simhachalam devasthanam
-
ఘనంగా సింహాద్రి అప్పన్న డోలోత్సవం
-
సింహాచలం చందనోత్సవం సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ సమీక్ష
-
పవన్ వ్యాఖ్యలకు సంచయిత కౌంటర్
సాక్షి, అమరావతి: తనను హిందూయేతర వ్యక్తిగా చిత్రీకరించే ప్రచారాలను నమ్మవద్దంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు, మన్సాస్ ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ సంచయిత గజపతిరాజు హితవు పలికారు. తన తల్లిదండ్రులు హిందువులని, తాను కూడా హిందూ ధర్మాన్ని పాటిస్తానని స్పష్టం చేశారు. తాను అన్నిమతాలను గౌరవిస్తానని పేర్కొన్నారు. సింహాచలం దేవస్థానం, మన్సాస్ ట్రస్టు విషయంలో గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన అక్రమాలు బయటకు తీస్తున్నందునే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, కాబట్టి తన గురించి చేసిన వ్యాఖ్యలను సరిదిద్దుకోవాలని పవన్‌కు సూచించారు. మరో ప్రకటన విడుదల చేయడమో లేదా తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వడమో చేయాలన్నారు. హుందాతనం ఉన్న వ్యక్తిగా పవన్ నుంచి ఇదే ఆశిస్తున్నా అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. (చదవండి: సంచయితపై కేంద్రం ప్రశంసలు) ఈ మేరకు.. ‘పవన్‌కల్యాణ్ గారు.. మీ ప్రెస్ కాన్ఫరెన్సులో మాన్సాస్ ట్రస్ట్ ఒక హిందూయేతర వ్యక్తి నేతృత్వంలో ఉందన్నారు. అందుకే నిజాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను ఆనంద గజపతి రాజు, ఉమా గజపతి రాజుల పెద్ద కుమార్తెను. ఇద్దరూ హిందువులే. మా అమ్మగారు పునర్వివాహం చేసుకున్న రమేశ్ శర్మగారు హిందు పురోహిత కుటుంబం నుంచి వచ్చారు. ఆయన 6 సార్లు జాతీయ అవార్డు పొంది, ఒకసారి ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయిన ఫిల్మ్ మేకర్. టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని, పచ్చి అబద్ధాలను దయచేసి నమ్మకండి. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం విషయంలో వారు చేసిన అవకతవకలు, అక్రమాలు ఫోరెన్సిక్ ఆడిట్లో బయటపడతాయని తెలుగుదేశం పార్టీకి భయం పట్టుకుంది. (చదవండి: మా కుటుంబం జోలికి రావొద్దు: సంచయిత) మీలాగే నేను కూడా ఒక హిందువుగా అన్ని మతాలను గౌరవిస్తాను. మీ వ్యాఖ్యలను సరిదిద్దుకుంటూ మరో ప్రకటన చేయాలని కోరుతున్నాను. చంద్రబాబునాయుడు గారు, ఆయన అనుచర వర్గం చేస్తున్న అవాస్తవ ప్రచారానికి, కట్టుకథలకు మీ ప్రకటన ద్వారా అడ్డుకట్ట వేయాలని కోరుతున్నాను. హుందాతనం కలిగిన వ్యక్తిగా మీ నుంచి నేను ఇదే ఆశిస్తున్నాను’ అంటూ ట్విటర్ వేదికగా టీడీపీ, చంద్రబాబు తీరును ఎండగడుతూనే పవన్ కల్యాణ్‌కు సైతం దుష్ప్రచారాలు నమ్మవద్దంటూ సంచయిత హితవు పలికారు. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ పవన్, టీడీపీతో బంధాన్ని వదులుకోలేకపోతున్నారని, అందుకే కాషాయ పార్టీకి చెందిన మహిళ గురించి తెలుగుదేశం పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలకు ఆయన వంతపాడుతున్నారంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. -
అశోక్ గజపతిపై సంచయిత ఘాటు వ్యాఖ్యలు
-
అశోక్ గజపతిపై సంచయిత ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, విజయనగరం : అశోక్ గజపతిరాజుపై సింహాచలం దేవస్ధానం చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవస్థానం అభివృద్ధి కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. కేంద్రమంత్రిగా ఉండికూడా కనీసం అభివృద్ధి చేయడానికి ప్రయత్నించలేదని విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రిమేజ్ రెజువినేషన్ అండ్ స్పిర్చువల్ అజ్‌మెంటేషన్ డ్రైవ్(ప్రసాద్) స్కీమ్‌కు తిరుపతి, శ్రీశైలం దేవస్థానాలను గుర్తించినా.. గతంలో సింహాచలం దేవస్థానాన్ని ఎందుకు ప్రతిపాదించలేనది నిలదీశారు. కేంద్రం, రాష్ట్రంలోనూ వారే అధికారంలో ఉన్నారని అయినా కూడా కనీస ప్రయత్నం చేయలేదని విమర్శించారు. అప్పటి ముఖ్యమంత్రిచంద్రబాబు, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుకి నిజమైన ప్రేమ ఉంటే కేంద్రానికి ప్రతిపాదనలు పంపేవారు కదా అని వ్యాఖ్యానించారు. గురువారం మీడియాతో మాట్లాడిన సంచయిత.. మన్సాస్ అభివృద్ధిపై గత ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని తప్పుపట్టారు. (సంచయిత గజపతి రాజుకు కేంద్రం ప్రశంసలు) ప్రధాని, సీఎంకు కృతజ్ఞతలు.. నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రిమేజ్ రెజువినేషన్ అండ్ స్పిర్చువల్ అజ్‌మెంటేషన్ డ్రైవ్(ప్రసాద్) పథకానికి సింహాచలం దేవస్థానాన్ని ఎంపిక చేస్తున్నట్లు కేంద్రం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర పర్యాటక మంత్రి ప్రహ్లాద్ పటేల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్‌కు ప్రత్యేక కృతజ్ణతలు తెలిపారు. ‘దేవస్థానం భూముల్లో మొక్కల పెంపకంలో ఎకరానికి లక్ష రూపాయిలిచ్చే స్కీమ్‌ని కేంద్రం ప్రవేశపెట్టినా గత పాలకులు అప్పట్లో నిర్లక్ష్యం చేశారు. ప్రసాద్ స్కీమ్‌లో సింహాచలం దేవస్ధానాన్ని చేర్చాలని ఎందుకు ప్రతిపాదించలేదు. సింహాచలం దేవస్ధానంలో వృధాగా ఉన్న వేలాది ఎకరాలలో ఈ పధకం క్రింద అభివృద్ది చేసే అవకాశాన్ని అశోక్ గజపతిరాజు ఎందుకు పట్డించుకోలేదు. ఉత్తరాంద్రతో పాటు సింహాచలంపై చంద్రబాబు, అశోక్ గజపతిల కపటప్రేమ ఉత్తరాంధ్ర ప్రజలు గమనించాలి. అతి పురాతనమైన మోతీ మహల్‌ని రాత్రికి రాత్రే కూల్చేశారు. (అవకాశం వస్తే రాజకీయాల్లోకి: ఊర్మిళ) అన్ని విమర్శలకి సమాధానం చెబుతా మోతీ మహల్ లాంటి పురాతన కట్టడాల అభివృద్దికి కేంద్రం నిదులిచ్చే అవకాశం ఉన్నా కూడా ఎందుకు కూల్చేశారు. కేంద్ర, రాష్డ్ర ప్రభుత్వాల సహకారంతో సింహాచలం దేవస్ధానాన్ని పూర్తిగా అభివృద్ది చేస్తాను. ప్రసాద స్కీమ్ లో సింహాచలం దేవస్ధానం ఎంపికకావడం చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపటం వల్లే కేంద్రం ఈ స్కీమ్ లో సింహాచలం దేవస్ధానానికి అవకాశం కల్పించింది. మార్చ్ నెలలో కేంద్ర పర్యాటక మంత్రిని కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలని ఫాలో అప్ చేశా. ఈ పధకంలో కేంద్రం ఇచ్చే నిధులతో భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించగలుగుతాం. గత చైర్మన్ అశోక్ గజపతిరాజు సింహాచలంపై భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నాకు చైర్ పర్సన్ గా అవకాశం ఇచ్చారు. సింహాచలం దేవస్ధానం అభివృద్ది చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నా. నా పనితీరు ద్వారానే నాపై విమర్శలు చేస్తున్న వారికి సమాధానం చెబుతాను. (మళ్లీ తెరపైకి విజయనగర సామ్రాజ్యం) -
సింహాచలం ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకం
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం ఆలయ ట్రస్ట్ బోర్డులో నూతనంగా ముగ్గురు సభ్యుల నియామకం జరిగింది. ఆ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేవీ నాగేశ్వరరావు, పార్వతీదేవి, కే లక్ష్మణకుమార్లను ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నియమించింది. కాగా.. గతంలో సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్‌పర్సన్‌గా, మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(మాన్సాస్) ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా ఆనందగజపతి కుమార్తె సంచయిత గజపతిరాజును నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. (సంచలనమైన సీఎం జగన్ నిర్ణయం) -
వారసుల పోరు
-
అవకాశం వస్తే రాజకీయాల్లోకి
-
అవకాశం వస్తే రాజకీయాల్లోకి: ఊర్మిళ
సాక్షి, విజయనగరం: తన తండ్రి మరణం అనంతరం అశోక గజపతిరాజు అనేక రాజకీయ కుట్రలకు ప్రయత్నించారని ఆనంద గజపతిరాజు, సుధా కూతురు ఊర్మిళా గజపతిరాజు విమర్శించారు. సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్ట్ విషయంలో మా బాబాయ్ రాజకీయం చేయడం తమను ఎంతో బాధించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మాన్సాస్ ట్రస్ట్ నుంచి తమను ఉద్దేశపూర్వకంగా దూరం చేయాలని అనేక ప్రయత్నాలు చేశారని అన్నారు. తన తండ్రి మరణం అనంతరం ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తున్నా అని, భవిష్యత్‌లో అవకాశం వస్తే తప్పనిసరిగా రాజకీయాల్లో దిగుతానని ఊర్మిళ తెలిపారు. అనంద గజపతి రాజు 70వ జన్మదినం సందర్భంగా ఆమె సాక్షి టీవీతో మాట్లాడారు. (సంచయితపై బాబు, అశోక్ రాజకీయ కుట్ర) ‘నాన్న ఆనంద గజపతిరాజు గారు నిత్యం ప్రజల కోసం ఆలోచించే వారు. ఆనంద గజపతిరాజు చాలా సాధారణ జీవితం గడిపారు. ఆయన ఎప్పుడూ పీవీజీ రాజు (తాత) ఆశయాలను కొనసాగించడం కోసమే పనిచేశారు. అందులో భాగంగానే ఇంజినీరింగ్ కాలేజీలు స్ధాపించడం, మాన్సాస్ ట్రస్ట్ బాగా నడిపించడం చేశారు. మెడికల్ కాలేజీ పెట్టాలి అనేది నాన్నగారి కల. ఆయన బ్రతికి ఉండి ఉంటే తప్పనిసరిగా మెడికల్ కాలేజీ నిర్మించేవారు. కుటుంబ సభ్యులను కాకుండా ఆయన దగ్గర పనిచేసే వారిని కూడా చాలా బాగా చూసుకునే వారు. మా నాన్న మరణించేటప్పటికి నా వయసు 16 సంవత్సరాలు. మా బాబాయ్ మా నాన్న మరణం తర్వాత ట్రస్ట్ బాధ్యతలు చేపట్టడానికి మాకు అర్హత లేదన్నారు. (చంద్రబాబుకు సంచయిత గట్టి కౌంటర్!) తాతగారు ఏ ఉద్దేశంతో ట్రస్ట్ పెట్టారో మా నాన్న ఆనంద గజపతిరాజు దాన్ని అలాగే కొనసాగించారు. దురదృష్టవశాత్తు నాన్న మరణం తర్వాత బాబాయి ఆ ఉద్దేశంతో ట్రస్ట్ కొనసాగించలేదు. అశోక్‌ను చైర్మన్‌గా టీడీపీ ప్రభుత్వం జీవో ఇచ్చిన సమయంలో కనీసం మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు. ప్రభుత్వం ఇచ్చిన జీవో మమ్మల్ని బాగా బాధ పెట్టింది. ఆ జీవోని ఉపయోగించుకుని మమ్మల్ని ట్రస్ట్‌కు దూరం చేశారు. నాన్న మరణం తర్వాత సింహాచలం దేవస్థానం వేడుకలకు ఆహ్వానించడం జరగలేదు. భవిష్యత్తులో మా నాన్న, మా తాత గారు లా ప్రజలకు సేవ చేస్తా. అవకాశం వస్తే తప్పనిసరిగా రాజకీయాల్లోకి వస్తా’ అంటూ తన మనసులోని మాటను చెప్పారు. -
చంద్రబాబుకు సంచయిత గట్టి కౌంటర్!
సాక్షి, అమరావతి: గజపతి వంశస్థుల హక్కులు కాపాడాలంటూ కొత్త రాగం ఎత్తుకున్న టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు, మన్సాస్ ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ సంచయిత గజపతిరాజు గట్టి కౌంటర్ ఇచ్చారు. తన చిన్నాన్న అశోక్ గజపతిరాజు వలె చంద్రబాబు లింగ వివక్ష చూపరని భావిస్తున్నానని పేర్కొన్నారు. గజపతి వంశానికి చట్టబద్ధ వారసుడైన ఆనంద గజపతికి తాను వారసురాలిని అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. తమ కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చి.. ప్రతీ విషయాన్ని రాజకీయం చేయడం తగదని చంద్రబాబుకు హితవు పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఏపీ ప్రభుత్వంపై బురదజల్లాలని చూసిన ఆయనకు ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు.. ‘‘నేను సంచయిత గజపతి. మా తాత మహరాజా పీవీజీ రాజు పెద్ద కుమారుడు, చట్టబద్ధమైన వారుసుడైన నా తండ్రి ఆనంద గజపతికి చట్టబద్దమైన వారసురాలిని. అశోక్ గజపతిలాగా చంద్రబాబు గారు కూడా లింగ వివక్ష చూపించరని ఆకాంక్షిస్తున్నా. గజపతి వంశానికి తానొక్కడినే వారసుడినని, నేను అనే వ్యక్తిని లేను అన్నట్లుగా అశోక్ గజపతి మిమ్మల్ని తప్పుదోవ పట్టించారనుకుంటున్నా. గజపతి కుటుంబ వ్యవహారాలకు దూరంగా ఉంటే బాగుంటుంది. రాజకీయం చేయాలని చూడవద్దు’’ అని సంచయిత ట్వీట్ చేశారు. సింహాచలం, మన్సాస్ బోర్డు చైర్ పర్సన్‌గా తన నియామకం జరిగినందున గజపతి కుటుంబ హక్కులకు ఎటువంటి భంగం కలుగలేదని స్పష్టం చేశారు. (చంద్రబాబు వివరణ ఇవ్వగలరా?: సంచయిత) కాగా 2016 ఏప్రిల్‌లో మన్సాస్ వ్యవహారం ఆనాటి టీడీపీ ప్రభుత్వం చేతిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చెరుకూరి కుటుంబరావు, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మాజీ కులపతి ఐవీ రావులను ట్రస్టు సభ్యులుగా నియమిస్తూ అప్పటి ప్రభుత్వం 2016 ఏప్రిల్ 7న జీవో 139 జారీ చేసింది. ఆ తర్వాత 2017 ఏప్రిల్ 27న వారిద్దరిన్నీ కొనసాగిస్తూనే... జీవో నంబర్ 155 ద్వారా అశోక్‌గజపతి కుమార్తె అదితి విజయలక్ష్మిని కూడా బోర్డు సభ్యురాలిగా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు. అయితే అప్పుడు పూసపాటి వారసురాలైన ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయితను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. కేవలం రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తమ ఇష్టానుసారం వ్యవహరించారు. ఈ క్రమంలో సింహాచలం దేవస్థానం పరిధిలోని పంచ మాల భూ సమస్యల పరిష్కారం దిశగా ముందడుగు వేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం... ఈ ఏడాది మార్చిలో ట్రస్టు చైర్‌పర్సన్‌గా సంచయితను నియమించింది. అదే విధంగా... అశోక్ గజతిరాజు కుమార్తె అదితి విజయలక్ష్మిని కూడా సభ్యురాలిని చేసి.. ఆమెతో పాటు మొత్తంగా ఇదే కుటుంబానికి చెందిన ముగ్గురికి మాన్సాస్ ట్రస్టుబోర్డులో స్థానం కల్పించింది. ఈ నేపథ్యంలో అశోక్ గజపతిరాజు సింహాచలం దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్‌పర్సన్‌గా, మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(మాన్సాస్) ట్రస్ట్ చైర్మన్‌గా ఉండే హక్కు మహిళలకు లేదన్నట్లుగా మాట్లాడటంతో పాటు సంచయిత నియామకంపై విమర్శలు గుప్పించడం గమనార్హం. ప్రస్తుతం చంద్రబాబు సైతం ఇదే రాగాన్ని ఆలపిస్తున్నారు. సింహాచలం ట్రస్టు బోర్డు చైర్‌పర్సన్‌గా గజపతి వారసురాలు ఉన్నప్పటికీ.. వారి కుటుంబ హక్కులకు భంగం వాటిల్లిందంటూ బాబు ట్వీట్లు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
అవన్నీ బాబు, బాబాయ్ కలిసే చేశారట!
సాక్షి, అమరావతి: సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు, మాన్సాస్ ట్రస్ట్ బోర్డు చైర్‌పర్సన్‌గా తన నియామకంపై వస్తున్న విమర్శలను సంచయిత గజపతిరాజు తిప్పికొట్టారు. ‘ఆనంద గజపతిరాజుగారి పెద్దబిడ్డగా, ఆయన వారసురాలిగా మాన్సాస్ బాధ్యతలను చేపట్టానన్న విషయాన్ని చంద్రబాబుగారు తెలుసుకోవాలి. మా తండ్రి చితి ఆరకముందే మీరు, మా బాబాయ్ అశోక్ గజపతిరాజుకు అనుకూలంగా జీవో జారీ చేశారు’అని మాజీ ఎంపీ అశోక్ గజపతిరాజు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘అశోక్ గజపతిరాజుగారి పదవీకాలంలో తప్పుడు చర్యలు కారణంగా మాన్సాస్ ఆర్థికంగా నష్టపోయింది. విద్యాసంస్థల్లో నాణ్యత పడిపోయింది. ట్రస్టు భూములు పరులపాలవుతుంటే ఆ కేసులను వాదించడానికి కనీసం లాయర్‌ను నియమించలేదు. విశాఖ అడిషనల్ జిల్లా జడ్జి తీర్పే ఉదాహరణ’అని మరో ట్వీట్లో పేర్కొన్నారు. (చదవండి: చంద్రబాబు వివరణ ఇవ్వగలరా?: సంచయిత) మీ ఇద్దరూ కలిసి చేసినవే..! ‘మాన్సాస్ లా కాలేజీ క్యాంపస్‌ను ఐఎల్ఎఫ్ఎస్కు ఉచితంగా ఇచ్చేశారు. విద్యార్థులను షెడ్డుల్లోకి మార్చారు. చివరకు ఐఎల్ఎఫ్ఎస్ ఎలాంటి కుంభకోణంలో ఇరుక్కుందో జాతీయ స్థాయిలో అందరికీ తెలిసిందే. చంద్రబాబుగారు తన సహచరుడ్ని పొగిడేముందు మా తాతగారు, మా తండ్రిగారి వారసత్వాన్ని ఏ విధంగా ధ్వంసంచేశారో తెలుసుకోవాలి. వాస్తవం ఏంటంటే.. ఇవన్నీ మీకు తెలిసి, మీ ఇద్దరూ కలిసి చేసినవే అని ప్రజలు చెప్తున్నారు’అని సంచయిత విమర్శించారు. -
నాడు టీడీపీ ట్రస్టు బోర్డుగా మన్సాస్!
సాక్షి, అమరావతి: సింహాచలం దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్‌పర్సన్‌గా, మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(మాన్సాస్) ట్రస్ట్ చైర్మన్‌గా ఉండే హక్కు మహిళలకు లేదంటూ మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు వాదించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అశోక్ గజపతిరాజు సోదరుడు ఆనందగజపతి కుమార్తె సంచయిత గజపతిరాజును దేస్థానం ట్రస్టు బోర్డు, మన్సాన్ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ఇటీవల ప్రమాణం స్వీకారం చేసి.. తనకు ఇంతటి బృహత్తర బాధ్యతలను అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ పరిణామాలపై అశోక్ గజపతి అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో సంచయితకు కీలక బాధ్యతలు అప్పగించడాన్ని సహించలేకపోతున్న ఆయనకు గతంలో జరిగిన పరిణామాలు గుర్తుకురావడం లేదా అంటూ పలువురు విమర్శిస్తున్నారు. (సంచలనమైన సీఎం జగన్ నిర్ణయం ) కాగా 2016 ఏప్రిల్‌లో మాన్సాస్ వ్యవహారం టీడీపీ చేతిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ చెరుకూరి కుటుంబరావు, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మాజీ కులపతి ఐవీ రావులను ట్రస్టు సభ్యులుగా నియమిస్తూ అప్పటి ప్రభుత్వం 2016 ఏప్రిల్ 7న జీవో 139 జారీ చేసింది. ఆ తర్వాత 2017 ఏప్రిల్ 27న వారిద్దరిన్నీ కొనసాగిస్తూనే... జీవో నంబర్ 155 ద్వారా అశోక్‌గజపతి కుమార్తె అదితి విజయలక్ష్మిని కూడా బోర్డు సభ్యురాలిగా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు. అయితే అప్పుడు పూసపాటి వారసురాలైన ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయితను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. కేవలం రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తమ ఇష్టానుసారం వ్యవహరించారు. ఈ క్రమంలో సింహాచలం దేవస్థానం పరిధిలోని పంచ మాల భూ సమస్యల పరిష్కారం దిశగా ముందడుగు వేసిన ప్రభుత్వం... తాజాగా ట్రస్టు చైర్‌పర్సన్‌గా సంచయితను నియమించింది. అదే విధంగా... అశోక్ గజతిరాజు కుమార్తె అదితి విజయలక్ష్మిని కూడా సభ్యురాలిని చేసి.. ఆమెతో పాటు మొత్తంగా ఇదే కుటుంబానికి చెందిన ముగ్గురికి మాన్సాస్ ట్రస్టుబోర్డులో స్థానం కల్పించింది. -
సంచలనమైన సీఎం జగన్ నిర్ణయం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లా చరిత్రలో మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్‌పర్సన్‌గా, మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(మాన్సాస్) ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా ఆనందగజపతి కుమార్తె సంచయిత గజపతిరాజును నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. తనకు ఇంతటి బృహత్తర బాధ్యతలను అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంచయిత గజపతిరాజు కృతజ్ఞతలు తెలిపారు. మాన్సాస్ ట్రస్ట్‌కు సంబంధించి జరిగిన ఈ పరిణామం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్నో ఏళ్లుగా నిరంకుశంగా మాన్సాస్‌పై పెత్తనం చెలాయిస్తున్నవారికి గట్టి దెబ్బ తగిలిందని జనం చర్చించుకోవడం మొదలైంది. విద్యాభివృద్ధే ధ్యేయంగా మాన్సాస్ ఆవిర్భావం 1958లో దివంగత పి.వి.జి.రాజు నెలకొల్పిన మాన్సాస్ సంస్థ విద్యా వ్యవస్థను అభివృద్ధి పరిచేందుకు విద్యా సంస్థలను నడుపుతోంది. 1958లో పీవీజీ రాజు వ్యవస్థాపక చైర్మన్ కాగా ఆనంద గజపతిరాజు, అశోక్ గజపతిరాజు ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఉండేవారు. 1994లో పి.వి.జి.రాజు మరణం తర్వాత ఆనంద గజపతిరాజు చైర్మన్ అయ్యారు. 2016లో ఆయన మరణం తర్వాత అశోక్ గజపతిరాజు చైర్మన్ బాధ్యతలు తీసుకున్నారు. అశోక్ కుమార్తె అథితి గజపతిరాజు ట్రస్ట్ బోర్డు మెంబర్‌గా తెరపైకి వచ్చారు. 13వేల ఎకరాల భూమి, విలువైన ఆస్తులను కలిగిన మాన్సాస్ సంస్థ చైర్మన్‌గా, సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్తగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఇప్పటి వరకూ ఉన్నారు. బుధవారం ఉదయం సంచయిత గజపతిరాజు సింహాచలం దేవస్థానానికి వెళ్లి ట్రస్ట్ బోర్డు చైర్‌పర్సన్‌గా ప్రమాణస్వీకారం చేశారు. సింహాచలం ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ పదవిని చేపట్టిన మొదటి మహిళగా ఆమెకు ఘనత దక్కింది. ఎమ్మెల్యే కోలగట్లతో భేటీ సింహాచలం నుంచి సంచయిత గజపతిరాజు నేరుగా విజయనగరం చేరుకుని స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్సార్సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావుతో పాటు పలువురు పార్టీ నాయకులతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి, యువజన నాయకుడు ఈశ్వర్ కౌశిక్‌తో కలిసి విజయనగరం కోటలోని మాన్సాస్ ట్రస్ట్ కార్యాలయానికి చేరుకున్నారు. పి.వి.జి.రాజు విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించి మాన్సాస్ ట్రస్ట్ బాధ్యతలను చైర్పర్సన్ హోదాలో స్వీకరించారు. త్వరలోనే ట్రస్ట్ డైరెక్టర్లతో సమావేశం నిర్వహించి, అన్ని విషయాలపై చర్చిస్తామని ఈ సందర్భంగా సంచయిత గజపతిరాజు స్పష్టం చేశారు. పూసపాటి వంశీయురాలిగా... సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్లుగా పూసపాటి వంశీయులే కొనసాగుతున్నారు. గతంలో పూసపాటి ఆనందగజపతి రాజు ఉన్నప్పుడు ఆయనే ధర్మకర్తగా ఉండేవారు. ఆయన మరణం తరువాత సోదరుడైన అశోక్ గజపతి బాధ్యతలు తీసుకుని నేటి వరకూ కొనసాగారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులను నియమించింది. విజయనగరం జిల్లాకు చెందిన వారికి దానిలో ప్రాతినిధ్యం కల్పించింది. ఆనంద గజపతి, అశోక్ గజపతి అన్నదమ్ములైనప్పటికీ రాజకీయంగా ఎవరిదారి వారిదే అన్నట్లుగా ఉండేది. అశోక్ టీడీపీలో ఉంటే ఆనందగజపతి కాంగ్రెస్, టీడీపీల్లో పనిచేశారు. ఆయన కుమార్తె అయిన సంచయిత గజపతిరాజు ఢిల్లీలో స్థిర నివాసం అయినప్పటికీ విశాఖ ఏజెన్సీలో పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పారిశుధ్ధ్యం, తాగునీరు రంగాల్లో విశిష్ట సేవలందించిన సంస్థలకు ఇచ్చే గూగుల్ గ్లోబల్ ఇంపాక్ట్ చాలెంజ్ అవార్డును 2013లో సాధించారు. ఆ విజయంతో వచ్చిన రూ.3 కోట్లను సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఇరవై గ్రామాలు, మరో ఇరవై స్కూళ్లకు తాగునీటి సదుపాయాన్ని కల్పించారు. కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల తీసుకున్న మూడురాజధానుల నిర్ణయాన్ని సంచయిత గజపతి స్వాగతించారు. విజయనగరం గడ్డపై పుట్టిన సంచయిత చెన్నై, కేరళ, ఢిల్లీలో పెరిగి ఇప్పుడు సొంత గడ్డమీద బృహత్తర బాధ్యతను తన భుజాలపైకి ఎత్తుకున్నారు. (చదవండి: 26 లక్షల మందికి ఇళ్ల స్థలాలు) -
‘పంచ గ్రామాల’కు ప్రత్యేక కమిటీ
దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోక.. దేకుతున్న సింహాచలం పంచ గ్రామాల భూసమస్య పరిష్కారం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ సర్కారు ఎన్నికలకు ముందు జీవోల పేరుతో మాయ చేసిందే తప్ప సమస్యకు పరిష్కారం చూపలేదు. మరోవైపు ప్రజాసంకల్పయాత్రలో ప్రజలు విన్నవించిన ఈ సమస్యను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ హామీని నిలబెట్టుకునేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నెలన్నర రోజుల్లోనే ఈ అంశంపై న్యాయ నిపుణులతో చర్చలు జరపడమే కాకుండా.. తాజాగా అధ్యయన కమిటీ వేయడం ద్వారా తమది చేతల ప్రభుత్వమని నిరూపించారు. కమిటీ నివేదిక ఆధారంగా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. సాక్షి, విశాఖ సిటీ: సింహాచలం దేవస్థానం పరిధిలోని పంచ మాల భూ సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆరుగురు సభ్యులతో ప్రత్యేక అధ్యయన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చైర్మన్‌గా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ వ్యవహరిస్తారు. సభ్యులుగా పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, ముఖ్యమంత్రి ప్రత్యేక సలహదారు అజేయకల్లాం, పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్, జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్ ఉంటారు. మెంబర్ కన్వీనర్‌గా సింహాచలం దేవస్థానం ఈవోను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమస్యపై పూర్తి అవగాహన ఉన్న ఏ అధికారి అయినా, వ్యక్తి అయినా ఈ కమిటీకి సహకారం అందించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజాసంకల్ప యాత్రలో హామీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్య పరిష్కరిస్తామని ప్రజాసంకల్పయాత్ర, ఎన్నికల ప్రచార సమయాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పంచగ్రామాల ప్రజలకు భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే. చెప్పినట్లుగానే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. తొలి కేబినెట్ మీటింగ్‌లోనే ఈ సమస్యను ప్రస్తావించారు. అనంతరం దేవాదాయ శాఖ మంత్రి శ్రీనివాస్ విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతితో ప్రత్యేకంగా సమావేశమై సమస్య పరిష్కారానికి సహకరించాలని అభ్యర్థించారు. స్వామీజీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. వెనువెంటనే మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వెలంపల్లి శ్రీనివాస్‌లు ప్రత్యేకంగా సమావేశమై అధికారులతో చర్చించారు. కాగా ఈ నెల 16న అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ ఈ అంశాన్నిప్రస్తావించారు. దీనికి మంత్రి వెలంపల్లి స్పందిస్తూ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని..కోర్టు పరిధిలో ఉన్నందున న్యాయపరమైన అంశాలను పరిష్కరించాలని కోరుతూ అడ్వకేట్ జనరల్‌తో చర్చలు జరిపామని సమాధానం చెప్పారు. సరిగ్గా తొమ్మిది రోజుల తర్వాత గురువారం అధ్యయన కమిటీని వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం. వంద రోజుల్లో అని ఊరించిన టీడీపీ దాదాపు 23 ఏళ్లుగా ఉన్న ఈ సమస్యపై టీడీపీ ప్రభుత్వం గత ఐదేళ్లు ఓట్ల రాజకీయం మాత్రమే చేసింది. 100 రోజుల్లో పరిష్కరిస్తామని తప్పుడు హామీలు గుప్పించి 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఐదేళ్ల పాటు ఆ విషయాన్ని గాలికి వదిలేసింది. మొన్నటి ఎన్నికలకు ముందు మళ్ళీ ఓట్ల కోసం టీడీపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. వరుస జీవోలు, కమిటీలు వేస్తూ హడావుడి చేసింది. అయితే ఆ పార్టీ నేతల కుయుక్తులు పసిగట్టిన ప్రజలు ఎన్నికల్లో చావు దెబ్బ కొట్టారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి కనీసం 50 రోజులు కూడా పూర్తి కాకముందే ఈ సమస్య పరిష్కారానికి మార్గలను అన్వేషించింది. 100 శాతం చిత్తశుద్ధితో ముందుకు వెళుతోంది. మాటలతో కాకుండా చేతల్లో చూపిస్తూ ప్రజల ఆకాంక్షను అతిత్వరలో నెరవేర్చే దిశగా బలమైన అడుగులు వేస్తోంది -
కరుగుతున్న వెండి కొండలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ఆలయాల్లో వెండి నిల్వలు కొండల్లా పేరుకుపోతున్నాయి. శ్రీకాళహస్తి, శ్రీశైలం, విజయవాడ, సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల ఇలా ప్రముఖ దేవాలయాల్లో వేల కిలోల వెండి నిల్వలు ఉన్నాయి. వీటిని భద్రపరచడం ఆయా దేవస్థానాలకు భారంగా మారింది. బ్యాంకుల్లో వెండిని డిపాజిట్ చేస్తే వడ్డీ ఇచ్చే విధానం లేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం బంగారాన్ని బ్యాంకుల్లో బాండ్ల రూపంలో దాచుకునే పథకాన్ని ప్రకటించి వడ్డీ కూడా చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా దేవాలయాలు తమ వద్ద ఉన్న వెండి నిల్వలను అమ్మి బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఏకంగా 21 వేల కిలోల వెండి నిల్వలు ఉన్నాయి. శని దోష నివారణకు భక్తులు శ్రీకాళహస్తిలో రాహు–కేతు పూజలు నిర్వహించి వెండి నాగ పడగలను సమర్పిస్తుంటారు. ఇక్కడే కాకుండా.. శ్రీశైలం, విజయవాడ, సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల ఆలయాల్లో కూడా ప్రతి చోటా వెయ్యి కిలోలకు పైగా వెండి నిల్వలు పేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం బంగారాన్ని బాండ్ల రూపంలో దాచుకునే పథకాన్ని ప్రకటించడంతో.. దేవుడి బంగారు ఆభరణాలను డిపాజిట్ చేస్తే బ్యాంకులు వాటి విలువ ఆధారంగా ఆలయానికి వడ్డీ చెల్లించే వెసులుబాటు ఏర్పడింది. వెండి నిల్వలను డిపాజిట్ చేస్తే వడ్డీ చెల్లించే విధానం లేకపోవడంతో వాటిని అమ్మేందుకు జేఎస్వీ ప్రసాద్ దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు వెండిని అమ్మి బంగారంగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికనుగుణంగా డిసెంబర్లో శ్రీకాళహస్తి ఆలయం తమ దగ్గర ఉన్న వెండి నిల్వల్లో 14,935 కిలోల అమ్మకానికి ఈ – వేలం నిర్వహించింది. 10,282 కిలోల వెండితో 100 కిలోల బంగారం శ్రీకాళహస్తిలో 14,935 కిలోల వెండి ఆభరణాలను కరిగించగా.. కడ్డీల రూపంలో స్వచ్ఛమైన వెండి 10,282 కిలోలు వచ్చింది. ఈ వెండి కడ్డీలను ప్రభుత్వ రంగ సంస్థ మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎంఎంటీసీ)కి అమ్మగా రూ.33.29 కోట్లు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తంతో ఎంఎంటీసీ ద్వారా తిరిగి వంద కిలోల బంగారాన్ని కొనుగోలు చేశారు. ఈ బంగారాన్ని బాండ్ల రూపంలో బ్యాంకుల్లో డిపాజిట్ చేయనున్నట్టు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. శ్రీశైలంలో 2,400 కిలోల వెండి ఆభరణాలు ఉండగా, అందులో 500 కిలోలను కరిగించగా కడ్డీల రూపంలో స్వచ్ఛమైన వెండి 375 కిలోలు వచ్చినట్టు శ్రీశైల ఆలయ అధికారులు చెప్పారు. ఈ 375 కిలోల వెండిని ఎంఎంటీసీ ద్వారా అమ్మగా రూ.1.36 కోట్లు వచ్చాయి. ఈ మొత్తంతో 4.353 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. -
’ గో ’ సంరక్షణ ఎవరిది ?
-
భక్తులకు‘బఫే’ కష్టాలు..
పట్టించుకోని అధికారులు మంచినీరు కావాలన్నా తింటున్న కంచం పట్టుకు వెళ్లాల్సిందే.. మూడున్నరేళ్లయినా అందుబాటులోకి రాని రెండో అంతస్తు సింహాచలం : అన్నప్రసాదం స్వీకరించడంలో అప్పన్న భక్తులకు అవస్థలు తప్పడం లేదు. కౌంటర్లో కూపన్లు తీసుకోవడం నుంచి అన్నదాన భవనంలోకి ప్రవేశించడం, అన్న ప్రసాదం స్వీకరించడం వరకు నిల్చొని ఉండాల్సి వస్తోంది. మంచి నీరు కోసం కూడా తింటున్న కంచం పట్టుకుని వెళ్లాల్సిందే. భక్తుల కష్టాలను గుర్తించిన దేవస్థానం రూ.4 కోట్లు వెచ్చించి సింహగిరిపై రెండో అంతస్తులో అన్నదాన భవనం నిర్మించింది. ఆ భవనాన్ని మూడున్నరేళ్ల కిందట అందుబాటులోకి తెచ్చింది. ఈ భవనంలోని రెండో అంతస్తులో ఒకేసారి 600 నుంచి 700 మంది వరకు కూర్చొని అన్నప్రసాదం స్వీకరించవచ్చు. కానీ నేటీకీ ఇక్కడ బఫే పద్ధతిలోనే అన్నప్రసాద వడ్డన జరుగుతోంది. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దివ్యక్షేత్రం పనులు జరుగుతున్నప్పుడు తాత్కాలిక భవనాల్లో ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ.. పక్కా భవనం నిర్మించాకైనా తొలగిపోతాయని ఎదురుచూసిన భక్తులకు ఇప్పటికీ నిరాశే ఎదురవుతోంది. రాష్ర్టంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి క్షేత్రం ఒకటి. అప్పన్న స్వామిని దర్శించుకునేందుకు ప్రతీ రోజూ మన రాష్ట్రంతో పాటు తెలంగాణ, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. నిత్యాన్నదాన పథకంలో భాగంగా భక్తులకు దేవస్థానం అన్నప్రసాదం అందిస్తోంది. వీరి సౌకర్యార్థం భారీ అన్నదాన భవనాన్ని నిర్మించాలని 2008లో జరిగిన దివ్యక్షేత్రం పనుల్లో భాగంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. రూ.4 కోట్లు వెచ్చించి రెండంతస్తుల్లో భవన నిర్మాణం చేపట్టారు. మూడున్నరేళ్ల కిందటే దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. అయినప్పటికీ కింద అంతస్తులోనే భక్తులకు బఫే పద్ధతిలో అన్నప్రసాదం అందిస్తున్నారు. అన్నప్రసాదం కోసం రాజగోపురం వద్ద ఉన్న కౌంటర్లో ఇచ్చే కూపన్ల దగ్గర నుంచి అన్నదాన భవనంలోకి ప్రవేశించే వరకు భక్తులు క్యూలైన్లలోనే గంటల తరబడి నిలబడి ఉంటున్నారు. అన్నప్రసాదం అయినా కూర్చొని ఆరగించవచ్చని భవనంలోకి ప్రవేశించే భక్తులకు..అక్కడ కూడా నిరాశే ఎదురవుతోంది. కూర్చోవడానికి సరిపడా టేబుల్స్ లేకపోవడం, మంచినీరు కోసం కూడా తింటున్న కంచం పట్టుకుని వెళ్లాళ్సిన పరిస్థితుల మధ్య అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు సైతం నిలబడి అన్నప్రసాదం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు తీవ్ర రద్దీ నెలకొనడంతోఒకరినొకరు తప్పించుకోలేకపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఎప్పటికప్పుడు రెండవ అంతస్తును వినియోగంలోకి తీసుకొస్తామని, సిబ్బంది కొరత ఉందంటూ చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా తమ బాధలు అర్థం చేసుకోవాలని భక్తులు కోరుతున్నారు. మనస్ఫూర్తిగా ఉంటుంది అన్న ప్రసాదం కూర్చోబెట్టి వడ్డిస్తే తినే వారికి మనస్ఫూర్తిగా ఉంటుంది. అది ఎంతో తృప్తినిస్తుంది. దేవస్థానం అధికారులు స్పందించి ఆ విధంగా చర్యలు చేపట్టాలి. - అప్పారావు, అనకాపల్లి లిఫ్టు ఏర్పాటుపూర్తయితే.. అన్నదాన భవనంలో లిప్టు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. కింది అంతస్తు నుంచి పైఅంతస్తుకు లిఫ్టులో వండిన పదార్థాలు, ఇతర వస్తువులు చేర్చడానికి వీలు ఉంటుంది. దీని పనులు తొందరగా పూర్తి చేసి, రెండో అంతస్తును వినియోగంలోకి తీసుకొస్తాం. రెండతస్తుల్లోనూ భక్తులను కూర్చోబెట్టి అన్నవడ్డన చేస్తాం. - కె.రామచంద్రమోహన్, ఈవో తిరుమలలో కూర్చోబెట్టే వడ్డన చేస్తారు తిరుమలలో ఎంత మంది భక్తులు వచ్చినా.. కూర్చోబెట్టే అన్నప్రసాద వడ్డన చేస్తారు. సింహాచలంలో కూడా అలా చేయాలి. మొదట్లో ఇక్కడ కూడా అలానే ఉండేది. బఫే పద్ధతి వల్ల పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. చంటి పిల్లలను ఎత్తుకుని వడ్డన దగ్గరకి వెళ్లాలంటే అవస్థలు పడుతున్నాం. - వి.వీర్రాజు, తాటిచెట్లపాలెం