
పాముని పట్టుకున్న కరి సీతారామాచార్యులు
సింహాచలం(పెందుర్తి): తొమ్మిది అడుగుల నాగజెర్రి సోమవారం రాత్రి సింహాచల దేవస్థానం ఇన్‌చార్జి ప్రధానార్చకుడు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు ఇంట్లో కలకలం సృష్టించింది. రాత్రి 8 గంటల సమయంలో నాగజెర్రి స్థానిక ప్రియాగార్డెన్స్‌లో నివసిస్తున్న అర్చకుని ఇంట్లో మేడ మెట్ల కిందకి వెళ్లడాన్ని పులువురు స్థానికులు చూశారు.
విషయాన్ని గోపాలకష్ణమాచార్యులకు తెలియజేశారు. దేవస్థానంలోనే పనిచేస్తున్న అలంకారి కరి సీతారామాచార్యులు(ఈయన స్నేక్ క్యాచర్)కు ఫోన్‌లో సమాచారం అందించారు. ఆయన వచ్చి చాకచక్యంగా పాముని పట్టుకుని సమీప తోటల్లో విడిచిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment