Sanchaita Gajapati Raju
-
బాబాయి గారూ! ఆ చర్యలకు మీరు సిగ్గుపడడం లేదా?
సాక్షి, విజయనగరం : టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజుపై మాన్సాస్ ట్రస్ట్ మాజీ చైర్పర్సన్ సంచయిత గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయనపై మండిపడ్డారు. ‘‘అశోక్ బాబాయి గారూ.. మీ అన్నగారి పుట్టినరోజున ప్రభుత్వ ఉద్యోగి అయిన మాన్సాస్ ఈవోపైకి సిబ్బందిని రెచ్చగొట్టి పంపారు. రక్షణ కోసం మాన్సాస్ ఈవో పరుగులు తీయాల్సిన పరిస్థితి. ఇలాంటి చర్యలకు మీరు సిగ్గుపడడం లేదా?. సిబ్బందిని తప్పుదోవ పట్టించి, రెచ్చగొట్టి ఈవో మీదకు పంపారు. మీ రాజకీయ చదరంగానికి మాన్సాస్ విద్యాసంస్థలను వేదికగా చేసుకోకండి. తాతగారు పీవీజీ రాజుగారు, నాన్నగారు ఆనందగజపతిగారు.. మాన్సాస్ సంస్థలను గొప్పగా తీర్చిదిద్దారు. ఆ వారసత్వాన్ని మీరు ధ్వంసం చేస్తున్నారు’’అని అన్నారు. -
మాన్సాస్ ట్రస్ట్ తీర్పుపై అప్పీళ్లు
సాక్షి, అమరావతి: మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (మాన్సాస్) ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా సంచయిత గజపతిరాజు నియామకం చెల్లదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, సంచయిత తరఫున హైకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలయ్యాయి. సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని అభ్యర్థించారు. మొత్తం ఆరు అప్పీళ్లలో రెండు మాత్రమే మంగళవారం విచారణకు రావటాన్ని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సు«ధాకర్‌రెడ్డి హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో మిగిలిన అప్పీళ్లు కూడా విచారణకు వచ్చేందుకు వీలుగా విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. లింగ వివక్ష తగదని సుప్రీంకోర్టు తీర్పు... దేవదాయ చట్ట నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ జడ్జి తీర్పు ఉందని రాష్ట్ర ప్రభుత్వం తన అప్పీల్లో పేర్కొంది. అంతేకాకుండా లింగ వివక్షను ప్రోత్సహించేలా ఉందని నివేదించింది. లింగం ఆధారంగా ఓ వ్యక్తి నియామకాన్ని ఖరారు చేయడం వివక్ష చూపడమే అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ప్రభుత్వం అప్పీల్లో తెలిపింది. కుటుంబంలో పెద్దవారైన పురుషులు మాత్రమే మాన్సాస్ ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా ఉండాలనడం లింగ వివక్ష కిందకే వస్తుందని, ఈ విషయాన్ని సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమయ్యారని పేర్కొంది. వ్యవస్థాపక కుటుంబ సభ్యుల మధ్య ఉన్న వివాదాలను తేల్చాల్సింది దేవదాయశాఖ ట్రిబ్యునల్ మాత్రమేనని స్పష్టం చేసింది. అశోక్ గజపతిరాజు ట్రిబ్యునల్‌కు వెళ్లకుండా నేరుగా హైకోర్టును ఆశ్రయించారని, అందువల్ల సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలని అభ్యర్థించింది. టీడీపీ పిటిషన్లు.. మాన్సాస్ ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా సంచయితను, మాన్సాస్ వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా సంచయిత, ఊర్మిళ, ఆర్వీ సునీత ప్రసాద్‌లను నియమిస్తూ గతేడాది ప్రభుత్వం జీవోలను జారీ చేసింది. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వంశపారంపర్య చైర్‌పర్సన్‌గా సంచయితను నియమిస్తూ మరో జీవో జారీ చేసింది. ఈ మూడు జీవోలను సవాలు చేస్తూ టీడీపీ నేత అశోక్ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. వీటిపై ఇటీవల విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ వెంకటరమణ ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా సంచయిత నియామకం, సభ్యులుగా సంచయిత, ఊర్మిళ, సునీతా ప్రసాద్‌లను నియమిస్తూ జారీ చేసిన జీవోలను రద్దు చేశారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా అశోక్ గజపతిరాజు నియామకం తిరిగి అమల్లోకి వస్తుందని తీర్పు ఇచ్చారు. -
మహిళ కమిషన్ చైర్పర్శన్ను కలిసిన సంచయిత గజపతిరాజు
-
మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసిన సంచయిత
సాక్షి విశాఖపట్నం: సంచయితపై అశోక్ గజపతిరాజు చేసిన వ్యాఖ్యలపట్ల మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్రంగా మండిపడ్డారు. మహిళల పట్ల అశోక్ గజపతిరాజు వివక్ష అనాగరికమని అన్నారు. మాన్సాస్ బైలా అంటే సతీ సహగమనం చేయాలా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. మాన్సాస్ ట్రస్ట్ మాజీ చైర్పర్సన్ సంచయిత గజపతిరాజు బుధవారం మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. విశాఖలో కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను కలిసి తనకు జరిగిన అన్యాయంపై ఆమె ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా తన నియామకంతో పాటు వారసత్వం అంశాన్ని కించపరిచే రీతిలో అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు చేశారని సంచయిత ఆరోపించారు. సంచయిత ఫిర్యాదుపై వాసిరెడ్డి పద్మ స్పందించారు. అశోక్ గజపతిరాజు రాచరికపు వ్యవస్థలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మాన్సాస్ ట్రస్ట్ బైలా పునః సమీక్షించాలని అన్నారు. సంచయిత విషయంలో అశోక్ చర్చకు సిద్దమా? అని వాసిరెడ్డి పద్మ సవాల్ విసిరారు. చదవండి: ‘విశాఖకు పరిపాలన రాజధాని రావడాన్ని ఎవరూ ఆపలేరు’ అనంతపురం జిల్లాలో ఉద్యాన విప్లవం -
‘విశాఖకు పరిపాలన రాజధాని రావడాన్ని ఎవరూ ఆపలేరు’
సాక్షి, విశాఖపట్నం: దిశ యాప్ మహిళల రక్షణకు వజ్రాయుధం వంటిదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. దిశ యాప్‌పై సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. విశాఖకు పరిపాలన రాజధాని రావడాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడం ఖాయమని పేర్కొన్నారు. ఎన్నికల హామీ మేరకు అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 98 వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పన దిశలో కార్పొరేషన్ పనిచేస్తోందని ఎంపీ పేర్కొన్నారు. అదే విధంగా సంచయితపై అశోక్‌గజపతిరాజు చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమని ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. విలువైన భూములను అశోక్‌గజపతిరాజు స్వాహా చేశారని విమర్శించారు. రికార్డులు తారుమారు చేశారని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. విచారణ నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చదవండి: AP: సిరులు కురిపిస్తున్న ‘అనంత’ పంటలు ‘చంద్రబాబు మూడు గంటల బ్రేక్ ఫాస్ట్ దీక్ష చేశారు’ -
సంచయితకు బాసటగా మహిళా కమిషన్
సాక్షి,అమరావతి/నెహ్రూనగర్ (గుంటూరు): మాన్సాస్ ట్రస్టు, సింహాచలం దేవస్థానం బోర్డు నుంచి సంచయితను కోర్టు తప్పించడంపై టీడీపీ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఆమె కోరారు. ఈ మేరకు బుధవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. సంచయితకు మహిళా కమిషన్ బాసటగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం గడిచిన రెండేళ్లుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. మహిళల అభివృద్ధిని సీఎం కోరుకుంటే.. టీడీపీ నేతలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. -
మాన్సాస్ ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా సంచయిత నియామకం చెల్లదు
సాక్షి, అమరావతి: మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (మాన్సాస్) ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా సంచయిత గజపతిరాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. ఆమె నియామకం చెల్లదని పేర్కొంది. అలాగే మాన్సాస్ ట్రస్ట్ వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా సంచయిత గజపతిరాజు, ఊర్మిళా గజపతిరాజు, ఆర్వీ సునీతా ప్రసాద్‌లను నియమిస్తూ జారీ చేసిన జీవోను సైతం రద్దు చేసింది. అంతేకాకుండా సింహాచలం దేవస్థానం చైర్‌పర్సన్‌గా సంచయిత నియామక జీవోను సైతం కొట్టేసింది. ఇదే సమయంలో మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా అశోక్ గజపతిరాజు నియామకం తిరిగి అమల్లోకి వస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రస్ట్ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడిగా/చైర్మన్‌గా 2016లో అశోక్ గజపతిరాజు నియామకం సక్రమంగానే జరిగిందని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మఠం వెంకటరమణ సోమవారం తీర్పు వెలువరించారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా సంచయితను నియమిస్తూ ప్రభుత్వం గతేడాది జీవో 74ను జారీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ట్రస్టు వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా సంచయిత, ఊర్మిళ, ఆర్వీ సునీతా ప్రసాద్‌లను నియమిస్తూ మరో జీవో ఇచ్చింది. అదేవిధంగా సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వంశపారంపర్య చైర్‌పర్సన్‌గా సంచైతను నియమిస్తూ మరో జీవోనూ జారీ చేసిన విషయం విదితమే. ఈ మూడు జీవోలను సవాల్ చేస్తూ టీడీపీ సీనియర్ నేత, మాన్సాస్ ట్రస్ట్ మాజీ చైర్మన్ అశోక్ గజపతిరాజు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ వెంకటరమణ సోమవారం తీర్పు వెలువరించారు. తీర్పు కాపీ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో హైకోర్టు జీవోలను కొట్టేయడానికి గల కారణాలు తెలియరాలేదు. -
ఎన్టీఆర్‌పై ఆ ఐదుగురి కుట్ర: సాక్ష్యం ఇదే!
సాక్షి, అమరావతి : మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతి రాజు టీడీపీ సీనియర్ నేత అశోక గజపతి రాజుపై ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఎన్టీఆర్‌పై కుట్రలు చేసిన వారిలో ఒకరైన అశోక గజపతి.. ఆయన వర్ధంతి సందర్భంగా కొనియాడ్డం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ట్విటర్ వేదికగా ఆమె స్పందిస్తూ.. ‘‘ పార్టీపెట్టుకుని సొంతకాళ్లమీద అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్‌ను పదవినుంచి తప్పించి ఆయన మరణానికి కారకులైన వ్యక్తుల్లో చంద్రబాబు గారితో పాటు అశోక్ గజపతి రాజు గారు ఒకరు. వీరిని పార్టీని నుంచి బహిష్కరించాలని ఎన్టీఆర్ ఆరోజు రాసిన లేఖ ఇది. ( తెలుగు ప్రేక్షకులు బెస్ట్: నటుడు ) ఆనాటి కుట్రలో ఎవరు ఉన్నారో చెప్పే సాక్ష్యం ఇది. రాజకీయ సూత్రాలను, నైతిక విలువలను, ప్రజలిచ్చిన తీర్పును మంటగలిపిన అశోక్ గజపతి రాజు గారు ఎన్టీఆర్ ఆరాధ్యదైవం అంటూ ఆయన వర్థంతి రోజున కొనియాడ్డం, ఒక వ్యక్తిని హత్యచేసిన హంతకుడు, అదే వ్యక్తి దూరమయ్యాడంటూ కన్నీరు కార్చినట్టుగా ఉంది’’ అని పేర్కొన్నారు. కాగా, ఆ లేఖలో మొత్తం ఐదుగురి తెలుగు దేశం పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ఎన్టీఆర్ పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు, ఆశోక్ గజపతి రాజు, విధ్యాదర్ రావు, దేవేందర్ గౌడ్, మాధవ రెడ్డిలను పార్టీనుంచి తొలిగిస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడిగా ఆయన నిర్ణయం తీసుకుంటూ ఆ లేఖను స్పీకర్‌కు పంపారు. -
మాన్సాస్ కార్యాలయం తరలింపు!
