సింహగిరిపై నేటి నుంచి పవిత్రోత్సవాలు | Pavithrotsavam Wll Start From Today In Simhachalam Temple | Sakshi
Sakshi News home page

సింహగిరిపై నేటి నుంచి పవిత్రోత్సవాలు

Published Fri, Aug 28 2020 8:13 AM | Last Updated on Fri, Aug 28 2020 8:14 AM

Pavithrotsavam Wll Start From Today In Simhachalam Temple - Sakshi

సింహాచలం(పెందుర్తి): సింహగిరిపై శుక్రవారం నుంచి ఐదు రోజులపాటు వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి. రాత్రి 7 గంటలకు మృత్సంగ్రహణం, అంకురార్పణ, హోమాలతో పవిత్రోత్సవాలను ప్రారంభిస్తారు. 29వ తేదీన ఉదయం విశేష హోమాలు, పారాయణలు, రాత్రి ఆదివాసములు, పారాయణలు, 30వ తేదీ ఉదయం విశేష హోమాలు, పారాయణలు, రాత్రి పవిత్ర సమర్పణ, 31న ఉదయం విశేష హోమాలు, పారాయణలు, రాత్రి పూర్ణాహుతి, పవిత్ర విసర్జన, రథబలి నిర్వహిస్తారు. సెప్టెంబర్‌ 1వ తేదీ ఉదయం ఏకాంత స్నపనంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. పవిత్రోత్సవాలను పురస్కరించుకుని ఈనెల 28వ తేదీ నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు ఆర్జిత సేవలన్నీ రద్దుచేసినట్లు దేవస్థానం ఈవో డి.భ్రమరాంబ తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement