
సాక్షి, విశాఖపట్నం: మాన్సాస్ ట్రస్టు చైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు ఉన్నప్పుడు ట్రస్టు, సింహాచలం దేవస్థానం అభివృద్ధికి ఏం చేశారో ప్రజలకు బహిరంగంగా చెప్పగలరా.. అని ట్రస్టు చైర్‌పర్సన్ సంచయిత గజపతిరాజు ప్రశ్నించారు. విశాఖలోని తన నివాసంలో ‘సాక్షి’తో మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే..(అవన్నీ బాబు, బాబాయ్ కలిసే చేశారట!)
►ట్రస్టు ఆశయాన్ని బాబాయ్ పూర్తిగా భ్రష్టు పట్టించారు.
►మోతీమహల్‌ని కూల్చివేసినప్పుడు గత చరిత్ర గుర్తుకు రాలేదా? మూడు లాంతర్ల కూడలిని ధ్వంసం చేశారంటూ ఇప్పుడు మొసలి కన్నీరుకార్చడం హాస్యాస్పదం.
►తమ కుట్రలు ఎక్కడ బయటపడిపోతా యేమోనన్న భయంతో ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు.