ ఆయనకు స్వామివారి ప్రసాదాన్ని అందించారు. అనంతరం సింహాచల దేవస్థానం రాజగోపురం వద్ద తనను కలిసిన విలేకరులతో జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అందరికీ మంచి జరగాలని దేవున్ని ప్రార్థించానని చెప్పారు. దేవస్థానం పరిధిలోని పంచగ్రామాల భూసమస్యను విలేకరులు ప్రస్తావించగా జగన్ స్పందిస్తూ.. పంచగ్రామాల్లో భూములను క్రమబద్ధీకరించాలన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిఉంటే ఆ భూముల్ని క్రమబద్ధీకరించి ఉండేవాళ్లమన్నారు. శారదా పీఠం సందర్శన.. కాగా జగన్మోహన్రెడ్డి పెందుర్తి నియోజకవర్గం చినముషిరివాడలోని విశాఖ శారదా పీఠాన్ని సందర్శించి పీఠం ఆవిర్భావోత్సవ పూజల్లో పాల్గొన్నారు. పీఠం ప్రధాన ద్వారం వద్ద వేదపండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తదుపరి జగన్ నేరుగా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిని కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయనతో కొద్దిసేపు సమావేశమయ్యారు. అనంతరం స్వామీజీతో కలసి పీఠప్రాంగణంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాలను సందర్శించి కలశారాధన చేశారు. జమ్మిచెట్టుకు పూజలు చేశారు. పీఠం సంప్రదాయం ప్రకారం వేదపండితులు జగన్‌ను సత్కరించారు. అనంతరం వైఎస్ జగన్ హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమయ్యారు. ఈ పర్యటనలో జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ డి.సూర్యనారాయణరాజు, ఎమ్మెల్యేలు సుజయ్‌కృష్ణ రంగారావు, బూడి ముత్యాలనాయుడు, కిడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, విశ్వసరాయి కళావతి, కంబాల జోగులు, మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, కర్రి సీతారాం, మళ్ల విజయ్ ప్రసాద్, తైనాల విజయ్‌కుమార్, కరణం ధర్మశ్రీ, తిప్పల గురుమూర్తిరెడ్డి, చెంగల వెంకట్రావు, పాలవలస రాజశేఖరం, నియోజకవర్గాల సమన్వయకర్తలు వంశీకృష్ణ, కోలా గురువులు, తిప్పల నాగిరెడ్డి, అదీప్‌రాజ్, పెట్ల ఉమాశంకర్ గణేష్, ప్రగడ నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శులు జాన్‌వెస్లీ, కంపా హనోక్, పార్టీ నేతలు కొయ్య ప్రసాద్‌రెడ్డి, ఉషాకిరణ్, బల్లాడ జనార్దన్‌రెడ్డి, హేమమాలినిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి మంచి జరగాలని జగన్ రావడం సంతోషం స్వరూపానందేంద్ర స్వరస్వతి స్వామీజీ సాక్షి, విశాఖపట్నం: శారదా పీఠం మహా సంస్థానం ఆవిర్భావ మహోత్సవాలకు ప్రతిపక్ష నేత హోదాలో రాష్ట్రానికి మంచి జరగాలని కోరుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి రావడం సంతోషదాయకమని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. పీఠాన్ని జగన్ మంగళవారం సాయంత్రం సందర్శించిన అనంతరం స్వామీజీ విలేకరులతో మాట్లాడారు. -
జనరేటర్ల వెలుగులోనే అప్పన్నస్వామి
విశాఖపట్నం: విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి కాకపోవడంతో జనరేటర్ల వెలుగులోనే సింహాద్రి అప్పన్నస్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. రెండు వారాల క్రితం సింహాచలం అప్పన్నస్వామి దేవాలయంలో విద్యుత్ పనులను చేపట్టారు. అయితే రెండు వారాలు పూర్తి కావోస్తున్న విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి కాకపోవడంతో భక్తులకు ఇబ్బందిగా మారాయి. అధికారుల నిర్లక్ష్యమే విద్యుత్ పనులు పూర్తికాకపోవడానికి కారణమని స్థానికులు మండిపడుతున్నారు. అప్పన్న స్వామి దేవాలయంలో విద్యుత్ పనులు ఎప్పుడూ పూర్తవుతాయనే విషయంపై అధికారులు నోరు విప్పక పోవడం గమనార్హం. -
సింహాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవం
-
సింహాచల అప్పన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు