
పోలీసులు స్వాధీనం చేసుకున్న రెండు తల పాములు
కర్ణాటక, యశవంతపుర: అపురూపమైన రెండు తలల పామును విక్రయిస్తున్న ఐదుగురిని అధికారులు పట్టుకున్నారు. రాష్ట్రంలోని కొడగు జిల్లా విరాజ్‌పేట అటవీ అధికారులు వీరిని అరెస్ట్ చేశారు. నిందితులు ఆంధ్రప్రదేశ్ నుంచి పామును కేరళకు తరలిస్తుండగా సమాచారం అందుకున్న అటవీ అధికారులు కాపుగాచి పట్టుకున్నారు. ఒక సంచిలో పాముతో పాటు కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఆంధ్రప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment