
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం ఆలయ ట్రస్ట్ బోర్డులో నూతనంగా ముగ్గురు సభ్యుల నియామకం జరిగింది. ఆ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేవీ నాగేశ్వరరావు, పార్వతీదేవి, కే లక్ష్మణకుమార్‌లను ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నియమించింది. కాగా.. గతంలో సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్‌పర్సన్‌గా, మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(మాన్సాస్) ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా ఆనందగజపతి కుమార్తె సంచయిత గజపతిరాజును నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. (సంచలనమైన సీఎం జగన్ నిర్ణయం)
Comments
Please login to add a commentAdd a comment