మాన్సాస్‌లో ప్రక్షాళన మొదలైంది. చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన సంచయిత గజపతి తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆది నుంచి దూకుడుగా వ్యవహరిస్తూ చర్చలకు తెరతీస్తు న్నారు. తరతరాలుగా పూసపాటి ఆనందగజపతి, ఆయన తర్వాత అశోక్ గజపతి రాజు పెద్దరికంలో ఉన్న మాన్సాస్ ఇప్పుడు అందరికీ హాట్‌టాపిక్ అయ్యింది. తాజాగా ట్రస్ట్ రెవెన్యూ కార్యాలయాన్ని విశాఖ పట్నం జిల్లా పద్మనాభానికి తరలించాలనే నిర్ణయం చర్చనీయాంశమైంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్(మాన్సాస్) పేరుతో ట్రస్ట్‌ను 1958లో పి.వి.జి.రాజు విజయనగరంలో ఏర్పాటుచేశారు. సింహాచలం దేవస్ధానంతో పాటు 108 దేవాలయాలు, సుమారు 14,800కి పైగా ఎకరాల విలువైన భూములు ట్రస్ట్ ఆధీనంలో ఉన్నాయి. ఈ ట్రస్ట్‌కు పూసపాటి వంశీయులే చైర్మన్లుగా బాధ్యతలు చేపడుతూ వస్తున్నారు. పి.వి.జి.రాజు తర్వాత పూసపాటి ఆనందగజపతిరాజు, ఆయన తదనంతరం ఆయన సోదరుడు అశోక్ గజపతిరాజు ట్రస్ట్ బోర్డు బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఆనందగజపతి రాజు కుమార్తె పూసపాటి సంచయిత గజపతి రాజు మాన్సాస్ చైర్‌పర్సన్‌గా ఈ ఏడాది మార్చి 4వ తేదీన బాధ్యతలు చేపట్టారు. గత చైర్మన్లు కేవలం మొక్కుబడి వ్యవహారాలే తప్ప, నేరుగా ట్రస్ట్ కీలక వ్యవహారాలపై పట్టించుకోలేదు. ఒక్కసారిగా సంచయిత బాధ్యతలు స్వీకరించాక కీలక నిర్ణయా లు తీసుకోవడం సంచలనం సృష్టిస్తున్నాయి. అవి కాస్తా కొందరికి మింగుడుపడడం లేదు. ఆమె తీసుకున్న నిర్ణయాలపై అడుగడుగునా వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ప్రచారం చేస్తున్నారు. సింహాచలం దేవస్థానం, కళాశాల, అయోధ్యా మైదానం విషయంలోనూ ఆమె తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదయ్యాయి. అవేవీ పట్టించుకోని ఆమె తాను అనుకున్నట్టుగానే మాన్సాస్ ఆస్తుల పరిరక్షణ, కార్యాలయ పరిరక్షణ, విద్యాసంస్థల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. పద్మనాభానికి మార్చాలని నిర్ణయం తాజాగా మాన్సాస్ కార్యాలయాన్ని విశాఖ జిల్లా పద్మనాభంలోని మెమోరియల్ జూనియర్ కళాశాలకు తరలించాలని సంచయిత నిర్ణయించారు. ఈ మేరకు మాన్సాస్ ఈఓ డి.వెంకటేశ్వరరావుకు సూచించారు. ఆయన దేవదాయశాఖ కమిషనర్‌కు అనుమతి కోరుతూ లేఖ రాశారు. పరిపాలన, నిర్వహణ, భద్రత కారణాల దష్ట్యా కార్యాలయాన్ని మార్చాల్సిన అవసరముందంటూ ఆ లేఖలో ఈఓ వివరణ ఇచ్చారు. ఈ పరిణామంతో జిల్లాలో మాన్సాస్‌తో ముడిపడిఉన్న వర్గాల్లో కలకలం రేగింది. పరిపాలన సౌలభ్యం కోసం సంచయిత తీసుకున్న నిర్ణయంపై కమిషనర్ స్పందనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా, మాన్సాస్ కార్యాలయంలోకి మీడియాను అనుమతించవద్దని ఈఓ ఆదేశించారంటూ, భద్రత సిబ్బంది కోట ద్వారాలు మూసేయడం విమర్శలకు తావిచ్చింది. (చదవండి: అశోక్ గజపతిపై తిరుగుబాటు) -
అశోక్ గజపతిరాజుపై సంచయిత ఫైర్
సాక్షి, అమరావతి: టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై సింహాచలం ట్రస్టు బోర్డు, మన్సాస్ ట్రస్టు బోర్డు చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు ఫైర్ అయ్యారు. ఆయన అక్రమాలు బయట పడుతున్నాయి కాబట్టే ఉద్యమాల పేరిట రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 150 ఏళ్ల చారిత్రక మోతీమహల్‌ను కూల్చినపుడు ఉద్యమం ఎందుకు చేయలేదని అశోక్ గజపతిరాజును ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. ఈ మేరకు.. ‘‘8 వేల ఎకరాల మన్సాస్ భూములను ఎకరా 5 వందల రూపాయలకు మీ అనునాయులకు లీజుకి కట్టబెట్టినపుడు నిజానికి సేవ్ మన్సాస్ ఉద్యమాన్ని చేయాల్సింది. మార్కెట్ ధరకు మీరిచ్చిన లీజులకు ఏమైనా సంబంధం ఉందా? కనీసం లాయర్‌ను పెట్టుకోవడం కూడా చేతకాక రూ. 13 కోట్ల నష్టాన్ని కలిగించే విధంగా, మన్సాస్ భూములు ఎక్స్‌పార్టీ డిక్రీ ద్వారా అన్యాక్రాంతమైనపుడు మీ ఉద్యమం ప్రారంభించాల్సింది. 2016-2020 మధ్య కాలంలో మీరు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో మన్సాస్ విద్యాసంస్థలకు 6 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. అప్పుడు మొదలు పెట్టాల్సింది ఈ క్యాంపెయిన్. మీరు చైర్మన్‌గా ఉన్నపుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి నుంచి అవసరమైన అనుమతులు తెచ్చుకోకపోవడంతో 170 మందికి ఇచ్చిన డిగ్రీలు చెల్లుబాటుకాకుండా పోయాయి. అప్పుడు ‘‘సేవ్ మన్సాస్’’ ఉద్యమం చేయాల్సింది. సరైన ఆడిటింగ్ నిర్వహించక, మాన్యువల్‌గా తప్పుడుతడకలుగా ఆడిటింగ్ చేయించినపుడు ఉద్యమం ప్రారంభిస్తే అసలు రంగు బయటపడేది. టీడీపీ ప్రభుత్వ హయాంలో మన్సాస్‌కు రావాల్సిన 30 కోట్ల రూపాయల నిధులు రాబట్టుకోలేదు. అప్పుడు సేవ్ మన్సాస్ అంటే కొంతైనా ప్రయోజనం ఉండేది. అశోక్ గారూ.. మీరు ఎంఆర్ కాలేజీపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిలోకి తెచ్చారు. మీరు చైర్మన్‌గా ఉన్నపుడే ఇది ఒక ప్రైవేట్ కాలేజీ, ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని(గవర్నమెంటు ఎయిడ్) మీరే తీసేశారు. ఆ విధానమే ఇప్పుడు కొనసాగుతోంది’’ అంటూ అశోక్ గజపతిరాజు తీరును ఎండగట్టారు. వాస్తవానికి తానే సేవ్ మన్సాస్ ఉద్యమం నడుపుతున్నానని, ట్రస్టు పూర్వవైభవాన్ని పునురుద్ధరిస్తానన్న సంచయిత.. మీరు మీ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోండి అంటూ అశోక్ గజపతిరాజుకు హితవు పలికారు. సేవ్ మన్సాస్ పేరుతో చేస్తున్నది ‘‘సేవ్ అశోక్’’ క్యాంపెయిన్ మాత్రమేనంటూ చురకలు అంటించారు.(చదవండి: మహరాణిలా చూడాలని కోరుకుంటున్నారు: మన్సాస్) -
ఊర్మిళ తీరు అహంకారపూరితం..
సాక్షి, విజయనగరం : ఉత్తరాంధ్ర కల్పవల్లి, విజయనగరం ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న వ్యవహారంపై మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్ కార్యాలయం ఓ లేఖను విడుదల చేసింది. సిరిమానోత్సవంలో ట్రస్ట్ చైర్‌పర్సన్‌కు ముందు వరుసలో సీటు కేటాయించడం ఆనవాయితీ అని వివరించింది. కొంతమంది ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నేరుగా వచ్చి ముందు వరుసలో కూర్చున్నారని పేర్కొంది. పుసపాటి అనంద గజపతిరాజు కుమార్తె ఊర్మిళ, ఆమె తల్లి సుధా గజపతి రాజు... ఈవో పక్కన కూర్చొని సిరిమాను ఉత్సవాన్ని వీక్షించారని వివరించింది. అయినప్పటికీ తమకు సీట్లు కేటాయించలేదని మీడియాకు చెప్పడం బాధాకరమని మాన్సాస్ కార్యాలయం లేఖలో విచారం వ్యక్తం చేసింది. వారిని మహారాణి, రాజ కుమార్తెలాగా చూడాలని కోరుకుంటున్నారని, కానీ సిరిమానోత్సవం ప్రజల పండుగని తెలిపింది. ప్రజాస్వామ్యంలో ఇంకా కొంతమంది రాజరికం కోరుకోవడం దురదృష్టకరమని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఊర్మిళ తల్లి, ఊర్మిళ ప్రవర్తించిన తీరు అహంకారపూరితమని మాన్సాస్ కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా దసరా సందర్భంగా గత మంగళవారం అమ్మవారి సిరిమానోత్సం ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. సాంప్రదాయాలను పాటిస్తూ నిర్వహిస్తూ జరిపిన ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రముఖులు వీక్షించారు. అయితే మన్సాస్ ట్రస్ట్ చైర్మన్ కోసం ముందు వరుసలో ఏర్పాటు చేసిన కుర్చీలో ఊర్మిల, ఆమె తల్లీ కూర్చోవడంపై మన్సాస్ ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ సంచయిత గజపతి రాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారి తీరును ఖండిస్తూ లేఖను విడుదల చేశారు. జాతర సంఘటనలో ప్రభుత్వ ప్రమేయం లేదు పైడితల్లి సిరిమానోత్సవం సందర్భంగా కోట బురుజుపై జరిగిన సంఘటనలో ప్రభుత్వ జోక్యం లేదని, సంచయిత వ్యక్తిగత ప్రమేయంతోనే జరిగిందని పూసపాటి ఆనంద గజపతిరాజు కుమార్తె పి.ఊర్మిళ గజపతిరాజు అన్నారు. తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇంటి ఇలావేల్పు పైడితల్లి అమ్మవారి సిరుమాను ఉత్సవాన్ని ఏటా కోట బురుజుపై నుంచి తిలకిస్తామన్నారు. మమ్మల్ని ఎవరు అనుమతించారని చైర్పర్సన్ సిబ్బందిపై ఆగ్రహించడం తగదన్నారు. ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియమించినా ఇప్పటివరకు ప్రమాణ స్వీకారం చేయించలేదని ఆమె తెలిపారు. తమకున్న హక్కులు పలుమార్లు తెలిపామని, అధికారం శాశ్వతం కాదన్నారు. కార్యక్రమంలో ఆనందగజపతిరాజు సతీమణి సుధా గజపతిరాజు పాల్గొన్నారు. -
విజయనగరంలో పైడితల్లి అమ్మవారి జాతర
-
ఆయన ఇంతగా దిగజారి మాట్లాడతారా?
సాక్షి, విజయనగరం : టీడీపీ నేత, మాజీమంత్రి అశోక్ గజపతి రాజు వ్యాఖ్యలపై సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు, మన్సాస్ ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ సంచయిత గజపతి రాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహారాజా కళాశాలపై అశోక్ గజపతి రాజు చేసిన ఆరోపణలను ట్విటర్ వేదికగా సంచయిత తిప్పికొట్టారు. ‘మహారాజా కాలేజీ గురించి అశోక్ గజపతి గారు చేస్తున్న తప్పుడు సమాచారం నాకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన ఇంతగా దిగజారి మాట్లాడతారని ఊహించలేదు. ఎంఆర్ కాలేజీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రయివేటు కాలేజీ. ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి ఎయిడెడ్ హోదాను 2017లో ఆయనే సరెండర్ చేశారు. అప్పుడు తీసుకున్న విధాన నిర్ణయం కొనసాగుతోంది. ఇందులో ప్రభుత్వం జోక్యంకాని, సంబంధం కాని లేదు. ఈ విషయాన్ని ఆయన విస్మరించి మాట్లాడుతున్నారు. దయచేసి మీ రాజకీయాల్లోకి మాన్సాస్ విద్యాసంస్థలను లాగవద్దు. (అశోక్ గజపతిపై సంచయిత ఘాటు వ్యాఖ్యలు) అశోక్‌గారు మాన్సాస్ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు తప్పుడు వివరాలు ఇవ్వటం మూలాన మాన్సాస్ కాలేజీలకు రూ.6.5 కోట్లు నష్టం వచ్చింది. అప్పటి టీడీపీ ప్రభుత్వానికి అశోక్‌గారు డిస్కౌంట్‌గా ఈ డబ్బు ఇచ్చారేమో? ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం నుంచి ఈ డబ్బును తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సరైన అనుమతులు లేని కారణంగా 2018–2020లో 170 మంది విద్యార్థులకు ఇచ్చిన డిగ్రీలు చెల్లుబాటు కాకుండా పోయాయి. అశోక్ గజపతి గారి హయాంలో విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నారు. వారిని జీవితాలను చీకట్లోకి నెట్టేశారు. నేను వచ్చాక ఈ సమస్యపై దృష్టి పెట్టాను. అశోక్‌గారు తన రాజకీయ ఆటల కోసం విజయనగరం పెద్దల వారసత్వాన్ని ఏ విధంగా పక్కదారి పట్టించారో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నా. కనీసం గాంధీ జయంతి రోజు అయినా మీరు నిజం మాట్లాడాలి.’ అని సంచయిత గజపతిరాజు వరుస ట్వీట్లు చేశారు. (పవన్ వ్యాఖ్యలకు సంచయిత కౌంటర్) -
పవన్ వ్యాఖ్యలకు సంచయిత కౌంటర్
సాక్షి, అమరావతి: తనను హిందూయేతర వ్యక్తిగా చిత్రీకరించే ప్రచారాలను నమ్మవద్దంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు, మన్సాస్ ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ సంచయిత గజపతిరాజు హితవు పలికారు. తన తల్లిదండ్రులు హిందువులని, తాను కూడా హిందూ ధర్మాన్ని పాటిస్తానని స్పష్టం చేశారు. తాను అన్నిమతాలను గౌరవిస్తానని పేర్కొన్నారు. సింహాచలం దేవస్థానం, మన్సాస్ ట్రస్టు విషయంలో గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన అక్రమాలు బయటకు తీస్తున్నందునే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, కాబట్టి తన గురించి చేసిన వ్యాఖ్యలను సరిదిద్దుకోవాలని పవన్‌కు సూచించారు. మరో ప్రకటన విడుదల చేయడమో లేదా తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వడమో చేయాలన్నారు. హుందాతనం ఉన్న వ్యక్తిగా పవన్ నుంచి ఇదే ఆశిస్తున్నా అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. (చదవండి: సంచయితపై కేంద్రం ప్రశంసలు) ఈ మేరకు.. ‘పవన్‌కల్యాణ్ గారు.. మీ ప్రెస్ కాన్ఫరెన్సులో మాన్సాస్ ట్రస్ట్ ఒక హిందూయేతర వ్యక్తి నేతృత్వంలో ఉందన్నారు. అందుకే నిజాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను ఆనంద గజపతి రాజు, ఉమా గజపతి రాజుల పెద్ద కుమార్తెను. ఇద్దరూ హిందువులే. మా అమ్మగారు పునర్వివాహం చేసుకున్న రమేశ్ శర్మగారు హిందు పురోహిత కుటుంబం నుంచి వచ్చారు. ఆయన 6 సార్లు జాతీయ అవార్డు పొంది, ఒకసారి ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయిన ఫిల్మ్ మేకర్. టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని, పచ్చి అబద్ధాలను దయచేసి నమ్మకండి. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం విషయంలో వారు చేసిన అవకతవకలు, అక్రమాలు ఫోరెన్సిక్ ఆడిట్లో బయటపడతాయని తెలుగుదేశం పార్టీకి భయం పట్టుకుంది. (చదవండి: మా కుటుంబం జోలికి రావొద్దు: సంచయిత) మీలాగే నేను కూడా ఒక హిందువుగా అన్ని మతాలను గౌరవిస్తాను. మీ వ్యాఖ్యలను సరిదిద్దుకుంటూ మరో ప్రకటన చేయాలని కోరుతున్నాను. చంద్రబాబునాయుడు గారు, ఆయన అనుచర వర్గం చేస్తున్న అవాస్తవ ప్రచారానికి, కట్టుకథలకు మీ ప్రకటన ద్వారా అడ్డుకట్ట వేయాలని కోరుతున్నాను. హుందాతనం కలిగిన వ్యక్తిగా మీ నుంచి నేను ఇదే ఆశిస్తున్నాను’ అంటూ ట్విటర్ వేదికగా టీడీపీ, చంద్రబాబు తీరును ఎండగడుతూనే పవన్ కల్యాణ్‌కు సైతం దుష్ప్రచారాలు నమ్మవద్దంటూ సంచయిత హితవు పలికారు. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ పవన్, టీడీపీతో బంధాన్ని వదులుకోలేకపోతున్నారని, అందుకే కాషాయ పార్టీకి చెందిన మహిళ గురించి తెలుగుదేశం పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలకు ఆయన వంతపాడుతున్నారంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. -
అశోక్ గజపతిపై సంచయిత ఘాటు వ్యాఖ్యలు
-
అశోక్ గజపతిపై సంచయిత ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, విజయనగరం : అశోక్ గజపతిరాజుపై సింహాచలం దేవస్ధానం చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవస్థానం అభివృద్ధి కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. కేంద్రమంత్రిగా ఉండికూడా కనీసం అభివృద్ధి చేయడానికి ప్రయత్నించలేదని విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రిమేజ్ రెజువినేషన్ అండ్ స్పిర్చువల్ అజ్‌మెంటేషన్ డ్రైవ్(ప్రసాద్) స్కీమ్‌కు తిరుపతి, శ్రీశైలం దేవస్థానాలను గుర్తించినా.. గతంలో సింహాచలం దేవస్థానాన్ని ఎందుకు ప్రతిపాదించలేనది నిలదీశారు. కేంద్రం, రాష్ట్రంలోనూ వారే అధికారంలో ఉన్నారని అయినా కూడా కనీస ప్రయత్నం చేయలేదని విమర్శించారు. అప్పటి ముఖ్యమంత్రిచంద్రబాబు, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుకి నిజమైన ప్రేమ ఉంటే కేంద్రానికి ప్రతిపాదనలు పంపేవారు కదా అని వ్యాఖ్యానించారు. గురువారం మీడియాతో మాట్లాడిన సంచయిత.. మన్సాస్ అభివృద్ధిపై గత ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని తప్పుపట్టారు. (సంచయిత గజపతి రాజుకు కేంద్రం ప్రశంసలు) ప్రధాని, సీఎంకు కృతజ్ఞతలు.. నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రిమేజ్ రెజువినేషన్ అండ్ స్పిర్చువల్ అజ్‌మెంటేషన్ డ్రైవ్(ప్రసాద్) పథకానికి సింహాచలం దేవస్థానాన్ని ఎంపిక చేస్తున్నట్లు కేంద్రం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర పర్యాటక మంత్రి ప్రహ్లాద్ పటేల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్‌కు ప్రత్యేక కృతజ్ణతలు తెలిపారు. ‘దేవస్థానం భూముల్లో మొక్కల పెంపకంలో ఎకరానికి లక్ష రూపాయిలిచ్చే స్కీమ్‌ని కేంద్రం ప్రవేశపెట్టినా గత పాలకులు అప్పట్లో నిర్లక్ష్యం చేశారు. ప్రసాద్ స్కీమ్‌లో సింహాచలం దేవస్ధానాన్ని చేర్చాలని ఎందుకు ప్రతిపాదించలేదు. సింహాచలం దేవస్ధానంలో వృధాగా ఉన్న వేలాది ఎకరాలలో ఈ పధకం క్రింద అభివృద్ది చేసే అవకాశాన్ని అశోక్ గజపతిరాజు ఎందుకు పట్డించుకోలేదు. ఉత్తరాంద్రతో పాటు సింహాచలంపై చంద్రబాబు, అశోక్ గజపతిల కపటప్రేమ ఉత్తరాంధ్ర ప్రజలు గమనించాలి. అతి పురాతనమైన మోతీ మహల్‌ని రాత్రికి రాత్రే కూల్చేశారు. (అవకాశం వస్తే రాజకీయాల్లోకి: ఊర్మిళ) అన్ని విమర్శలకి సమాధానం చెబుతా మోతీ మహల్ లాంటి పురాతన కట్టడాల అభివృద్దికి కేంద్రం నిదులిచ్చే అవకాశం ఉన్నా కూడా ఎందుకు కూల్చేశారు. కేంద్ర, రాష్డ్ర ప్రభుత్వాల సహకారంతో సింహాచలం దేవస్ధానాన్ని పూర్తిగా అభివృద్ది చేస్తాను. ప్రసాద స్కీమ్ లో సింహాచలం దేవస్ధానం ఎంపికకావడం చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపటం వల్లే కేంద్రం ఈ స్కీమ్ లో సింహాచలం దేవస్ధానానికి అవకాశం కల్పించింది. మార్చ్ నెలలో కేంద్ర పర్యాటక మంత్రిని కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలని ఫాలో అప్ చేశా. ఈ పధకంలో కేంద్రం ఇచ్చే నిధులతో భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించగలుగుతాం. గత చైర్మన్ అశోక్ గజపతిరాజు సింహాచలంపై భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నాకు చైర్ పర్సన్ గా అవకాశం ఇచ్చారు. సింహాచలం దేవస్ధానం అభివృద్ది చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నా. నా పనితీరు ద్వారానే నాపై విమర్శలు చేస్తున్న వారికి సమాధానం చెబుతాను. (మళ్లీ తెరపైకి విజయనగర సామ్రాజ్యం) -
సంచయితపై కేంద్రం ప్రశంసలు
సాక్షి, విశాఖపట్నం: చారిత్రాత్మక దేవాలయమైన సింహాచలం అప్పన్న ఆలయ అబివృద్దికి కృషి చేస్తున్న మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతి రాజుపై కేంద్రం బుధవారం ప్రశంసలు కురిపించింది. ఈ సందర్భంగా నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రిమేజ్ రెజువినేషన్ అండ్ స్పిర్చువల్ అజ్‌మెంటేషన్ డ్రైవ్(ప్రసాద్) పథకానికి సింహాచలం దేవస్థానాన్ని ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది. 11వ శతాబ్దానికి చెందిన సింహాచలం వరాహ లక్ష్మీనృసింహ స్వామి దేవాలయ అభివృద్దికి కేంద్ర పర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పర్యావరణ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. కలిసి అభివృద్ది చేద్దాం.. కేంద్రం నిర్ణయంపై సంచయిత గజపతి రాజు సంతోషం వ్యక్తం చేశారు 'ప్రసాద్' పథకంలో సింహాచలం దేవస్థానాన్ని ఎంపిక చేసినందుకు ప్రదాని మోదీ, కేంద్ర పర్యాటక మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. "ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన ఐదు ఆలయాల్లో సింహాచలం దేవస్థానం ఒకటి. ఈ దేవస్థానాన్ని కలిసి అభివృద్ది చేద్దాం.." అంటూ కేంద్రమంత్రికి రీట్వీట్ చేశారు. కాగా దేశంలో ముఖ్యమైన పర్యాటక, ఆధ్యాత్మిక, ధార్మిక ప్రదేశాలు అభివృద్ది చేసేందుకు కేంద్రం "ప్రసాద్" పథకాన్ని అమలు చేస్తుంది. రాష్ట్రంలో శ్రీశైలం, తిరుపతి దేవస్థానాలను ఇప్పటికే ఈ పథకం కింద ఎంపిక చేసి నిధులు మంజూరు చేసి అభివృద్ది చేస్తున్నారు. ('ప్రజలకి సేవచేయడమే నా లక్ష్యం') చదవండి: 2024 నాటికల్లా విశాఖ మెట్రో.. -
సింహాచలం ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకం
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం ఆలయ ట్రస్ట్ బోర్డులో నూతనంగా ముగ్గురు సభ్యుల నియామకం జరిగింది. ఆ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేవీ నాగేశ్వరరావు, పార్వతీదేవి, కే లక్ష్మణకుమార్లను ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నియమించింది. కాగా.. గతంలో సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్‌పర్సన్‌గా, మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(మాన్సాస్) ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా ఆనందగజపతి కుమార్తె సంచయిత గజపతిరాజును నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. (సంచలనమైన సీఎం జగన్ నిర్ణయం) -
వారసుల పోరు
-
అవకాశం వస్తే రాజకీయాల్లోకి
-
అవకాశం వస్తే రాజకీయాల్లోకి: ఊర్మిళ
సాక్షి, విజయనగరం: తన తండ్రి మరణం అనంతరం అశోక గజపతిరాజు అనేక రాజకీయ కుట్రలకు ప్రయత్నించారని ఆనంద గజపతిరాజు, సుధా కూతురు ఊర్మిళా గజపతిరాజు విమర్శించారు. సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్ట్ విషయంలో మా బాబాయ్ రాజకీయం చేయడం తమను ఎంతో బాధించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మాన్సాస్ ట్రస్ట్ నుంచి తమను ఉద్దేశపూర్వకంగా దూరం చేయాలని అనేక ప్రయత్నాలు చేశారని అన్నారు. తన తండ్రి మరణం అనంతరం ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తున్నా అని, భవిష్యత్‌లో అవకాశం వస్తే తప్పనిసరిగా రాజకీయాల్లో దిగుతానని ఊర్మిళ తెలిపారు. అనంద గజపతి రాజు 70వ జన్మదినం సందర్భంగా ఆమె సాక్షి టీవీతో మాట్లాడారు. (సంచయితపై బాబు, అశోక్ రాజకీయ కుట్ర) ‘నాన్న ఆనంద గజపతిరాజు గారు నిత్యం ప్రజల కోసం ఆలోచించే వారు. ఆనంద గజపతిరాజు చాలా సాధారణ జీవితం గడిపారు. ఆయన ఎప్పుడూ పీవీజీ రాజు (తాత) ఆశయాలను కొనసాగించడం కోసమే పనిచేశారు. అందులో భాగంగానే ఇంజినీరింగ్ కాలేజీలు స్ధాపించడం, మాన్సాస్ ట్రస్ట్ బాగా నడిపించడం చేశారు. మెడికల్ కాలేజీ పెట్టాలి అనేది నాన్నగారి కల. ఆయన బ్రతికి ఉండి ఉంటే తప్పనిసరిగా మెడికల్ కాలేజీ నిర్మించేవారు. కుటుంబ సభ్యులను కాకుండా ఆయన దగ్గర పనిచేసే వారిని కూడా చాలా బాగా చూసుకునే వారు. మా నాన్న మరణించేటప్పటికి నా వయసు 16 సంవత్సరాలు. మా బాబాయ్ మా నాన్న మరణం తర్వాత ట్రస్ట్ బాధ్యతలు చేపట్టడానికి మాకు అర్హత లేదన్నారు. (చంద్రబాబుకు సంచయిత గట్టి కౌంటర్!) తాతగారు ఏ ఉద్దేశంతో ట్రస్ట్ పెట్టారో మా నాన్న ఆనంద గజపతిరాజు దాన్ని అలాగే కొనసాగించారు. దురదృష్టవశాత్తు నాన్న మరణం తర్వాత బాబాయి ఆ ఉద్దేశంతో ట్రస్ట్ కొనసాగించలేదు. అశోక్‌ను చైర్మన్‌గా టీడీపీ ప్రభుత్వం జీవో ఇచ్చిన సమయంలో కనీసం మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు. ప్రభుత్వం ఇచ్చిన జీవో మమ్మల్ని బాగా బాధ పెట్టింది. ఆ జీవోని ఉపయోగించుకుని మమ్మల్ని ట్రస్ట్‌కు దూరం చేశారు. నాన్న మరణం తర్వాత సింహాచలం దేవస్థానం వేడుకలకు ఆహ్వానించడం జరగలేదు. భవిష్యత్తులో మా నాన్న, మా తాత గారు లా ప్రజలకు సేవ చేస్తా. అవకాశం వస్తే తప్పనిసరిగా రాజకీయాల్లోకి వస్తా’ అంటూ తన మనసులోని మాటను చెప్పారు. -
'ప్రజలకి సేవచేయడమే నా లక్ష్యం'
-
'నా తండ్రి ఆశయాలని కొనసాగిస్తాను'
సాక్షి, విశాఖపట్నం: దివంగత ఆనంద గజపతిరాజు 70వ జన్మదినం సందర్భంగా శుక్రవారం రోజున మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్ సంచయిత గజపతిరాజు సింహాచలం దేవస్థానాన్ని సందర్శించారు. తన తండ్రి జన్మదినం సందర్భంగా ఆనందవనం పేరుతో సింహాచలంలో మాన్సాస్ ట్రస్ట్ అధ్వర్యంలో 700 మొక్కలు చొప్పున నాటే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. (చంద్రబాబుకు సంచయిత గట్టి కౌంటర్!) ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఈ రోజు నా తండ్రి జన్మదినం సందర్భంగా సామాజిక బాధ్యతగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉంది. ప్రజలకి సేవచేయడమే నా లక్ష్యం. నా తండ్రి ఆశయాలని కొనసాగిస్తాను' అని పేర్కొన్నారు. అనంతరం దేవస్థానంలోని గోశాలను సందర్శించిన సంచయిత గోవుల రక్షణకి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. గోశాలలో పనిచేస్తున్న సిబ్బందిని కూడా కొనసాగించాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. (సంచయితపై బాబు, అశోక్ రాజకీయ కుట్ర) -
సంచయితపై బాబు, అశోక్ రాజకీయ కుట్ర
సాక్షి, విజయనగరం : మరోసారి విజయనగరం రాజుల పోరు తెరపైకి వచ్చింది. వివాదంగా మారిన మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాలపై చైర్ పర్సన్ సంచయిత జోక్యం చేసుకోవడాన్ని అశోక్ గజపతిరాజు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో చంద్రబాబుతో కలిసి తరచూ సంచయిత గజపతిరాజుపై ఎదురుదాడికి దిగుతూ విమర్శలు చేస్తున్నారు. అయితే తానే అసలైన వారసురాలినని, తనకు ప్రజా సేవే ముఖ్యమంటూ దూకుడుగా వెళ్తున్న సంచయితపై బురద జల్లేందుకు టీడీపీ శతవిధాల ప్రయత్నిస్తోంది. గత కొన్నినెలలుగా వివాదంలో నలుగుతున్న పేరు విజయనగరం మాన్సాస్ ట్రస్ట్. ఒకప్పుడు ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన ఈ ట్రస్ట్ గడిచిన అయిదారేళ్లగా పూర్తిగా అవినీతిలోనే కూరుకుపోయింది.. తాజాగా ఈ ట్రస్ట్ కి చైర్ పర్సన్‌గా దివంగత ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అశోక్ గజపతిరాజు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గత కొన్ని నెలలుగా మాన్సాస్ లో జరిగిన అక్రమ వ్యవహారాలను వెలికి తీసేందుకు చైర్ పర్సన్ సంచయిత చేస్తున్న ప్రయత్నాలు ఆమె వ్యతిరేకులకి మింగుడుపడటంలేదు. (చంద్రబాబు టార్గెట్ చేస్తున్నారు: సంచయిత) చంద్రబాబుకు సంచయిత గట్టి కౌంటర్ ఇప్పటికే సంచయిత గజపతిరాజుకి చైర్ పర్సన్‌గా అర్హత లేదంటూ కోర్టుని ఆశ్రయించిన ఆమె బాబాయి అశోక్ గజపతిరాజు గత కొన్ని నెలలుగా చంద్రబాబుతో కలిసి కుట్ర రాజకీయాలకి పాల్పడుతున్నట్లు సంచయిత ఆరోపిస్తున్నారు. దీనికి నిదర్సనంగా రెండు రోజులక్రితం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా చేసిన విమర్సలు అద్దం పడుతున్నాయి. ట్రావెన్ కోర్ మాదిరిగానే వారసులుకే మాన్సాస్ ట్రస్ట్ బాధ్యతలు అప్పగించాలంటూ చంద్రబాబు చేసిన ట్వీట్‌కు సంచయిత గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. పీవీజీ రాజు గారి అసలైన వారసులు తన తండ్రి ఆనంద గజపతిరాజు అయితే ఆయన అసలైన వారసురాలు తానేనని ఘాటుగా రీట్వీట్ చేశారు. ప్రభుత్వం మాన్సాస్ ట్రస్ట్ విషయంలో అసలైన వారసులనే నియమించిందంటూ చురకలు అంటించారు. ఇప్పటికైనా చంద్రబాబు మాన్సాస్ ట్రస్ట్ పై రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. (చంద్రబాబుకు సంచయిత గట్టి కౌంటర్!) అశోక్ గజపతిరాజు అసలైన కోణం వాస్తవానికి గత ఏడాది సింహాచలం దేవస్ధానంతో పాటు మాన్సాస్ ట్రస్ట్ బోర్డు చైర్ పర్సన్‌గా ఆనంద గజపతిరాజు వారసురాలిగా సంచయిత గజపతిరాజుకి నియామకం చేయడాన్ని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు జీర్ణించుకోలేకపోయారు. చిన్న వయస్సులో తన అన్న కూతురుకి ఆ అవకాశం రావడంపై హర్షించాల్సిన అశోక్ గజపతిరాజు తనలోని అసలైన కోణాన్ని బయటపెడుతూ వ్యతిరేకించారు. ఆమెకు తమ కుటుంబంతో సంబంధం లేనట్టుగా.. తామొక్కరే పీవీజీ రాజు వారసులిగా ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయంలో మరో ముందడుగు వేసి న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. వాస్తవానికి సంచయిత గజపతిరాజు గత కొన్ని సంవత్సరాలుగా సన అనే స్వచ్చంద సంస్ధను స్ధాపించి విశాఖ, ఢిల్లీ తదితర ప్రాంతాలలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అప్పట్లో టీడీపీ మంత్రులు, ఎంపీలు సైతం ఈమె సేవా కార్యక్రమాలలో పాల్గొని అభినందించిన సంధర్బాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటివరకు సేవా కార్యక్రమాలను ప్రశంసించిన నేతలే ఆమెపై తాజా ఎదురుదాడికి పాల్పడుతూ విమర్శలు చేయడం ఆశ్చర్యం కలిగించకమానదు. (బాబాయ్ భ్రష్టు పట్టించారు) తండ్రి చితిమంటలు పూర్తిగా ఆరకముందే అయితే ఆమె మాన్సాస్ ట్రస్ట్‌కి చైర్ పర్సన్‌గా నియమితులైన తర్వాతే టార్గెట్ చెస్తూ టీడీపీ విమర్శలకు దిగడం ప్రారంభించింది. ఇదే సమయంలో తరచూ తనపై చేస్తున్న కుట్రలు, ఆరోపణలపై చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు అదే రీతిలో గట్టిగానే సమాధానాలు ఇచ్చేవారు. అయితే గత కొద్ది రోజులగా టీడీపీ తనపై ఉద్దేశ పూర్వకంగా విమర్శలు చేస్తోందని, ఎన్టీఆర్ మహిళలకి సమాన హక్కులు కల్పిస్తే చంద్రబాబు, అశోక్ గజపతిలు మాత్రం లింగ వివక్ష చూపుతున్నారని అన్నారు. ఇదే సమయంలో మాన్సాస్‌లో అక్రమాలు జరగకపోతే ఎందుకు భయపడుతున్నారని ఆమె ప్రశ్నించారు. తన తండ్రి చితిమంటలు పూర్తిగా ఆరకముందే అశోక్ గజపతి రాజుకి చైర్ పర్సన్ పదవి కట్టబెడుతూ రాత్రికి రాత్రే జీఓ ఇవ్వడం సమంజసమా అని ప్రశ్నించారు. చంద్రబాబు, తన బాబాయ్ అశోక్ గజపతిరాజులకి మాన్సాస్‌పై ప్రేమ కంటే అధికారంపై మక్కువన్నారు. నిజంగా చంద్రబాబుకి సింహాచలం దేవస్ధానంపై అభిమానం ఉంటే తన తండ్రి, తాతలా సంపాదించిన ఆస్తుల్లో 500 కోట్లు ఇవ్వగలరా అని ప్రశ్నించారు. సంచయిత గజపతిరాజు సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకి ఇచ్చిన కౌంటర్ తీవ్ర కలకలమే రేపుతోంది. ఊహించని విధంగా సంచయిత గజపతిరాజు నుంచి రీట్వీట్ ఎదురుకావడంతో చంద్రబాబు మాత్రం గప్ చుప్ అయ్యారు. -
గజపతి రాజు బిడ్డను నేను