
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో మత కలహాలు సృష్టించి.. రాజకీయ లబ్ధి పొందాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. శనివారం ఆయన సింహాద్రి అప్పన్న స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనుక కుట్ర కోణం దాగి ఉందనే అనుమానాలు కలుగుతున్నాయని సందేహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే సహించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అటువంటి వారికి కఠిన శిక్ష తప్పదని మోపిదేవి వెంకటరమణ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment